ఓటీటీలోకి ప్రతివారం డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ వస్తూనే ఉంటాయి. అయితే ఇందులో థ్రిల్లర్ జోనర్ సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు థ్రిల్ తో ఊపేసే ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమానే ‘ ది హంట్స్ మన్’. థ్రిల్లర్ లవర్స్ మిస్ అవకుండా చూడాల్సిన మూవీ ఇది.
ది హంట్స్ మన్ ఓటీటీ

ఓటీటీలు వచ్చాక భాష అనే భేదం లేకుండా అన్ని సినిమాలను ఆడియన్స్ చూసేస్తున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్ల విషయానికి వస్తే ఈ జోనర్ లో వచ్చే హాలీవుడ్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ది హంట్స్ మన్ ఓటీటీలోకి వచ్చింది. ఈ రోజు (ఫిబ్రవరి 10) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
డైరెక్ట్ ఓటీటీ
ది హంట్స్ మన్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోని రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంగళవారం నుంచి అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతానికి స్ట్రీమింగ్ లో చిన్న ట్విస్ట్ నెలకొంది. ఇప్పుడైతే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ది హంట్స్ మన్ మూవీ కేవలం రెంట్ విధానంలోనే అందుబాటులో ఉంది. అంటే ఈ సినిమా చూడాలంటే రెంట్ గా అమౌంట్ పే చేయాల్సిందే.
ఇంట్రెస్టింగ్ గా
ది హంట్స్ మన్ సినిమాలో షాన్ యాష్మోర్, గారెట్, ఎలిజబెత్ మిచెల్, జెస్సీ ష్రూమ్ తదితరులు నటించారు. ఈ మూవీరొ కైల్ కౌవిక హారిస్ డైరెక్టర్. ఈ చిత్రం నేరుగా ఈ రోజు ఓటీటీలోకి వచ్చింది. ట్రైలర్ లోని సీన్లు, స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
ది హంట్స్ మన్ స్టోరీ
మ్యాక్స్ (షాన్ యాష్మోర్) ఐసీయూ నర్స్ గా పని చేస్తుంటాడు. కోమాలో ఉన్న లింకన్ రైడర్ (గారెట్ డిల్లాహంట్)ను చూసుకోవడానికి మ్యాక్స్ వెళ్తాడు. లింకన్ ఆరుగురు అమ్మాయిలను చంపి కోమాలోకి వెళ్లాడని పోలీసులు భావిస్తారు. అతను కోమాలో నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేయొచ్చని అనుకుంటారు.
{{/usCountry}}మ్యాక్స్ (షాన్ యాష్మోర్) ఐసీయూ నర్స్ గా పని చేస్తుంటాడు. కోమాలో ఉన్న లింకన్ రైడర్ (గారెట్ డిల్లాహంట్)ను చూసుకోవడానికి మ్యాక్స్ వెళ్తాడు. లింకన్ ఆరుగురు అమ్మాయిలను చంపి కోమాలోకి వెళ్లాడని పోలీసులు భావిస్తారు. అతను కోమాలో నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేయొచ్చని అనుకుంటారు.
{{/usCountry}}మరోవైపు తన భర్త లింకన్ ఏ మర్దర్ చేయలేదని, అతను నిర్దోషి అని భార్య వాదిస్తుంది. లింకన్ ను చూసుకోవడానికి వెళ్లిన మ్యాక్స్ కు కొన్ని సంచలన నిజాలు తెలుస్తాయి. కొన్ని సీక్రెట్స్ బయటపడతాయి. అయితే ఒక రోజు లింకన్ కోమాలో నుంచి కోలుకుంటాడు. మరి నిజంగానే లింకన్ ఆ ఆరు హత్యలు చేశాడా? అతని రహస్యాలు ఏంటీ? అన్నది ది హంట్స్ మన్ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.