OTT Tamil: ఇవాళ ఓటీటీలోకి వచ్చిన రెండు క్రేజీ తమిళ రొమాంటిక్ సినిమాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఓ లుక్కేయండి
OTT Tamil: ఫ్రైడే ను మూవీ డేగా మార్చేస్తూ కొత్త సినిమాలు ఓటీటీలోకి క్యూ కట్టాయి. ఇవాళ రెండు తమిళ రొమాంటిక్ మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఈ రెండు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి.
OTT Tamil: శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాల రిలీజ్ లతో ఓటీటీ సందడి వేరే లెవల్ లో ఉంటుంది. ఈ రోజు కూడా చాలా చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇందులో ఈ రెండు తమిళ రొమాంటిక్ మూవీస్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. అందులో ఒకటి ‘నీ ఫర్ ఎవర్’ సినిమా కాగా.. మరొకటి ‘హ్యాపీ రాజ్’ ఫిల్మ్. వీటి ఓటీటీ రిలీజ్ పై ఓ లుక్కేయండి.

నీ ఫర్ ఎవర్ ఓటీటీ
డేటింగ్ యాప్ తో పరిచయమైన జంట మధ్య సాగే రొమాంటిక్ లవ్ జర్నీ చుట్టూ అల్లుకున్న కథనే ‘నీ ఫర్ ఎవర్’ మూవీ. ఈ సినిమా ఇవాళ (ఏప్రిల్ 24) ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.
నీ ఫర్ ఎవర్ స్టోరీ
నీ ఫర్ ఎవర్ సినిమా డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కింది. డేటింగ్ యాప్ లో పరిచయమైన ఓ జంటకు ఎలాంటి పరిస్థితి తలెత్తిందనే కథతో నీ ఫర్ ఎవర్ మూవీని తీర్చదిద్దారు.
అజయ్ (సుదర్శన్ గోవింద్), మాతి (అర్చనా రవి) ఓ డేటింగ్ యాప్ ద్వారా కలుసుకుంటారు. కానీ వాళ్ల రియల్ క్యారెక్టర్లను, లైఫ్ ను దాచి ఉంచి వీళ్లు ఫేక్ రిలేషన్ షిప్ కొనసాగిస్తారు. వీళ్ల ఇద్దరి మధ్య ఫీలింగ్స్ ఏర్పడతాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్ల మధ్య నిజంగానే లవ్ ఏర్పడిందా? అన్నది నీ ఫర్ ఎవర్ మూవీలో చూడాల్సిందే.
హ్యాపీ రాజ్ ఓటీటీ
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగానూ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. అతను లీడ్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘హ్యాపీ రాజ్’. ఈ సినిమా కూడా ఇవాళ డిజిటల్ డెబ్యూ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాతో సీనియర్ హీరో అబ్బాస్ రీ ఎంట్రీ ఇచ్చాడు.
హ్యాపీ రాజ్ స్టోరీ
ఆనంద రాజ్ అలియాస్ హ్యాపీ రాజ్ (జీవీ ప్రకాష్) తన తంద్డి కారణంగా ఇబ్బందులు పడుతుంటాడు. బెంగళూరులో అతను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం సంపాదించి అక్కడికి వెళ్తాడు. అక్కడ కావ్య (శ్రీ గౌరీ ప్రియ)తో ప్రేమలో పడతాడు. మరి వీళ్ల పెళ్లి కథ కంచికి చేరిందా? హ్యాపీ రాజ్, తండ్రి మధ్య ఎమెషన్ ఎలాంటిది? అనేది హ్యాపీ రాజ్ మిగతా స్టోరీ.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


