Malayalam OTT: సినిమా ప్రియులకు అదిరిపోయే వినోదాన్ని పంచేందుకు మలయాళం నుంచి మూడు మైండ్ బ్లోయింగ్ కంటెంట్స్ ఓటీటీలోకి అడుగుపెట్టాయి. ఇందులో రెండు విభిన్నమైన క్రైమ్ & యాక్షన్ సినిమాలు, ఒక మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో హైప్ క్రియేట్ చేసిన ఆ మూడు మలయాళ రిలీజ్ లు ఇవే.
ఖలీఫా (Khalifa: The Ruler)

యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చి, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేస్తోంది. ఇవాళ (అక్టోబర్ 9) ఒకేసారి ఏకంగా ఏడు ఓటీటీల్లో రిలీజైంది. ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, మనోరమా మ్యాక్స్, లయన్స్ గేట్ ప్లే, సింప్లీ సౌత్, స్టార్జ్ ప్లే, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ ఏంటంటే?
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఖలీఫా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఆమిర్ అలీ (పృథ్వీరాజ్) కోజికోడ్‌లో సాధారణ టెక్స్‌టైల్ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అయితే ఒక పెద్ద బంగారం స్మగ్లింగ్ కేసులో తన తండ్రి ఇరుక్కుపోవడంతో అతని జీవితం మలుపు తిరుగుతుంది.
తన కుటుంబాన్ని రక్షించుకునే క్రమంలో, ఒకప్పుడు తన తాత అంతర్జాతీయ గోల్డ్ ట్రేడింగ్ సామ్రాజ్యాన్ని శాసించిన వ్యక్తి అని ఆమిర్ తెలుసుకుంటాడు. పరిస్థితుల ప్రభావంతో ఆమిర్ అలీ ఆ అండర్ వరల్డ్ సామ్రాజ్యానికి రాజుగా మారి ఎలా 'ఖలీఫా' అయ్యాడు, తన శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా కథ.
ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (Pradhama Drishtiya Kuttakkar)
ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం నేరస్తుడిని పట్టుకోవడం కాకుండా, పోలీసుల మధ్యే జరిగే మైండ్ గేమ్స్ తరహాలో మూవీ వినూత్నంగా సాగుతుంది. ఈ చిత్రం ఇవాళ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
పోలీసు డ్రామా
{{/usCountry}}ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం నేరస్తుడిని పట్టుకోవడం కాకుండా, పోలీసుల మధ్యే జరిగే మైండ్ గేమ్స్ తరహాలో మూవీ వినూత్నంగా సాగుతుంది. ఈ చిత్రం ఇవాళ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
పోలీసు డ్రామా
{{/usCountry}}భర్త మరణం తర్వాత కారుణ్య నియామకం కింద పోలీస్ శాఖలో చేరిన అలీనా అబ్రహం (పార్వతి) అనే ఒక మహిళా కానిస్టేబుల్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పోలీస్ స్టేషన్‌లో అనుకోకుండా జరిగిన ఒక కస్టడీ మరణాన్ని కప్పిపుచ్చడానికి స్టేషన్ సిబ్బంది అంతా కలిసి ఒక డ్రామా ఆడతారు.
అయితే, ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి హారిస్ మీరన్ అనే సీనియర్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. అలీనా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ, ఈ ఉచ్చు నుంచి ఎలా తప్పించుకుంది? పోలీసుల మధ్యే జరిగిన ఈ పిల్లి-ఎలుకల ఆటలో ఎవరు గెలిచారు అనేది ఉత్కంఠభరితంగా చూపించారు.
ఐస్ (EYes)
ప్రేమ, వ్యామోహం (Obsession), సైకో ప్లాటింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సస్పెన్స్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. సోనీ లివ్ లో గురువారం (అక్టోబర్ 8) సాయంత్రం నుంచే అందుబాటులోకి వచ్చింది. సమాజంలో మహిళలపై జరుగుతున్న రహస్య నిఘా, స్టాకింగ్, హరాస్‌మెంట్ కేసులను ఇన్వెస్టిగేట్ చేసే టీనా సెబాస్టియన్ (కని కుసృతి) అనే పోలీస్ ఆఫీసర్ కథ ఇది.
నగరంలో ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న మహిళల హత్యలను అరికట్టడానికి పోలీసులతో పాటు కొందరు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ కూడా జాయిన్ అవుతారు. ప్రేమ ఏ విధంగా సైకో వ్యామోహంగా మారుతుంది, స్టాకర్స్ ఎలాంటి భయానక వలయాలు సృష్టిస్తారు, వాటి వెనుక ఉన్న పెద్ద ముఠాను టీనా ఎలా బట్టబయలు చేసింది అనే అంశాలతో ఈ సిరీస్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది.