...
...
Next Story

Rohit Satyan: 2017 నుంచి సినిమాలు చేస్తున్నా, తొలిసారి స్టేజ్‌పై మాట్లాడుతున్నా.. నటుడు రోహిత్ సత్యన్ కామెంట్స్

Actor Rohit Satyan Speech In Surya Be Positive Teaser Launch: తెలుగులో వస్తున్న లేటెస్ట్ మూవీ సూర్య బి పాజిటివ్. చరణ్ పీసర్ల, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ ఈవెంట్‌లో నటుడు రోహిత్ సత్యన్, బలగం సత్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Apr 24, 2026, 14:26:13 IST
Advertisement

Rohit Satyan At Surya Be Positive Teaser Launch: చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్‌గా నటించిన లేటెస్ట్ మూవీ సూర్య బి పాజిటివ్. కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి సుబ్బా మాధవరపు దర్శకత్వం వహించారు. అరుణ్ కుమార్ పర్వతనేని సంగీతం అందించారు.

సూర్య బి పాజిటివ్ టీజర్ లాంచ్

2017 నుంచి సినిమాలు చేస్తున్నా, తొలిసారి స్టేజ్‌పై మాట్లాడుతున్నా.. నటుడు రోహిత్ సత్యన్ కామెంట్స్
2017 నుంచి సినిమాలు చేస్తున్నా, తొలిసారి స్టేజ్‌పై మాట్లాడుతున్నా.. నటుడు రోహిత్ సత్యన్ కామెంట్స్

సూర్య బి పాజిటివ్ సినిమాలో రోహిత్ సత్యన్, సుజాత దీక్షిత్, చంద్ర గౌతమ్, సత్య, సురభి లలిత, గీతన్ సాయి తేజ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇటీవల సూర్య బి పాజిటివ్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కు దండోరా డైరెక్టర్ మురళీకాంత్ దేవసోత్, కిష్కింధపురి దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సూర్య బి పాజిటివ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నటుడు బలగం సత్య, రోహిత్ సత్యన్, హీరోయిన్ దివ్య విశ్వకర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నటుడు బలగల సత్య కామెంట్స్

నటుడు బలగం సత్యా మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నన్ను సంప్రదించి నాకోసం నా వరకు రావడం నన్ను ఆశ్చర్యపరిచింది. నాపై నమ్మకంతో నాతో సరికొత్త క్యారెక్టర్ చేయించిన ఆ వ్యక్తి ఈ సినిమా హీరో చరణ్. నాతో చాలా బాగా నటించేలా చేశారు. చాలా మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరూ ఈ సినిమాను ఆశీర్వదించలవలసిందిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.

"నా వయసుకు మించిన క్యారెక్టర్ నాతో దర్శకులు చేయించారు. అది నాకు ఛాలెంజ్‌గా నిలిచింది. ఆయన కొన్ని కారణాల వల్ల అమెరికాలో ఉన్నారు. ఈ సినిమాలో ప్రతిదీ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయాలి. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఎప్పుడూ ప్రోత్సప్రోత్సహిస్తూనే ఉంటారు. మా సినిమాను ప్రోత్సహిస్తారు అని కోరుకుంటున్నాను" అని రోహిత్ సత్యన్ తెలిపారు.

"ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేను ఈ రోజు ఒక తెలుగు సినిమాలో నటించి ఈ స్టేజిపై నిలబడడం అనేది ప్రత్యేకంగా అనిపిస్తుంది. నా భాష కానప్పటికీ నన్ను ఆదరించి, నాకు అవకాశం ఇచ్చినందుకుగాను ఆనందంతో పొంగిపోతున్నాను" అని హీరోయిన్ దివ్య విశ్వకర్మ చెప్పారు.

చాలా సాయం చేశారు

"నన్ను నమ్మి నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో నటించిన నటీనటులు, టెక్నికల్ టీం నాకు చాలా సాయం చేశారు" అని హీరోయిన్ దివ్య విశ్వకర్మ తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe