...
...
Next Story

Horror Thrillers OTT: ఓటీటీలో వెన్నులో వణుకు పుట్టించే 5 బెస్ట్ సౌత్ హారర్ థ్రిల్లర్లు-చేతబడి, దెయ్యాల కాన్సెప్ట్ తో!

Top 5 Horror Thrillers OTT: మీకు హారర్ సినిమాలు అంటే ఇష్టమా? దెయ్యాలు, చేతబడి, క్షుద్ర పూజల నేపథ్యంలో సాగే కథలు చూడాలని ఉందా? అయితే ఈ సినిమాలు మీ వాచ్ లిస్ట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే. కేవలం భయపెట్టడమే కాదు.. ఉత్కంఠభరితమైన సస్పెన్స్, ఊహించని మలుపులతో ఈ సినిమాలు మిమ్మల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి.

Published on: Nov 13, 2026, 12:02:53 IST
Advertisement

Top 5 Horror Thrillers OTT: ఓటీటీలో హారర్ థ్రిల్లర్లు చాలా ఉన్నాయి. అయితే వీటిలో ఈ టాప్ 5 సౌత్ ఇండియా మూవీస్ మాత్రం చాలా స్పెషల్. ఐఎండీబీలో టాప్ రేటింగ్ తో ఉన్న ఈ సినిమాలు చూస్తే వెన్నులో వణుకు పుట్టడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

మసూద (Masooda)

ఓటీటీలో వెన్నులో వణుకు పుట్టించే 5 బెస్ట్ సౌత్ హారర్ థ్రిల్లర్లు-చేతబడి, దెయ్యాల కాన్సెప్ట్ తో!
ఓటీటీలో వెన్నులో వణుకు పుట్టించే 5 బెస్ట్ సౌత్ హారర్ థ్రిల్లర్లు-చేతబడి, దెయ్యాల కాన్సెప్ట్ తో!

ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, అతని పక్కింట్లో ఉండే ఓ తల్లి, కూతురు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ పాప ప్రవర్తనలో అనుకోకుండా భయంకరమైన మార్పులు వస్తాయి. ఆ పాపను దుష్టశక్తి నుంచి రక్షించే క్రమంలో వారు ఎదుర్కొనే ఊహించని, భయానక సంఘటనలే 'మసూద' కథ.

తిరువీర్, సంగీత, కావ్య కళ్యాణ్ రామ్ తదితరులు నటించిన ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి 7.2 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

విరూపాక్ష (Virupaksha)

1990ల కాలంలో రుద్రవనం అనే ఊరి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. చేతబడి చేశారనే అనుమానంతో ఒక కుటుంబాన్ని ఊరి జనం సజీవ దహనం చేస్తారు. ఆ ఘటన తర్వాత ఊళ్లో వరుసగా దారుణమైన మరణాలు సంభవిస్తుంటాయి. సరిగ్గా అదే సమయానికి ఊరికి వచ్చిన సూర్య.. ఈ మరణాల వెనుక ఉన్న అసలు కారణాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు.

బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. దీనికి ఐఎమ్‌డీబీలో 7.2 రేటింగ్ ఉంది. విరూపాక్ష సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఉంది.

మా ఊరి పొలిమేర (Maa Oori Polimera)

కథ ముందుకు సాగే కొద్దీ ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటపడతాయి. హారర్‌కు సస్పెన్స్‌ను జోడించి ప్రేక్షకులను చివరి వరకూ కట్టిపడేసే పక్కా రా అండ్ రస్టిక్ మూవీ ఇది. ఐఎమ్‌డీబీ రేటింగ్ 7.2గా ఉంది. జియోహాట్‌స్టార్ (JioHotstar)లో ఈ సినిమాను చూడొచ్చు.

అంధకారం (Andhaghaaram)

ఇదొక డిఫరెంట్ హారర్-సైకలాజికల్ థ్రిల్లర్. ఒకరికొకరు ఏమాత్రం సంబంధం లేని ముగ్గురు వ్యక్తుల జీవితాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. కథలో రివీల్ అయ్యే ట్విస్టులు సినిమా సస్పెన్స్‌ను అమాంతం పెంచేస్తాయి. మైండ్ బెండింగ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. 7.5 ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉన్న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో ఉంది.

యావరుమ్ నలం (Yavarum Nalam)

ఒక కుటుంబం కొత్త ఇంట్లోకి మారిన తర్వాత జరిగే పరిణామాలే ఈ సినిమా. ఆ ఇంట్లో (ఫ్లాట్ నెం: 13B) మెల్లగా వింత సంఘటనలు మొదలవుతాయి. ఆ కుటుంబ సభ్యులు ప్రతిరోజూ టీవీలో ఒక సీరియల్ చూస్తుంటారు. ఆశ్చర్యకరంగా, ఆ సీరియల్‌లో ఏది జరిగితే.. వీరి నిజ జీవితంలోనూ అదే జరుగుతుంటుంది.

సైకలాజికల్ హారర్ జానర్‌లో వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్‌ హిందీలో ‘13B’ పేరుతో రిలీజై ఘనవిజయం సాధించింది. 7.4 ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉన్న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks