...
...
Next Story

Director: కేజీఎఫ్, పుష్ప, ధురంధర్ సినిమాల్లో అసలు కథే లేదు.. డైరెక్టర్ సంచలన కామెంట్లు.. నెటిజన్ల ట్రోల్స్ మామూలుగా లేవు

Director Dhurandhar: బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వసూళ్లు రాబట్టిన 'ధురందర్', 'పుష్ప', 'కేజీఎఫ్' వంటి ఇండియన్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ చిత్రాలపై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తిగ్మాన్షు ధులియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. అతనిపై నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

Published on: Sep 9, 2026, 05:40:00 IST
Advertisement

Director Dhurandhar: బాలీవుడ్‌లో 'పాన్ సింగ్ తోమర్', 'హాసిల్' వంటి నేషనల్ అవార్డు పొందిన సినిమాలను తెరకెక్కించిన పాపులర్ దర్శకుడు, నటుడు తిగ్మాన్షు ధులియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ సినిమా ప్రస్తుత ట్రెండ్‌పై హాట్ కామెంట్లు చేశాడు. దీంతో ఆయనపై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి.

డైరెక్టర్ కామెంట్లు

కేజీఎఫ్, పుష్ప, ధురంధర్ సినిమాల్లో అసలు కథే లేదు.. డైరెక్టర్ సంచలన కామెంట్లు.. నెటిజన్ల ట్రోల్స్ మామూలుగా లేవు
కేజీఎఫ్, పుష్ప, ధురంధర్ సినిమాల్లో అసలు కథే లేదు.. డైరెక్టర్ సంచలన కామెంట్లు.. నెటిజన్ల ట్రోల్స్ మామూలుగా లేవు

కార్పొరేట్ కల్చర్, ఎక్స్‌ట్రీమ్ క్యాపిటలిజం సినిమా రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వివరిస్తూ డైరెక్టర్ తిగ్మాన్షు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో వచ్చిన అతిపెద్ద ఫ్రాంచైజ్ చిత్రాలైన 'కేజీఎఫ్', 'పుష్ప', 'ధురంధర్' చిత్రాలపై అతని వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఈ సినిమాలన్నీ ఒకే రకమైన టెంప్లేట్‌తో రూపుదిద్దుకుంటున్న 'ఫిక్షనల్ బయోపిక్స్' మాత్రమేనని, వాటిలో నిజమైన కథలు కరువయ్యాయని అతనన్నాడు.

ధురంధర్ లో కథ ఎక్కడుంది?

ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో తిగ్మాన్షు ధులియా మాట్లాడుతూ.. వేల కోట్ల వసూళ్లు సాధించిన 'ధురందర్' చిత్రం ప్రెజెంటేషన్, సంగీతం, టేకింగ్ బాగున్నాయని ప్రశంసించారు. అయితే ఆ సినిమాలో అసలైన కథే లేదని విమర్శించాడు. ఒక ఇండియన్ స్పై అండర్‌కవర్ ఏజెంట్‌గా పాకిస్థాన్‌లోకి వెళ్లి అక్కడ విధ్వంసం సృష్టించడాన్ని అసలు కథ అని ఎలా అంటారంటూ తిగ్మాన్షు ప్రశ్నించాడు.

కొత్త కథలు చెప్పే రచయితలు, దర్శకులు మాయమయ్యారని, ఒకవేళ చెప్పాలనుకున్నా కార్పొరేట్ వ్యవస్థలు అలాంటి సినిమాలను తీయనివ్వడం లేదని తిగ్మాన్షు వివాదాన్ని రేకెత్తించాడు.

భగ్గుమంటున్న నెటిజన్లు

ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిన బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ చిత్రాలను అసూయతో విమర్శిస్తున్నారంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించే సినిమాలు తీయలేకనే ఇటువంటి విమర్శలు చేస్తున్నారంటూ నెటిజన్లు ఆయనను నెట్టింట తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks