Tollywood Trend: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. హీరోలకు ఆ లోపాలు ఉంటేనే సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయా?
Tollywood Trend: టాలీవుడ్లో గతానికి భిన్నంగా సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. కథ డిమాండ్ మేరకు అంగవైకల్యం ఉన్న పాత్రల్లో నటించేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. రామ్ చరణ్ 'పెద్ది', అఖిల్ 'లెనిన్' సహా పలు సినిమాల్లో శారీరక లోపం ఉన్న పాత్రలతో హీరోలు ప్రయోగాలు చేస్తున్నారు.
Tollywood Trend: తెలుగు సినిమాల్లో ట్రెండ్ మారుతోంది. తాజాగా చిరంజీవి లీక్ తో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కాకా సినిమాలో అనస్వర రాజన్ క్యారెక్టర్ కు మాటలు రావని చిరు హింట్ ఇచ్చారు. దీంతో సినిమాల్లో అంగవైకల్యంపై చర్చ మరోసారి జోరందుకుంది.

లోపాలతో హిట్లు
ఒకప్పుడు కమర్షియల్ సినిమాలో హీరో అంటే ఎలాంటి లోపాలు లేని పర్ఫెక్ట్ మనిషి. సిక్స్ ప్యాక్, అదిరిపోయే స్టైల్ ఉండాల్సిందే. కానీ, కాలం మారింది. కథ డిమాండ్ మేరకు అంగవైకల్యం ఉన్న పాత్రల్లో నటించడానికి స్టార్ హీరోలు ఏమాత్రం వెనకాడటం లేదు.
కాళ్లు, కళ్లు, మాట పోగొట్టుకునే క్యారెక్టర్లతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. 'రంగస్థలం'లో వినికిడి లోపం ఉన్న చిట్టిబాబుగా రామ్ చరణ్, 'రాజా ది గ్రేట్'లో అంధుడిగా రవితేజ చేసిన మ్యాజిక్ తర్వాత ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది.
ఉప్పెన నుంచి పెద్ది వరకు
ఈ ట్రెండ్ గురించి మాట్లాడితే ముందుగా సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన గురించి చెప్పుకోవాలి. ఆయన తన తొలి సినిమా 'ఉప్పెన'లో హీరో వైష్ణవ్ తేజ్ క్యారెక్టర్‌కు పురుషాంగం లేకుండా చేసి సంచలనం సృష్టించాడు. ఆ ఒక్క ట్విస్ట్ అప్పట్లో ఎంతటి హాట్ టాపిక్ అయిందో, సినిమాను ఎంతటి బ్లాక్ బస్టర్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో కూడా బుచ్చిబాబు తన మార్క్ చూపించాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కాలు కోల్పోయే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా కంటతడి పెట్టించాయో తెలిసిందే. చరణ్ యాక్టింగ్, ఆ ఎమోషనల్ సీన్స్ సినిమా విజయానికి కీలకంగా మారాయి.
'లెనిన్'గా అఖిల్.. మూగవాడిగా అర్జున
ఇక అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'లెనిన్'లో కూడా దర్శకుడు అద్భుతమైన ప్రయోగం చేశాడు. ఈ చిత్రంలో అఖిల్ అంధుడిగా నటించి తనలోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించాడు. కళ్లు లేకపోయినా విలన్లను ఎదిరించే తీరు సినిమాకు హైలైట్‌గా నిలిచింది.
అలాగే ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'ఇట్లు అర్జున' సినిమాలో హీరో క్యారెక్టర్ మూగవాడి పాత్ర. మాటలు రాకపోయినా, కేవలం తన హావభావాలతో హీరో కనబరిచిన నటన అందరినీ కట్టిపడేసింది.
నవ్వులు పూయించిన ఎఫ్ 3
కేవలం ఎమోషనల్, యాక్షన్ రోల్స్ మాత్రమే కాదు.. సాలిడ్ కామెడీ కోసం కూడా దర్శకులు ఈ లోపాలను వాడుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ 'ఎఫ్ 3'లో వెంకటేష్ కు రేచీకటి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు నత్తి ఉంటుంది. ఈ సమస్యలతో ఆడియన్స్ ను దర్శకుడు అనిల్ రావిపూడి కడుపుబ్బా నవ్వించాడు.
మేకర్స్ స్కెచ్
హీరో లేదా హీరోయిన్‌కు ఏదైనా శారీరక లోపం ఉన్నప్పుడు, ఆ పాత్ర పడే కష్టం ప్రేక్షకుల్లో ఈజీగా సింపతీ క్రియేట్ చేస్తుంది. వారు ఎదుర్కొనే అవమానాలు, కష్టాలు ఆడియన్స్ కు త్వరగా కనెక్ట్ అవుతాయి. ఆ పాత్ర తన లోపాన్ని జయించి, విలన్లను ఎదిరించి విజయం సాధించినప్పుడు వచ్చే గూస్ బంప్స్ మామూలుగా ఉండవు. కథలో బలమైన ఎమోషన్ పండటానికి ఇంతకంటే మంచి ఫార్ములా ఉండదని టాలీవుడ్ మేకర్స్ గట్టిగా నమ్ముతున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


