Villain Vivek Chepuri Hero Debut Movie: హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్‌లోని పి అండ్ టి కాలనీకి చెందిన కుర్రాడు వివేక్ చేపూరి. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
ఫలక్‌నుమా దాస్ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో

2019లో వచ్చిన 'ఫలక్‌నుమా దాస్' సినిమాలో రవి అనే పాత్రలో నెగెటివ్ షేడ్స్ పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మాస్ కథనంతో రూపుదిద్దుకున్న ఆ చిత్రంలో హీరో విశ్వక్ సేన్‌కి ధీటుగా నిలిచి ప్రతిభ నిరూపించుకున్నాడు. విలన్‌గా అవకాశాలు వెల్లువెత్తినా తొందరపడకుండా, మంచి పాత్రల కోసం ఓపికగా ఎదురుచూసే దారి ఎంచుకున్నాడు.
'కల్ట్' మూవీతో సరికొత్త సంచలనం
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ విశ్వక్ సేన్ నిర్మాణంలో వచ్చిన 'కల్ట్' చిత్రం వివేక్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో 'ఇషాన్' అనే విలక్షణమైన, భయాందోళనకు గురిచేసే పాత్రలో వివేక్ జీవించాడు. యువతను ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్, డార్క్ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకున్న 'కల్ట్' సినిమాలో ఇషాన్ పాత్ర తెచ్చిన ఇంటెన్స్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.
రకరకాల వీడియో ఎడిట్స్, రీల్స్ వైరల్
ఈ పాత్రకు సంబంధించిన రకరకాల వీడియో ఎడిట్స్, రీల్స్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. విశ్వక్ సేన్ కొత్త నటీనటులకు, స్థానిక ప్రతిభకు ఎప్పుడూ పెద్దపీట వేస్తారనే పేరుంది. 'ఫలక్‌నుమా దాస్' నుంచి 'కల్ట్' వరకు వివేక్ లోని నటనా సామర్థ్యాన్ని విశ్వక్ సేన్ సరైన రీతిలో వాడుకున్నారు.
విలన్ నుంచి హీరోగా గ్రాండ్ ఎంట్రీ
అలా ఇప్పటివరకు ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన వివేక్ చేపూరి ఇప్పుడు సోలో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. దర్శకుడు టి. శరత్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నారు.
విజువల్స్ అద్భుతంగా ఉండేలా
{{/usCountry}}అలా ఇప్పటివరకు ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన వివేక్ చేపూరి ఇప్పుడు సోలో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. దర్శకుడు టి. శరత్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నారు.
విజువల్స్ అద్భుతంగా ఉండేలా
{{/usCountry}}విజువల్స్ అద్భుతంగా ఉండేలా ప్రియేష్ గురుస్వామి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిత్ర బృందం నవంబర్ మాసంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
కథనాయకుడిగా మొదటి ప్రాజెక్ట్ కోసం
నగర వీధుల నుంచి మొదలైన వివేక్ ప్రయాణం నేటి యువ కళాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తోంది. కథానాయకుడిగా తన మొదటి ప్రాజెక్ట్ కోసం అతడు పడుతున్న శ్రమ, ఎంచుకున్న కథాంశం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిపెడతాయని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.