OTT Web Series: ఓటీటీలో వీకెండ్ ఫ‌న్ కావాలా? స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ తెలుగు, మ‌ల‌యాళ‌ వెబ్ సిరీస్‌ల‌పై లుక్కేయండి!

OTT Web Series: వీకెండ్ వచ్చేస్తోంది. మరోవైపు దసరా సెలవులు కూడా రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలో అదిరిపోయే వెబ్ సిరీస్ లు చూడాలనుకునే వాళ్లకు ఇది గుడ్ న్యూస్. రెండు క్రేజీ వెబ్ సిరీస్ లు తాజాగా ఓటీటీలోకి వచ్చాయి. ఒకటేమో తెలుగు కామెడీ కాగా.. మరొకటి మలయాళ మిస్టరీ థ్రిల్లర్. వెంటనే ఓ లుక్కేయండి.

Published on: Oct 9, 2026, 13:51:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Web Series: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్ అదిరిపోయే వినోదం అందించడానికి రెండు సరికొత్త వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేశాయి. వైవా హర్షా నవ్వులు పూయించేందుకు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రూపంలో వస్తే, సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వారి కోసం మలయాళ సిరీస్ 'ఐస్' (Eyes) సిద్ధమైంది. ఈ రెండు సిరీస్‌ల పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడున్నాయి.

ఓటీటీలో వీకెండ్ ఫ‌న్ కావాలా? స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ తెలుగు, మ‌ల‌యాళ‌ వెబ్ సిరీస్‌ల‌పై లుక్కేయండి! (x)
ఓటీటీలో వీకెండ్ ఫ‌న్ కావాలా? స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ తెలుగు, మ‌ల‌యాళ‌ వెబ్ సిరీస్‌ల‌పై లుక్కేయండి! (x)

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

కామెడీ, రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థలైన ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్‌ లో అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏంటంటే?

సమాజం, కుటుంబం నుంచి పెళ్లి చేసుకోమని తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే తేజ అనే మధ్య తరగతి యువకుడి కథ ఇది. చూసే ప్రతి సంబంధం తప్పిపోతూ చివరకు అతను జాయిన్ అయిన సాఫ్ట్‌వేర్ కంపెనీ బాస్ మధుతోనే పెళ్లి సంబంధం కుదురుతుంది.

పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీరు ఆరు నెలల పాటు ఒకే ఇంట్లో కలిసి నివసించాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగే ఆఫీస్ డ్రామా, రిలేషన్‌షిప్ గొడవలు ప్రేక్షకులకు విపరీతమైన నవ్వులను పంచుతాయి.

6 ఎపిసోడ్లు

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ దాదాపు 30 నిమిషాల నిడివితో సాగుతుంది. ఈ సిరీస్ లో హర్ష చెముడు, ఐశ్వర్య హొలక్కల్ ప్రధాన పాత్రలు పోషించారు. హైపర్ ఆది, జీవన్ కుమార్, రూప శ్రావ్య, వాసు ఇంటూరి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. బాబు దేగల ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.

ఐస్

సీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్స్ చూడాలనుకునే వారి కోసం మలయాళంలో తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఐస్’ బెస్ట్ ఆప్షన్. ఈ సిరీస్ అక్టోబర్ 8 సాయంత్రం నుంచే సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఇదే

సమాజంలో మహిళలపై జరుగుతున్న స్టాకింగ్ (వేధించడం), సీరియల్ హత్యల చుట్టూ ఈ వెబ్ సిరీస్ కథ తిరుగుతుంది. టీనా సెబాస్టియన్ అనే పోలీస్ ఆఫీసర్ ఈ కేసులను విచారిస్తుంటుంది. స్టాకర్స్ మానసిక స్థితిని అర్థం చేసుకుని, తదుపరి నేరాలను అడ్డుకోవడానికి పోలీసులతో ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ బృందం చేతులు కలుపుతుంది. స్టాకర్స్ ఎలాంటి ఎమోషనల్ మైండ్ గేమ్స్ ఆడతారనేది చాలా ఉత్కంఠభరితంగా చూపించారు.

ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్లతో ఒక సీజన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఐస్ వెబ్ సిరీస్ లో జాతీయ అవార్డు గ్రహీత కని కుసృతి ప్రధాన పాత్రలో నటించగా.. శృతి రామచంద్రన్, నిఖిలా విమల్, సానియా ఇయ్యప్పన్, దేవ్ మోహన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. 'ఉయరే' ఫేమ్ మను అశోకన్ దీనికి దర్శకత్వం వహించారు.

ఒకవైపు హర్ష, హైపర్ ఆదిల మార్క్ కామెడీతో నవ్వుకోవడానికి, మరోవైపు ఉత్కంఠ రేపే మిస్టరీని ఛేదించే క్రైమ్ థ్రిల్లర్ అనుభూతిని పొందడానికి ఈ వీకెండ్‌కు ఈ రెండు సిరీస్‌లు ఓటీటీ లవర్స్‌కు బెస్ట్ ఛాయిస్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More