Rag Mayur 5 Roles In Garividi Lakshmi: తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం కంటెంట్ ఆధారిత సినిమాలకు, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే యువ నటులకు మంచి ఆదరణ లభిస్తోంది. చిన్న సినిమాలతో ప్రయాణం ప్రారంభించి, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు వెండితెరపై తనదైన శైలిలో దూసుకుపోతున్నారు నటుడు రాగ్ మయూర్.
సినిమా బండితో పరిచయం

'సినిమా బండి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన, నాటకరంగంలో గడించిన అనుభవంతో ప్రతి పాత్రలోనూ వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
'గరివిడి లక్ష్మి'లో ఐదు షేడ్స్‌తో సత్తిబాబు రాక
దర్శకుడు గౌరి నాయుడు జమ్ము తెరకెక్కించిన 'గరివిడి లక్ష్మి' చిత్రంలో రాగ్ మయూర్ 'సత్తిబాబు' అనే బుర్రకథ కళాకారుడి పాత్ర పోషించారు. హీరోయిన్ ఆనంది ప్రధాన పాత్ర పోషించిన ఈ ఒక్క సినిమాలోనే ఐదు విభిన్న కోణాలు ఉన్న పాత్రను ఆవిష్కరించడం నటుడిగా ఆయన ప్రతిభకు అసలైన పరీక్షగా నిలిచింది.
బాడీ లాంగ్వేజ్, యాసతో
కేవలం వేర్వేరు గెటప్పులు వేయడం మాత్రమే కాకుండా, ప్రతి షేడ్‌కు తగిన బాడీ లాంగ్వేజ్, యాస, భావోద్వేగాలు ప్రదర్శిస్తూ పాత్రలోని సహజత్వం చెడకుండా నటించడం ఈ సినిమాలోని ప్రధాన విశేషం. "ఇది చాలా ఎక్సైటింగ్‌తో పాటు సవాలుతో కూడుకున్న పాత్ర. సత్తిబాబు పాత్ర కోసం ఎంతో సాధన చేసి నటించాను" అని రాగ్ మయూర్ వెల్లడించారు.
'సివరాపల్లి' సక్సెస్ ఇచ్చిన ఆత్మవిశ్వాసం
ఇకపోతే హిందీలో ఘనవిజయం సాధించిన 'పంచాయత్' ఓటీటీ సిరీస్ తెలుగు రీమేక్ 'సివరాపల్లి' అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై విశేష ఆదరణ పొందింది. నటుడిగా ఒక ప్రాజెక్ట్‌ను తన భుజస్కంధాలపై నడిపించగలనని ఈ సిరీస్‌తో రాగ్ మయూర్ నిరూపించుకున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా ఆయనకు ఉన్న అనుభవం నటనలోని రకరకాల కోణాలను ఆవిష్కరించేందుకు దోహదపడింది.
నాకోసమే పాత్రలు రాయడం
"సివరాపల్లి సూపర్ హిట్ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. చాలా మంది దర్శకులు ప్రత్యేకంగా నా కోసమే పాత్రలు రాస్తున్నామని చెప్పడం నటుడిగా నాకు లభించిన గొప్ప గుర్తింపు" అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా గుర్తింపు
{{/usCountry}}"సివరాపల్లి సూపర్ హిట్ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. చాలా మంది దర్శకులు ప్రత్యేకంగా నా కోసమే పాత్రలు రాస్తున్నామని చెప్పడం నటుడిగా నాకు లభించిన గొప్ప గుర్తింపు" అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా గుర్తింపు
{{/usCountry}}కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్న రాగ్ మయూర్, 'కీడా కోలా', 'వీరాంజనేయులు విహారయాత్ర', 'గాంధీతాతా చెట్టు' చిత్రాలతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు.
సమంత శుభంలోనూ
ఇటీవల అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వచ్చిన 'పరదా' చిత్రంలో రాజేష్ పాత్రతో మెప్పించగా, 'మిత్ర మండలి' చిత్రంలో ఆయన చెప్పిన కామెడీ ఇంగ్లీష్ సంభాషణలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన 'శుభం' చిత్రంలోనూ చిన్న క్యామియో పాత్రలో కనిపించి అలరించారు.
వాస్తవిక కథనాలకు ప్రాధాన్యం
"నటుడిగా నా ఫిల్మోగ్రఫీ పట్ల సంతృప్తిగా ఉన్నాను. ప్రారంభ దశలోనే ప్రతిభావంతులైన దర్శకులు, సాంకేతిక నిపుణులతో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. భావోద్వేగాలు, వాస్తవిక కథనాలకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో భాగమవ్వడమే నా లక్ష్యం" అని రాగ్ మయూర్ పేర్కొన్నారు.