...
...
Next Story

ఇవాళ ఓటీటీలోకి తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్.. అతుక్కుపోయే శరీరాలు.. ఒళ్లు గగుర్పొడిచే సీన్లు.. భయపడకుండా చూడగలరా?

ఇవాళ ఓటీటీలోకి ఓ ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్ వచ్చేసింది. భయపడకుండా ఈ సినిమాను చూడలేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఏదీ? ఏ ఓటీటీలో ఉందో ఇక్కడ చూసేయండి.

Published on: Dec 22, 2025, 12:23:50 IST
Advertisement

ఓటీటీ ఆడియన్స్ కోసం కొత్త వారం సరికొత్తగా మొదలైంది. అదిరిపోయే హారర్ థ్రిల్లర్ ఇవాళ (డిసెంబర్ 22) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో, వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో వచ్చిన ఈ మూవీ పేరు ‘టుగెదర్’. ఈ రోజు ఓటీటీలోకి వచ్చింది ఈ సినిమా. హారర్ థ్రిల్లర్లు ఇష్టపడే వాళ్లకు ఈ మూవీ మంచి ఫీస్ట్ లాంటిదే.

టుగెదర్ ఓటీటీ

ఓటీటీలో హారర్ థ్రిల్లర్ (x)
ఓటీటీలో హారర్ థ్రిల్లర్ (x)

హారర్ థ్రిల్లర్లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇక అమెరికన్ హారర్ సూపర్ నేచురల్ థ్రిల్లర్లు అంటే మరింత ఆదరణ ఉంటుంది. ఈ సినిమాలు క్షణక్షణం భయపెడుతూ, ఒళ్లు గగుర్పొడిచేలా సాగుతాయి. ఇప్పుడు అలాంటి మూవీ ‘టుగెదర్’ ఓటీటీ ఆడియన్స్ ను భయపెట్టేందుకు వచ్చేసింది. సోమవారం ఓటీటీలో అడుగుపెట్టింది ఈ సినిమా.

తెలుగులోనూ

ఇంగ్లీష్ సినిమా అయిన టుగెదర్ తెలుగులోనూ మన ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది. ప్రైమ్ వీడియోలో ఈ హారర్ థ్రిల్లర్ డిసెంబర్ 22 నుంచి ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ హారర్ థ్రిల్లర్ ను ఎంజాయ్ చేయొచ్చు.

నాలుగు నెలల తర్వాత

టుగెదర్ సినిమా నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. జులై 20న అమెరికాలో రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 2025లో అత్యంత భయంకరమైన హారర్ థ్రిల్లర్లలో ఒకటిగా టుగెదర్ నిలిచింది. ఈ సినిమాలో డేవ్ ఫ్రాంకో, అలీసన్ బ్రీ కీలక పాత్రలు పోషించారు. దీనికి మైకెల్ శాంక్స్ డైరెక్టర్.

టుగెదర్ స్టోరీ

టిమ్, మిల్లీ రొమాన్స్ మొదలెడతారు. కలిసి ఉంటారు. కానీ ఒక రోజు అడవిలో హైకింగ్ కు వెళ్లినప్పుడు గుహలో పడిపోతారు. అక్కడ ఉన్న ఓ నీటి గుంటలో నీరును టిమ్ తాగుతాడు. అప్పటి నుంచి వింత సంఘటనలు జరుగుతాయి. టిమ్, మిల్లి శరీర భాగాలు అతుక్కుంటాయి. దీంతో దూరంగానే ఉంటారు. కానీ చివరకు ఒకే ప్రాణిగా కలిసి పోవాలని అనుకుంటారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks