This Week Telugu OTT: సినిమా ప్రేమికులకు ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అదిరిపోయే ట్రీట్ ఇస్తున్నాయి. హారర్ థ్రిల్లర్లు, కామెడీ డ్రామాలు, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జానర్ల సినిమాలు నవంబర్ మూడో వీకెండ్ లో డిజిటల్ తెరపై సందడి చేస్తున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఇంట్లోనే కూర్చుని హాయిగా చూసేయడానికి ఈ వీకెండ్ లిస్ట్ సిద్ధంగా ఉంది.
కల్ట్ (CULT)

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన స్లాషర్ థ్రిల్లర్ 'కల్ట్' థియేటర్లలో విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. గోవాలోని ఓ పబ్‌లో జరిగే బర్త్ డే పార్టీ అనుకోకుండా మృత్యు క్రీడగా మారడం, దానిని డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) ఎలా ఛేదించాడన్నదే ఈ చిత్ర కథ. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
మయూఖ (Mayookha)
సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్లను ఇష్టపడే వారి కోసం 'మయూఖ' చిత్రం నవంబర్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైలెంట్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. పాయల్ చెంగప్ప, బిగ్ బాస్ ఫేమ్ అమన్ కీలక పాత్రల్లో నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది.
418
'కేజీఎఫ్', 'సలార్' చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో వచ్చిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ '418'. ఈ చిత్రం నవంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో 15 ఏళ్లుగా మూసివేసిన మెడికల్ కాలేజీ హాస్టల్‌లోని 'రూమ్ నం. 418' వెనుక ఉన్న భయానక రహస్యాన్ని చూపించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
క్రేజీ కళ్యాణం (Crazy Kalyanam)
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'క్రేజీ కళ్యాణం' ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. బద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీకే నరేష్, అఖిల్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లకు ముందుగా అందుబాటులోకి రాగా, నవంబర్ 20 నుంచి అందరికీ తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
అనుమాన పక్షి (Anumana Pakshi)
{{/usCountry}}అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'క్రేజీ కళ్యాణం' ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. బద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీకే నరేష్, అఖిల్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లకు ముందుగా అందుబాటులోకి రాగా, నవంబర్ 20 నుంచి అందరికీ తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
అనుమాన పక్షి (Anumana Pakshi)
{{/usCountry}}'డీజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా నటించిన సైక్ కామెడీ డ్రామా 'అనుమాన పక్షి' నవంబర్ 20 నుంచి సన్ నెక్స్ట్ (Sun NXT)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచిస్తూ కశ్మీర్ ట్రిప్‌లో చిక్కుల్లో పడే యువకుడి కథగా ఈ మూవీ సాగుతుంది.
కికు చిరంజీవి (Kiku Chiranjeevi)
శుభ సాయి వెంకట్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ 'కికు చిరంజీవి' జియోహాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. కుడివైపు గుండెతో పుట్టిన చిరు (కికు యనమల) గుర్తుతెలియని శత్రువుల నుంచి తనను తాను ఎలా కాపాడుకున్నాడు? అతని గురించి భార్య మానస (కశిష్ ఖాన్) తెలుసుకున్న షాకింగ్ నిజమేంటి? అన్నది ఈ సినిమా కథాంశం.
ఈటీవీ విన్‌లో స్పెషల్ రిలీజులు
తెలుగు ప్రేక్షకుల కోసం ఈటీవీ విన్ (ETV Win) ఈ వారం మూడు ఆసక్తికరమైన కంటెంట్‌లను తీసుకొస్తోంది. విభవ్ (సాయి విభవ్ ముల్లగురు) ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఆల్మోస్ట్ అర్జున్' ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక 'కథాసుధ' సిరీస్‌లో భాగంగా 'రంగస్థలం' నవంబర్ 22న ప్రీమియర్ కానుంది. వీటితో పాటు వినోదాన్ని పంచేందుకు 'రెచ్చిపోదాం బ్రదర్' కూడా ఈ వారం ఈటీవీ విన్ జాబితాలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.