Friday Top OTT: ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 6 టాప్ సినిమాలు..3 వెబ్ సిరీస్‌లు..మలయాళం థ్రిల్లర్లు.. మిస్ అయితే ఫీల్ అవుతారు!

Friday Top OTT Releases: ఫ్రైడే వచ్చిందంటే చాలు ఓటీటీల్లో ఎంటర్ టైన్మెంట్ మోత మోగిపోతుంది. కొత్త సినిమాలు, సిరీస్ లతో సందడి వేరే లెవల్ లో ఉంటుంది. అయితే ఈ శుక్రవారం ఆ జోష్ మరింత పెరగనుంది. తెలుగు నుంచి మలయాళం వరకూ టాప్ సినిమాలు ఇవాళ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. స్పెషల్ వెబ్ సిరీస్ లూ ఉన్నాయి. 

Published on: Nov 13, 2026, 10:04:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Friday Top OTT Releases: వీకెండ్ వచ్చేసింది! ఇంట్లో కూర్చుని ఇష్టమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ ఎంజాయ్ చేయాలనుకునే మూవీ లవర్స్ కు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌, జియోహాట్ స్టార్, సన్ నెక్స్ట్, జీ5 లాంటి దిగ్గజ ఓటీటీల్లో ఈ శుక్రవారం (నవంబర్ 13) బ్లాక్ బస్టర్ సినిమాలు, థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.

ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 6 టాప్ సినిమాలు..3 వెబ్ సిరీస్‌లు..మలయాళం థ్రిల్లర్లు.. మిస్ అయితే ఫీల్ అవుతారు!
ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 6 టాప్ సినిమాలు..3 వెబ్ సిరీస్‌లు..మలయాళం థ్రిల్లర్లు.. మిస్ అయితే ఫీల్ అవుతారు!

రణబాలి ఓటీటీ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన ఒక తిరుగుబాటు కథతో, అద్భుతమైన యాక్షన్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయినవారు, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను మీరు నెట్‌ఫ్లిక్స్‌ ఎంజాయ్ చేయొచ్చు.

హ్యాపీ జర్నీ ఓటీటీ

ఈ రోజు ఓటీటీలోకి వచ్చిన మరో తెలుగు మూవీ ‘హ్యాపీ జర్నీ’. అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ లాంటి సీనియర్ నటీమణులతో పాటు యంగ్ యాక్టర్స్ నటించిన ఈ ఫీల్ గుడ్ అడ్వెంచర్ కామెడీ సినిమా సన్ నెన్స్ట్ ఓటీటీలోకి వచ్చేసింది. ఏడుగురు మహిళలు కలిసి యూరప్ ట్రిప్ కు వెళ్తే ఏం జరిగిందనే కథతో ఈ చిత్రం తెరకెక్కింది.

మలయాళ థ్రిల్లర్స్

ఓటీటీల్లో మలయాళ థ్రిల్లర్స్ కు ఉండే క్రేజే వేరు. ఈ రోజు ఏకంగా మూడు మలయాళ థ్రిలర్లు డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాయి. దిలీప్, తమన్నా భాటియా నటించిన ‘బాంద్రా’ జీ5లో అడుగుపెట్టింది.

ఇక మిస్టరీ, సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘థర్డ్ మర్డర్’ మూవీ ఒకే సారి రెండు ఓటీటీల్లో సందడి చేస్తుంది. ఈ చిత్రం మనోరమా మ్యాక్స్ తో పాటు సింప్లీ సౌత్ లోనూ రిలీజైంది.

మరోవైపు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, కరీనా కపూర్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ‘దాయిరా’ కూడా ఈ రోజే ఓటీటీలోకి వచ్చింది. దిశా కేసు తదితర రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.

డైరెక్ట్ ఓటీటీ రిలీజ్

పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరీ కలిసి ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్న మూవీ ‘పరివారిక్ మనురంజన్’. ఈ హిందీ సినిమా డైరెక్ట్ గా సోనీ లివ్ ఓటీటీలో విడుదలైంది. ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ వెబ్ సిరీస్‌లు

ఓటీటీ ఆడియన్స్ కు మరింత ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు ఇవాళ మూడు క్రేజీ వెబ్ సిరీస్ లు రెడీ అయ్యాయి. జియోహాట్‌స్టార్‌లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డార్క్’, నెట్‌ఫ్లిక్స్‌లో ‘మర్డర్ ఇన్ గెలీసియా’, ‘మస్ట్ డేట్ ది ప్లేబాయ్’ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More