...
...
Next Story

ఓటీటీలో ఈ ఏడాది వచ్చిన టాప్ 10 హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. మీరు ఎన్ని చూశారు?

ఈ ఏడాది ఎన్నో హారర్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చాయి. వాటిలో మలయాళం, హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ లాంటి భాషలకు చెందిన మూవీస్ ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకోండి. మీరు ఎన్ని చూశారు? ఒకవేళ చూడకపోతే ఈ ఇయర్ ఎండ్ వీకెండ్ లో ప్లాన్ చేసుకోండి.

Published on: Dec 22, 2025, 14:49:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

2025 సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలోనూ హారర్ సినిమాల హవా నడిచింది. 'సినర్స్' నుంచి మలయాళ చిత్రం 'డియస్ ఇరే' వరకు ప్రేక్షకులను భయపెట్టిన టాప్ 10 హారర్ సినిమాల జాబితా (IMDb రేటింగ్స్ ఆధారంగా) ఇక్కడ చూడండి.

టాప్ 10 హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇవే

ఓటీటీలో ఈ ఏడాది వచ్చిన టాప్ 10 హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. మీరు ఎన్ని చూశారు?
ఓటీటీలో ఈ ఏడాది వచ్చిన టాప్ 10 హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. మీరు ఎన్ని చూశారు?

మరికొన్ని రోజుల్లో 2025కి గుడ్ బై చెప్పబోతున్నాం. కానీ ఈ ఏడాదిని హారర్ మూవీ లవర్స్ అంత త్వరగా మర్చిపోలేరు. ఎందుకంటే థ్రిల్, భయం, ఉత్కంఠ రేకెత్తించే అనేక సినిమాలు ఈ ఏడాది అలరించాయి. ఐఎండీబీ (IMDb)లో అధిక రేటింగ్ సంపాదించిన టాప్ 10 హారర్ సినిమాలు, అవి స్ట్రీమింగ్ అవుతున్న ప్లాట్‌ఫామ్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

1. సినర్స్ (Sinners)

ప్లాట్‌ఫామ్: జియో హాట్‌స్టార్ (JioHotstar)

రేటింగ్: 7.6

కొన్నేళ్ల తర్వాత తమ సొంత ఊరికి తిరిగి వచ్చిన ఇద్దరు కవల సోదరుల కథ ఇది. అక్కడ ఒక దుష్టశక్తి వారి కోసం కాచుకుని ఉంటుంది. ఈ ఏడాది అత్యంత భయానక చిత్రాల్లో ఇదీ ఒకటి.

2. వెపన్స్ (Weapons)

ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

రేటింగ్: 7.5

ఒక క్లాస్ లోని పిల్లలందరూ హఠాత్తుగా మాయమైపోతారు. ఒక్కరు తప్ప. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఉత్కంఠ రేపుతుంది. ప్రైమ్ వీడియోలో దీనిని చూడొచ్చు.

3. ఫ్రాంకెన్‌స్టైన్ (Frankenstein)

ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

ఒక సైంటిస్ట్ చేసిన చిన్న తప్పు.. ఎంత పెద్ద వినాశనానికి దారితీసిందో ఇందులో చూపించారు. ఆయన సృష్టించిన ఒక వింత జీవి వల్ల జరిగే అనర్థాలే ఈ కథ. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

4. వశ్ లెవెల్ 2 (Vash Level 2)

ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

రేటింగ్: 7.3

బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ 'వశ్' (Vash)కు ఇది సీక్వెల్. చేతబడి, వశీకరణం నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టింది. ఇదొక గుజరాతీ మూవీ కావడం విశేషం.

5. బ్రింగ్ హర్ బ్యాక్ (Bring Her Back)

ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

రేటింగ్: 7.1

ఒక మహిళ ఇద్దరు అన్నాచెల్లెళ్లను దత్తత తీసుకుంటుంది. కానీ ఆ కొత్త ఇంట్లో వారికి తెలిసే నిజాలు మైండ్ బ్లాక్ చేస్తాయి.

6. బారాముల్లా (Baramulla)

ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

రేటింగ్: 7.0

హాలీవుడ్ సినిమాలే కాదు.. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ హారర్ సినిమా కూడా గట్టిగానే భయపెట్టింది. మానవ్ కౌల్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. కశ్మీర్ లోని బారాముల్లా పట్టణంలో సాగే కథగా చూపించారు.

7. డియస్ ఇరే (Dies Irae)

ప్లాట్‌ఫామ్: జియోహాట్‌స్టార్

రేటింగ్: 7.0

ఇదొక మలయాళ హారర్ థ్రిల్లర్. ఒక వ్యక్తికి తన గర్ల్ ఫ్రెండ్ అనుమానాస్పద మృతి వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే క్రమంలో ఎదురయ్యే భయానక నిజాలు ఇందులో ఉంటాయి. ప్రణవ్ మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించాడు.

8. ది అగ్లీ స్టెప్ సిస్టర్ (The Ugly Stepsister)

ప్లాట్‌ఫామ్: ప్రైమ్ వీడియో

రేటింగ్: 7.0

తన సవతి సోదరి కంటే అందంగా కనిపించాలనే తాపత్రయంలో ఒక అమ్మాయి ఊహించని పనులు చేస్తుంది. ఆ పరిణామాలు భయానకంగా ఉంటాయి.

9. కంపానియన్ (Companion)

ప్లాట్‌ఫామ్: జియో హాట్‌స్టార్

రేటింగ్: 6.9

స్నేహితులతో కలిసి వెళ్లిన ఒక ట్రిప్ (Camping) పీడకలగా మారుతుంది. గంటా 37 నిమిషాల నిడివి గల ఈ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా చెప్పొచ్చు.

10. ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్ (Final Destination: Bloodlines)

ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

రేటింగ్: 6.7

చావు నుంచి తప్పించుకున్న ఒక మహిళ ఏళ్ల తరబడి ఒక గదిలో దాక్కుంటుంది. భవిష్యత్తులో రాబోయే ముప్పు గురించి ఆమె కుటుంబానికి తెలియదు. ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన చివరి సినిమా ఇది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe