Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో ప్రతి రోజు ట్రెండింగ్ లిస్ట్ మారుతూనే ఉంటుంది. ఒక శుక్రవారం వచ్చే కొత్త సినిమాలు కూడా ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో వెంటనే డామినెన్స్ కు తెరతీస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ బ్లాక్ బస్టర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది.
దృశ్యం 3

అజయ్ దేవగన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ దృశ్యం నుంచి వచ్చిన లాస్ట్ మూవీ దృశ్యం 3 ది కంక్లూజన్. థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఏకంగా రూ.589 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు నవంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఓటీటీలోకి ఇలా వచ్చిందో లేదో వెంటనే ట్రెండింగ్ నంబర్ వన్ పొజిషన్ ను సొంతం చేసుకుంది.
ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ చేసిన ఫస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం ఆడియన్స్ ఈ మూవీ చూసేందుకు పోటీపడుతున్నారు. దీంతో శుక్రవారం ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం.. ఇప్పుడు ట్రెండింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది.
స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే
థియేటర్లను షేక్ చేసిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇప్పుడు ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.20 వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. స్పైడర్ మ్యాన్ టామ్ హాలండ్ పోరాటాలు ఓటీటీలోనూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
418
తెలుగులో వచ్చిన లేటెస్ట్ హరర్ థ్రిల్లర్ 418. ఓ హాస్టల్ లోని 418 నంబర్ గది చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఆ గదిలోని ఒక ఆత్మ ఆడవాళ్లను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తుందనేది వణికించేలా చూపించారు.
హైకూ
{{/usCountry}}తెలుగులో వచ్చిన లేటెస్ట్ హరర్ థ్రిల్లర్ 418. ఓ హాస్టల్ లోని 418 నంబర్ గది చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఆ గదిలోని ఒక ఆత్మ ఆడవాళ్లను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తుందనేది వణికించేలా చూపించారు.
హైకూ
{{/usCountry}}కోర్ట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి అపల్ల నటించిన తొలి తమిళ చిత్రం హైకూ. ఏగన్ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ యూత్ డ్రామాకు నెట్‌ఫ్లిక్స్‌లో మంచి క్రేజ్ దక్కుతోంది.
దాయిరా
దిశా లాంటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా దాయిరా. కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ క్రైమ్ థ్రిల్లర్ లో లీడ్ రోల్స్ ప్లే చేశారు. అత్యాచారం, హత్య, ఎన్ కౌంటర్ లాంటి అంశాలతో ఈ మూవీ థ్రిల్ అందిస్తోంది.
రణబాలి
రీల్ కపుల్ నుంచి రియల్ కపుల్ గా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లయిన తర్వాత కలిసి నటించిన ఫస్ట్ మూవీ రణబాలి. ఇండియాకు ఇండిపెండెన్స్ రావడం కంటే ముందు జరిగిన దారుణ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.
స్టెప్స్
పిల్లలతో పాటు ఫ్యామిలీ అంతా కలిసి చూసే యానిమేటెడ్ కామెడీ మూవీ స్టెప్స్. ప్రముఖ సిండ్రెల్లా స్టోరీలోని డిఫరెంట్ యాంగిల్ ను ఇందులో చూపించారు.
గజబ్ రాత్
ది ఫ్యామిలీ మెన్ సిరీస్ తో థ్రిల్లర్ లవర్స్ కు మరింత దగ్గరైన మనోజ్ బాజ్ పేయి నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఈ గజబ్ రాత్. ఒకే రాత్రిలో జరిగే ఉత్కంఠభరిత సంఘటనల చుట్టూ ఈ మూవీ సాగుతుంది.
బత్తా
తమిళ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన మూవీ బత్తా. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో జోరు కొనసాగిస్తోంది. పదో స్థానంలో ట్రెండ్ అవుతోంది.
ABOUT THE AUTHOR
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.