VRK Rao: వైభవంగా ప్రముఖ నిర్మాత వీఆర్‌కే రావు మనవరాలి వివాహం- సినీ తారల నుంచి క్రీడా కారుల వరకు హాజరు- ఎవరెవరంటే?
Producer VRK Rao Grand Daughter Wedding Celebration: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, అంది అవార్డ్ గ్రహిత వీఆర్‌కే రావు మనవరాలి వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి సినీ, క్రీడా రంగం నుంచి అతిరథ మహారథులతోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు అయ్యారు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
Producer VRK Rao Grand Daughter Wedding Celebration: ప్రముఖ నిర్మాత వీఆర్‌కే రావు మనవరాలి వివాహ వేడుక కన్నుల ఘనంగా సాగింది. భారత వైమానిక దళ మాజీ కమాండర్, నిర్మాత వీఆర్‌కే రావు గారాల మనవరాలు హిమశ్రీ వేమూరి, కైలాష్ గోగినేనిల వివాహ మహోత్సవం జన్వాడలోని నియో కన్వెన్షన్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

సినీ తారల నుంచి క్రీడా కారుల వరకు
మే 1న జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. గోగినేని శ్రీనివాసరావు- గోగినేని ప్రియాంక దంపతుల జ్యేష్ఠ పుత్రుడు అయిన కైలాష్ గోగినేని, వేమూరి అమరనాథ్-వేమూరి గీత దంపతుల జ్యేష్ఠ పుత్రిక హిమశ్రీ వేమూరిల వివాహాన్ని వీఆర్‌కే రావు చాలా గ్రాండ్‌గా జరిపించారు.
అయితే, వీఆర్‌కే రావు కేవలం ఒక సైనికుడిగానే కాకుండా సమాజ సేవకుడిగా, కళాకారుడిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా ఉత్తమ కమాండర్ అవార్డు అందుకున్న ఘనత ఆయనది.
రిటైర్మెంట్ తర్వాత అజైల్ గ్రూప్ ద్వారా ఏకంగా 32 వేల మందికి ఉపాధి కల్పించారు. సమాజ శ్రేయస్సు కోరే ఆయన వ్యక్తిత్వం ఈ పెళ్లి వేడుకలోనూ అడుగడుగునా ప్రతిబింబించింది. బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేసిన నిర్మాతగా రావుకి ప్రత్యేక గుర్తింపు ఉంది. వరకట్నం, అవినీతి వంటి సామాజిక రుగ్మతలపై ఆయన తీసిన సందేశాత్మక చిత్రాలు అనేక ప్రతిష్టాత్మక నంది అవార్డులను అందుకున్నాయి.
మొగుడ్స్ పెళ్లామ్స్‌తో నంది
శివాజీ రాజా హీరోగా తెరకెక్కిన 'మొగుడ్స్ పెళ్లామ్స్' చిత్రంతో నిర్మాతగా మరో నంది అవార్డును అందుకుని అతి తక్కువ కాలంలోనే చిత్రసీమలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు. అజైల్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ఆయన అందించిన సినిమాలు నేటికీ ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే.. మే 1న ఉదయం 10:24 గంటలకు హిమశ్రీ, కైలాష్ వివాహం అత్యంత వేడుకగా జరిగింది. వరుడు కైలాష్ గోగినేని అమెరికాలో పీహెచ్‌డీ పూర్తి చేయగా, వధువు హిమశ్రీ యూకేలో ఎంఎస్సీ పట్టా అందుకున్నారు. ఉన్నత విద్యావంతులైన ఈ యువ జంటను దీవించడానికి వచ్చిన అతిథుల జాబితా చూస్తే రాజభవనాన్ని తలపించింది.
సినీ పెద్దలు కేఎస్ రామారావు, శివాజీ రాజా, సాయి కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలో సందడి చేశారు. అశోక్ కుమార్, రాజీవ్ కనకాల, శివ బాలాజీ-మధుమిత దంపతులు ఈ పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు అలీ, యాంకర్ శిల్పా చక్రవర్తి వంటి వారు హాజరై సందడి చేశారు.
కుటుంబంతో శేఖర్ మాస్టర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన కుటుంబంతో కలిసి రావడం విశేషం. వివాహానికి ముందు నిర్వహించిన సంగీత్ ప్రోగ్రామ్‌లో సినీ తారల ఆటపాటలు అతిథులను మంత్రముగ్ధులను చేశాయి. అలాగే, రాజకీయ రంగం నుంచి కూడా భారీ ఎత్తున ప్రముఖులు ఈ వివాహానికి తరలివచ్చారు.
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, లక్ష్మీ పార్వతి ఈ వేడుకకు హాజరై రావు కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు సైతం ఈ వేడుకలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది.
నియో కన్వెన్షన్ పరిసరాలన్నీ విద్యుత్ కాంతులతో, పూల అలంకరణలతో మెరిసిపోయాయి. వచ్చిన అతిథులకు వీఆర్‌కే రావు అద్భుతమైన విందును ఏర్పాటు చేశారు. రుచికరమైన వంటకాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అతిథులను ఫిదా చేసింది. తన మనవరాలి పెళ్లిని ఒక మధుర జ్ఞాపకంగా మిగిల్చేలా వీఆర్‌కే రావు చేసిన ప్లానింగ్ చూస్తుంటే.. అటు దేశ సేవలో, ఇటు కళా సేవలో ఆయన చూపించిన అదే నిబద్ధత ఇక్కడ కూడా కనిపించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఒకే వేదిక పైకి
సమాజంలో ఇంతటి ఉన్నత స్థాయి వ్యక్తులను ఒకే వేదిక పైకి తీసుకురావడం నిర్మాత రావు వ్యక్తిత్వానికి నిదర్శనమని అతిథులు కొనియాడారు. మొత్తానికి సైబర్ మెడోస్ నుంచి జన్వాడ వరకు సాగిన ఈ పెళ్లి సంబరం భాగ్యనగరంలో ఒక అద్భుత ఘట్టంగా నిలిచిపోయింది.
దేశం కోసం పోరాడిన సైనికుడిగా, నిరుద్యోగులకు నీడ నిచ్చిన యజమానిగా, కళాకారుడిగా వీఆర్‌కే రావు సాధించిన విజయాలు ఈ వేడుకలో ప్రతిబింబించాయి. కొత్త దంపతులు కూడా వీఆర్‌కే రావు బాటలోనే నడవాలని పెద్దలు ఆశీర్వదించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


