...
...
Next Story

OTT Thriller: వాట్ ఏ సడెన్ స‌ర్‌ప్రైజ్‌.. సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన జగపతిబాబు సైకలాజికల్ థ్రిల్లర్.. సైకో అమ్మాయి!

OTT Thriller: తెలుగు ఓటీటీ లవర్స్ కోసం ఓ అదిరిపోయే సడెన్ సర్ ప్రైజ్ వచ్చింది. వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు, లయ జంటగా నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘వదలా’ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. సైలెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని ఎందుకు చూడాలో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Aug 14, 2026, 08:54:18 IST
Advertisement

OTT Thriller: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశారు జగపతిబాబు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా భయపెడుతున్నారు. మధ్యలో కీలక పాత్రలు కూడా పోషిస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా, లయ హీరోయిన్ గా నటించిన మూవీ ‘వదలా’. ఈ చిత్రం ఇవాళ (ఆగస్టు 14) ఓటీటీలోకి వచ్చేసింది.

వదలా ఓటీటీ

వాట్ ఏ సడెన్ స‌ర్‌ప్రైజ్‌.. సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన జగపతిబాబు సైకలాజికల్ థ్రిల్లర్.. సైకో అమ్మాయి!
వాట్ ఏ సడెన్ స‌ర్‌ప్రైజ్‌.. సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన జగపతిబాబు సైకలాజికల్ థ్రిల్లర్.. సైకో అమ్మాయి!

చాలా కాలం తర్వాత జగపతిబాబు, లయ జంటగా కలిసి నటించిన మూవీ ‘వదలా’. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు అనౌన్స్ మెంట్ లేకుండా శుక్రవారం నుంచి డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

సైకలాజికల్ థ్రిల్లర్ గా

వదలా మూవీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఆకెళ్ల వి కృష్ణ‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, లయతో పాటు హృతిక శ్రీనివాస్‌ కీలక పాత్ర పోషించింది. జూలై 17న థియేటర్లలో రిలీజైన ఈ మూవీని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు.

వదలా స్టోరీ ఏంటంటే?

యోగి సిద్ధార్థ్ (జగపతిబాబు), ప్రియ (లయ) భార్యాభర్తలు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. ఈ ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంటుంది. సిద్ధార్థ్ ఓ డాక్టర్. ఓ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ అముద (హృతిక శ్రీనివాస్‌)ను సిద్ధార్థ్ కాపాడతాడు. దీంతో సిద్ధార్థ్ పై అముద ఇష్టం పెంచుకుంటుంది. సిద్ధార్థ్, ప్రియను విడగొట్టాలని సైకోలా బిహేవ్ చేస్తుంది.

సడెన్ గా ప్రైమ్ వీడియోలోకి వచ్చిన వదలా మూవీ మంచి ఎంటర్ టైనర్. ఫ్యామిలీ ఎమోషన్స్, సైకో లవ్, సస్పెన్స్, థ్రిల్ ఇలా ఆడియన్స్ ను స్క్రీన్ ముందు కూర్చోబెట్టే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇక జగపతిబాబు యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోసారి స్క్రీన్ పై ఆయన యాక్టింగ్ ను ఆస్వాదించేందుకు వదలా బెస్ట్ ఆప్షన్.

జగపతిబాబు, లయ కెమిస్ట్రీ, ఫ్యామిలీ బాండింగ్ ఆకట్టుకుంటుంది. ఇక సైకోగా హృతిక శ్రీనివాస్‌ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వదలా సినిమాలో ఆమె క్యారెక్టరైజేషన్, యాక్టింగ్ కచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks