ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి నాలుగు తమిళ సినిమాలు.. తెలుగులో మూడు స్ట్రీమింగ్.. థ్రిల్లర్లు కూడా
ఓటీటీలో ఫ్రైడే సినిమాల జోరు ఉంది. ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి నాలుగు తమిళ సినిమాలు వచ్చాయి. ఇందులో మూడు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ మూడు సినిమాలు ఏవో ఇక్కడ చూసేయండి.
ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి నాలుగు తమిళ సినిమాలు వచ్చేశాయి. ఇందులో మూడు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆరోమలే, థీయావర్ కులై నడుంగ, కాంత, కినారు సినిమాలు శుక్రవారం ఓటీటీలో అడుగుపెట్టాయి. ఇందులో కినారు మినహా మిగతా మూడు తెలుగు ఆడియన్స్ కోసం తెలుగులో అందుబాటులో ఉన్నాయి.

ఆరోమలే
తమిళ రొమాంటిక్ స్టోరీ ఆరోమలే. ఇందులో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్. కిషన్ దాస్ హీరోగా నటించాడు. హీరో లవ్ మ్యారేజీ చేసుకోవాలని ఆశపడుతుంటాడు. సినిమాల్లో చూపించినట్లుగా తన జీవితంలోనే మ్యాజిక్ జరగాలని కోరుకుంటాడు. కానీ వరుసగా లవ్ ఫెయిల్యూర్స్ ఎదురువుతాయి. అప్పుడే మ్యాట్రిమోనీ ఏజెన్సీలో చేరతాడు. అక్కడ బాస్ అంజలికి ఏమో లవ్ పై పెద్దగా నమ్మకం ఉండదు. మరి వీళ్ల మధ్య ఏం జరిగింది? అన్నది సినిమాలో చూడాల్సిందే. ఇది జియోహాట్ స్టార్ లో ఉంది.
థీయావర్ కులై నడుంగ
సీనియర్ నటుడు అర్జున్, ఐశ్వర్యా రాజేష్ నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ థీయావర్ కులై నడుంగ. థియేటర్లో రిలీజైన 20 రోజులకే ఇది ఓటీటీలోకి వచ్చేసింది. సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ థ్రిల్లర్ మూవీ. ఇందులో నేర చరిత్ర ఉన్నవాళ్లు వరుసగా హత్యకు గురవుతుంటారు. ఈ కేసును మాగుడపతి (అర్జున్) ఎంక్వైరీ చేస్తాడు. మరోవైపు ఆటిస్టిక్ పిల్లల పాఠశాలలో మీరా (ఐశ్వర్య రాజేష్) టీచర్. మరి ఈ హత్యలకు టీచర్ కు ఏమైనా సంబంధం ఉందా? అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.
కినారు
పక్కవాళ్ల బావిని చూసి తాము కూడా సొంతంగా బావి తవ్వాలనుకునే పిల్లల కథ కినారు. ఇందులో కనీష్ కుమార్, వివేక్ ప్రసన్న, శ్రీ హరిహరణ్, మనోజ్ కన్నన్ తదితరులు నటించారు. ఇది నవంబర్ 14, 2025న బాలల దినోత్సవం సందర్భంగా థియేటర్లో రిలీజైంది. ఈ రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఇది కేవలం తమిళ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది.
కాంత
దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సముద్ర ఖని, భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలు పోషించిన మూవీ కాంత. ఇది డైరెక్టర్, హీరోకు మధ్య ఉన్న ఈగో ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఇందులో సముద్రఖని డైరెక్టర్. తన తల్లి కథతో సినిమా తీయాలనుకుంటాడు. దానికి అతని శిష్యుడే హీరో. కొన్నాళ్లు షూటింగ్ ఆగిపోతుంది. ఆ తర్వాత హీరో చెప్పినట్లే మూవీ తెరకెక్కాలని కండీషన్ పెడతాడు.
అప్పుడే సినిమాకు చెందిన వాళ్లలో కీలక వ్యక్తి హత్య జరుగుతుంది. దీన్ని ఎంక్వైరీ చేసేందుకు పోలీస్ ఆఫీసర్ గా రానా వస్తాడు. కాంత మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.














