సూర్య బి పాజిటివ్ టీజర్ రిలీజ్- అమెరికా నుంచి వచ్చి 6 నెలల్లో సినిమా పూర్తి- కిష్కింధపురి, దండోరా దర్శకుల కామెంట్స్

Surya Be Positive Teaser Released: చరణ్ పీసర్ల, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరో హీరోయిన్లుగా చేసిన లేటెస్ట్ మూవీ సూర్య బి పాజిటివ్. తాజాగా కిష్కింధపురి డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి, దండోరా దర్శకుడు మురళీకాంత్ చేతుల మీదుగా సూర్య బి పాజిటివ్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు ఏం మాట్లాడారో చూద్దాం.

Apr 21, 2026, 15:19:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Surya Be Positive Teaser Released: కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్‌పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సూర్య బి పాజిటివ్. అరుణ్ కుమార్ పర్వతనేని డీవోపీగా.. గ్యాని సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్‌గా నటించారు.

సూర్య బి పాజిటివ్ టీజర్ రిలీజ్- అమెరికా నుంచి వచ్చి 6 నెలల్లో సినిమా పూర్తి- కిష్కింధపురి, దండోరా దర్శకుల కామెంట్స్
సూర్య బి పాజిటివ్ టీజర్ రిలీజ్- అమెరికా నుంచి వచ్చి 6 నెలల్లో సినిమా పూర్తి- కిష్కింధపురి, దండోరా దర్శకుల కామెంట్స్

నటీనటులు

వీరితోపాటు ఈ సినిమాలో రోహిత్ సత్యన్, సుజాత దీక్షిత్, చంద్ర గౌతమ్, సత్య, సురభి లలిత, గీతన్ సాయి తేజ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మురళీకృష్ణ మన్యం ఎడిటర్‌గా పని చేసిన ఈ మూవీకి రాంబాబు గోసాల లిరిక్స్ అందించారు. బ్రిజేష్ తంగి, చరణ్ పీసర్ల చిత్ర డైలాగులు లిఖించారు.

తాజాగా సూర్య పాజిటివ్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సూర్య బి పాజిటివ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు దండోరా చిత్ర దర్శకుడు మురళికాంత్ దేవసోత్, కిష్కింధపురి డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారి చేతుల మీదుగా సూర్య బి పాజిటివ్ టీజర్ లాంచ్ చేశారు.

కట్ చేసిన విధానం అద్భుతం

ఈ సందర్భంగా కిష్కింధపురి మూవీ డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఈ సినిమా టీజర్ చూసినప్పుడు నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. కట్ చేసిన విధానం అద్భుతంగా ఉంది" అని అన్నారు.

"నేను ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం మురళి గారు నా సీనియర్, అలాగే చరణ్ నా జూనియర్. మేమంతా ఒకటే కాలేజీ నుంచి వచ్చాము. ప్రేక్షకులకు కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. హీరో అవ్వడం అంత సులువు కాదు, ప్రేక్షకులు వారిని హీరోలా చూసుకోవాలి. వారికి ఉన్న కష్టాలు మర్చిపోయి సినిమాలో హీరో గెలిచినప్పుడు తామే గెలిచినట్లు ఫీల్ అవ్వాలి. తెరపై చరణ్ గెలుపును చూసి ప్రేక్షకులు గెలిచినట్లు ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని కౌశిక్ పెగల్లపాటి కోరారు.

6 నెలల్లో పూర్తి చేసుకుని

"షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న రోజుల్లో నా సీనియర్ మురళి అన్న, రమణ అన్న, విజయ్ అన్న చాలా నేర్పించారు. అమెరికా నుంచి వచ్చి ఆరు నెలల్లో సినిమా పూర్తి చేసుకుని వెళ్లారు అంటే నేను నమ్మలేకపోతున్నాను. రోహిత్ సత్య గారి పాత్ర చాలా బాగా అనిపించింది. సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థాంక్స్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని ముగించారు డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి.

దండోరా చిత్ర దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ముందుగా నన్ను ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వచ్చినప్పుడు వీరు చేసిన కష్టం గురించి తెలుసుకున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక సినిమా చేయడం చాలా కష్టమైన విషయం. నేను నా సినిమా (దండోరా) చేసేటప్పుడు అవి అన్నీ చూసాను. ఆ సినిమా ఓటీటీలో ప్రేక్షకుల నుంచి మంచి అభిమానం సంపాదించింది" అని పేర్కొన్నారు.

అమెరికా నుంచి వచ్చి చేయడం

"ఈ చిత్రంలో నటించిన రోహిత్ సత్యన్ గారిని చూసి ఆశ్చర్యపోయాను. చిత్ర బృందం చిన్న విషయాలు కూడా చాలా స్పష్టంగా గుర్తుండిపోయేలా చేశారు. సినిమాలో అవకాశం వచ్చిన మొదటిసారి ఆ అవకాశం ఒక్కసారే వస్తుంది అని అర్థమైన రోజున సినిమా బాగా చేస్తారు" అని దండోరా డైరెక్టర్ అన్నారు.

"సుబ్బా మాధవరపు గారు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇక్కడికి వచ్చి సినిమా చేశారు. అలా చేయడం నావల్ల కాలేదు, దానికి నేను ఆయనను అభినందిస్తున్నాను. డీఓపీ విజువల్స్ బావున్నాయి. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని మురళీకాంత్ తన స్పీచ్ ముగించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More