Sundeep Kishan: తెలుగు హీరో సందీప్ కిషన్ తమిళంలో చేసిన మూవీ ‘సిగ్మా’. ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ్ కానుంది. రేపు (అక్టోబర్ 2)న ప్రపంచవ్యాప్తంగా సిగ్మా మూవీ గ్రాండ్ గా విడుదవ అవుతుంది. ఈ నేపథ్యంలో మూవీని టార్గెట్ చేస్తూ యాంటీ ట్వీట్లు చేస్తున్న వాళ్లకు సందీప్ కిషన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
సందీప్ కిషన్ వార్నింగ్

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఎక్స్ లో పెట్టిన పోస్టు హాట్ టాపిక్ గా మారింది. ‘‘గత కొన్ని రోజులుగా నన్ను, నా సినిమా (సిగ్మా)ను టార్గెట్ చేస్తూ చాలా యాంటీ ట్వీట్లు రావడం చూస్తున్నా. దీని వెనుక ఎవరున్నారో నాకు తెలుసు. దీనికి ఎవరు అమౌంట్ చెల్లిస్తున్నారో కూడా తెలుసు’’ అని సందీప్ కిషన్ తన పోస్టులో రాసుకొచ్చారు.
అందరూ దొరికిపోతారు
‘‘నా కంటే ఎక్కువగా మీరే నష్టపోతారని గుర్తు పెట్టుకోండి. డైరెక్ట్ అయిపోతే అందరూ దొరికిపోతారు మరి చూసుకోండి’’ అని సందీప్ కిషన్ తన మూవీపై నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్న నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
సిగ్మా గురించి
తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్షన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ ‘సిగ్మా’. ఇందులో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు.
యాక్షన్ అడ్వెంచర్ హీస్ట్
{{/usCountry}}తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్షన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ ‘సిగ్మా’. ఇందులో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు.
యాక్షన్ అడ్వెంచర్ హీస్ట్
{{/usCountry}}సిగ్మా మూవీని యాక్షన్ అడ్వెంచర్ హీస్ట్ జోనర్లో తెరకెక్కించారు. అటవీ సంపదను దోచుకునే వీరశంకర్ రెడ్డి (సంపత్ రాజ్) మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. మరోవైపు ట్రెజర్ హంట్ (నిధుల వేట) చేసే యువకుడు సిగ్మాగా సందీప్ కిషన్ నటించాడు.
తన తల్లి కోరిక మేరకు సిగ్మా ఓ నిధి కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలోనే రూ.500 కోట్ల డీల్‌కు సంబంధించి వీర శంకర్ రెడ్డి గ్యాంగ్‌తో సిగ్మా తలపడాల్సి వస్తుంది. మరి ఈ నిధి వేట కథలో ఎలాంటి ట్విస్టులు ఉన్నాయి, కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
మంచి హైప్
సిగ్మా మూవీ మంచి హైప్ నెలకొంది. దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా మారి తీసిన సినిమా కావడంతో సిగ్మాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి అందుకు తగ్గట్లు సినిమా ఉంటుందా? డైరెక్టర్ గా జాసన్ ఫస్ట్ స్టెప్ ఎలా ఉంది? అనేది రేపు తెలిసిపోతుంది.