తెలుగులో నంబర్ 1 సీరియల్ ఇప్పుడు మరింత ఎత్తుకు ఎదిగింది. కార్తీక దీపం సీరియల్ తాజాగా 44వ వారం రికార్డు టీఆర్పీ రేటింగ్ సాధించింది. అంతేకాదు ఈసారి కూడా స్టార్ మా సీరియల్స్ హవా కొనసాగింది. టాప్ 6లోనే కాదు టాప్ 10లోనూ ఎలాంటి మార్పూ లేదు.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

ఎప్పటిలాగే తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా ఛానెల్ దూకుడు కొనసాగింది. ఈ ఏడాది 44వ వారం కూడా ఆ ఛానెల్ కు చెందిన 6 సీరియల్స్ టాప్ 6లో ఉన్నాయి. తొలిస్థానంలో కార్తీక దీపం 2 సీరియల్ ఉంది. ఈ సీరియల్ కు తాజాగా 15.28 రేటింగ్ రావడం విశేషం. ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా 13.92 రేటింగ్ నమోదు చేసింది.
మూడో స్థానంలో ఇంటింటి రామాయణం ఉంది. దీనికి 13.30 రేటింగ్ వచ్చింది. నాలుగో స్థానంలో గుండె నిండా గుడి గంటలు నిలిచింది. కొద్దిలో మూడో స్థానం కోల్పోయిన ఈ సీరియల్ 13.19 రేటింగ్ సాధించింది. ఐదో స్థానంలో చిన్ని సీరియల్ కొనసాగుతోంది. దీనికి తాజాగా 10.84 రేటింగ్ రాగా.. ఆరో స్థానంలో నిండుమనసులు ఉంది. ఈ సీరియల్ కు 8.33 రేటింగ్ వచ్చింది. ప్రతి వారం ఈ సీరియల్ ఎంతో కొంత మెరుగవుతూ వస్తోంది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక టాప్ 10 తెలుగు టీవీ సీరియల్స్ లో చివరి నాలుగు స్థానాల్లోనూ జీ తెలుగుకు చెందిన సీరియల్స్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఈ ఛానెల్ దూకుడు పెంచుతోంది. ఎప్పుడూ టాప్ 10లో ఉండే సీరియల్సే ఈవారం కూడా కొనసాగాయి. అలా ఆ ఛానెల్ కు చెందిన మేఘసందేశం 8.06 రేటింగ్ తో ఓవరాల్ గా ఏడో స్థానంలో ఉంది.
{{/usCountry}}ఇక టాప్ 10 తెలుగు టీవీ సీరియల్స్ లో చివరి నాలుగు స్థానాల్లోనూ జీ తెలుగుకు చెందిన సీరియల్స్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఈ ఛానెల్ దూకుడు పెంచుతోంది. ఎప్పుడూ టాప్ 10లో ఉండే సీరియల్సే ఈవారం కూడా కొనసాగాయి. అలా ఆ ఛానెల్ కు చెందిన మేఘసందేశం 8.06 రేటింగ్ తో ఓవరాల్ గా ఏడో స్థానంలో ఉంది.
{{/usCountry}}ఆ తర్వాత 7.68 రేటింగ్ తో జగద్ధాత్రి ఎనిమిదో స్థానానికి దూసుకొచ్చింది. 7.43 రేటింగ్ తో లక్ష్మీనివాసం, 7.35 రేటింగ్ తో చామంతి సీరియల్స్ ఆ తర్వాత రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఛానెల్ కు చెందిన మరో సీరియల్ జయం కూడా 7కుపైగా రేటింగ్ సాధించినా.. టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయింది.