ఓటీటీలోకి ఇవాళ నాలుగు సినిమాలు- ఒకేదాంట్లో 3 స్ట్రీమింగ్, తెలుగులో 2 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?
2025కు వీడ్కోలు పలుకుతూ ఓటీటీ ప్రియులకు అదిరిపోయే ట్రీట్ సిద్ధమైంది. ‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్ 5 ఆఖరి అంకం నేడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా, మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘ఏకో’ కూడా డిజిటల్ రంగ ప్రవేశం చేసింది. దీంతో ఇవాళ ఓటీటీలోకి వచ్చే నాలుగు సినిమాల గురించి తెలుసుకుందాం.
కొత్త సంవత్సరానికి ఇంకా ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. 2025కు గ్రాండ్‌గా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులకు భారీ వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరి రోజున (డిసెంబర్ 31) ఓటీటీలో నాలుగు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.

స్ట్రేంజర్ థింగ్స్ 5 ఫినాలే ఓటీటీ
దాదాపు దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని అలరించిన స్ట్రేంజర్ థింగ్స్ (Stranger Things 5 Finale) ఓటీటీ సిరీస్ నేటితో ముగియనుంది. హాకిన్స్ పట్టణంపై వెక్నా చేస్తున్న దాడికి పుల్ స్టాప్ పెట్టేందుకు ఎలెవన్, ఆమె గ్యాంగ్ సిద్ధమయ్యారు.
సుమారు రెండు గంటల నిడివి గల ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ 'చాప్టర్ ఎయిట్: ద రైట్‌సైడ్ అప్' పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
సస్పెన్స్ రేకెత్తిస్తున్న ఏకో
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ ‘ఏకో’. థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం నేడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు భాషలో కూడా ఓటీటీ రిలీజ్ అయింది.
మంచు కొండల మధ్య ఒక అజ్ఞాత నేరస్తుడి కోసం సాగే వేట, ఆ క్రమంలో వెలుగులోకి వచ్చే చీకటి రహస్యాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. ద్విజిత్ అయ్యతన్ దర్శకత్వంలో సందీప్ ప్రదీప్ నటించిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఈ న్యూ ఇయర్ ఈవ్‌కి పక్కా ఎంటర్‌టైనర్.
సింగిల్ సల్మా ఓటీటీ
బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషీ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ సింగిల్ సల్మా. నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి సింగిల్ సల్మా ఓటీటీ ప్రీమియర్ కానుంది. లక్నో నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామా కుటుంబ సభ్యులతో కలిసి చూసేందుకు సరైన ఎంపిక.
ది స్మాషింగ్ మేషిన్ ఓటీటీ
హాలీవుడ్ యాక్షన్ స్టార్ డ్వేన్ జాన్సన్ (ది రాక్) అనగానే మనకు భారీ యాక్షన్ సినిమాలు, విజువల్ వండర్స్ గుర్తొస్తాయి. కానీ, ఆయన తన ఇమేజ్‌ను పక్కనపెట్టి, ఒక నటుడిగా తనను తాను నిరూపించుకున్న చిత్రం ‘ద స్మాషింగ్ మెషిన్’ (The Smashing Machine).
యూఎఫ్సీ (UFC) లెజెండ్ మార్క్ కెర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ నేడు ఓటీటీలోకి వచ్చేసింది. బుక్ మై షోలో ది స్మాషింగ్ మేషిన్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్‌లో బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.
ఒక పోరాట యోధుడి గాథ
ఈ సినిమా కేవలం బాక్సింగ్ రింగులో చేసే పోరాటం గురించి మాత్రమే కాదు.. ఒక మనిషి తన వ్యక్తిగత జీవితంలో, వ్యసనాలతో చేసే యుద్ధం గురించి కూడా చెబుతుంది. బెన్నీ సఫ్డీ దర్శకత్వంలో వచ్చిన ది స్మాషింగ్ మేషిన్ చిత్రంలో మార్క్ కెర్‌గా డ్వేన్ జాన్సన్ నటన అద్భుతమని విమర్శకులు ప్రశంసించారు.
ఈ సినిమాలో డ్వేన్ జాన్సన్‌కు జోడీగా ఎమిలీ బ్లంట్ నటించింది. సెప్టెంబర్ 2025లో వెనిస్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ది స్మాషింగ్ మేషిన్ మూవీ ‘సిల్వర్ లయన్’ అవార్డును కూడా గెలుచుకుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


