Friday Top OTT Release: ఈ రోజు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేసేందుకు 5 విభిన్నమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో వివాదాస్పద అంథాలజీ 'లస్ట్ స్టోరీస్ 3'తో పాటు 'మొదరాతిరి', 'ఇరుముడి', హారర్ సిరీస్ 'మాన్‌స్టర్: ది లిజ్జీ బోర్డెన్ స్టోరీ' స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరోవైపు జియోహాట్‌స్టార్‌లో మార్షల్ ఆర్ట్స్ థ్రిల్లర్ 'తుడక్కమ్' పాన్-ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
ఇరుముడి వచ్చేసిందోచ్

ఓటీటీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లేటెస్ట్ తెలుగు సూపర్ హిట్ మూవీ ఇరుముడి ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 18) నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇరుముడి స్ట్రీమింగ్ అవుతోంది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
లస్ట్ స్టోరీస్ 3
ఇక నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ బోల్డ్ ఫ్రాంఛైజీ అయిన లస్ట్ స్టోరీస్ నుంచి మూడో సీజన్ కూడా ఇవాళే ఓటీటీ ఆడియన్స్ ను పలకరించనుంది. నాలుగు కథల ఆంథాలజీగా తెరకెక్కిన ఈ లస్ట్ స్టోరీస్ 3లో రియల్ కపుల్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ రీల్ కపుల్ గా నటించడం విశేషం.
దీనితో పాటు లేటెస్ట్ తమిళ సినిమా 'మొదరాతిరి' కూడా ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ అవుతోంది.
హారర్ సిరీస్
హారర్, మిస్టరీ థ్రిల్లర్ తో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు, వణికించేందుకు ఇంటర్నేషనల్ కంటెంట్ మాన్‌స్టర్: ది లిజ్జీ బోర్డెన్ స్టోరీ రెడీ అయింది. ఈ ఇంగ్లీష్ సిరీస్ తమిళ్, తెలుగు, హిందీలోనూ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రంగం సిద్ధం చేసుకుంది.
తుడక్కమ్ ఓటీటీ
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అతని కూతురు విస్మయ మోహన్ లాల్ మూవీ డెబ్యూ చేసింది. ఆమె ఫస్ట్ మూవీనే ‘తుడక్కమ్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
{{/usCountry}}మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అతని కూతురు విస్మయ మోహన్ లాల్ మూవీ డెబ్యూ చేసింది. ఆమె ఫస్ట్ మూవీనే ‘తుడక్కమ్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
{{/usCountry}}ఒక ముయ్ థాయ్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థిని చుట్టూ తిరిగే ఈ సీట్-ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ జియోహాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఫ్రైడే వాచ్
ఫ్రైడ్ ఓటీటీ మూవీస్ కోసం డిజిటల్ ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు. అలాంటి వాళ్లకు ఈ రోజు అదిరిపోయే కంటెంట్ రెడీగా ఉంది. సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్.. ఇలా ఓటీటీ లవర్స్ కు వినోదాల విందు అందించే సినిమాలు, సిరీస్ లు వచ్చేశాయి. ఇంకెందుకు లేటు.. వెంటనే స్ట్రీమింగ్ షురూ చేసేయండి.