Telugu OTT: ఇవాళ ఓటీటీలోకి మూడు క్రేజీ తెలుగు సినిమాలు.. కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్.. ఓ లుక్కేయండి

Telugu OTT: తెలుగు ఓటీటీ ఆడియన్స్ కు ఈ రోజు పండగే.  ఒకే రోజు మూడు క్రేజీ తెలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇందులో కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ జోనర్ ఎంటర్ టైనర్లున్నాయి.

Mar 13, 2026, 13:47:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫ్రైడే వచ్చిందంటే చాలు ఓటీటీలో కొత్త జోష్ కనిపిస్తుంది. ఈ శుక్రవారం (మార్చి 13) కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లో కొత్త సినిమాల సందడి నెలకొంది. అయితే ఈ రోజు మూడు క్రేజీ తెలుగు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావడంతో ఈ వైబ్ మరింత పెరిగింది. కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ జోనర్లలోని సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.

తెలుగు ఓటీటీ సినిమాలు
తెలుగు ఓటీటీ సినిమాలు

కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ

రీసెంట్ తెలుగు సూపర్ హిట్ మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’. సంతోష్ శోభన్, మానస వారణాసి ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. ఇది రొమాంటిక్ కామెడీ మూవీ. కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఈ రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడలోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ

కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్టర్. యువీ క్రియేషన్స్ నిర్మించింది. మంచి జాబ్స్ కోసం హీరో, హీరోయిన్ సెపరేట్ గా చెన్నై వెళ్తారు. కానీ అనుకున్న ఉద్యోగం దొరకక ఏదో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటారు. అయితే అనుకోకుండా కలిసిన హీరో, హీరోయిన్ ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో చూడాల్సిందే.

ఫంకీ ఓటీటీ

వరుసగా ఫ్లాప్ లతో రూట్ మార్చిన విష్వక్ సేన్ హీరోగా నటించిన కామెడీ మూవీ ‘ఫంకీ’. జోనర్ మార్చినా విష్వక్ సేన్ కు సక్సెస్ మాత్రం దక్కలేదు. జాతి రత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ అందించిన కేవీ అనుదీప్ డైెరెక్ట్ చేసిన ఫంకీ మూవీ బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఈ సినిమా ఇవాళ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది.

కథ

ఫంకీ మూవీలో విష్వక్ సేన్ ఓ అప్ కమింగ్ డైరెక్టర్ రోల్ చేశాడు. అతను ఓ సినిమా మొదలెడతాడు. కానీ బడ్జెట్ పెరిగిపోతుంది. అప్పుడు ప్రొడ్యూసర్ కూతురైన హీరోయిన్ రంగంలోకి దిగుతుంది. అనుకున్న బడ్జెట్ లోనే సినిమా కంప్లీట్ చేయించాలని చూస్తుంది. ఈ మూవీలో కాయదు లోహర్ హీరోయిన్. ఈ మూవీ ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజైంది.

భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి ఓటీటీ

థియేటర్లలో రిలీజైన రెండు నెలలకు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమా ‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’. రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ ఇందులో లీడ్ రోల్స్ ప్లే చేశారు. జనవరి 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మార్చి 13 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

భార్య ఉండగా మరో అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ షిప్ పెట్టుకునే భర్త కథనే భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమా. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులు ముందుకొచ్చిన ఈ చిత్రం జీ5 ఓటీటీలో ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More