...
...
Next Story

Top 5 Movies: రామాయణం నుంచి ఆర్ఆర్ఆర్ వరకు.. ఇండియాలో టాప్ 5 అత్యధిక బడ్జెట్ సినిమాలు ఇవే.. రెండు తెలుగు మూవీస్

Top 5 Movies: ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ఐదు సినిమాల గురించి ఇక్కడ చూడండి. రామాయణం నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఉన్న ఈ జాబితాలో రెండు తెలుగు సినిమాలు చోటు సంపాదించడం విశేషం.

Published on: Sep 21, 2026, 14:41:06 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Top 5 Movies: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ఖర్చులు మునుపెన్నడూ లేని రీతిలో ఆకాశాన్ని తాకుతున్నాయి. మైథలాజికల్ ఎపిక్స్, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్, బిగ్ స్కేల్ యాక్షన్ విజువల్స్ కోసం మన నిర్మాతలు వందల కోట్లు గుమ్మరిస్తున్నారు. వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఇండియాస్ టాప్ 5 అత్యధిక బడ్జెట్ సినిమాల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

టాప్ 5 సినిమాలు ఇవే

Top 5 Movies: రామాయణం నుంచి ఆర్ఆర్ఆర్ వరకు.. ఇండియాలో టాప్ 5 అత్యధిక బడ్జెట్ సినిమాలు ఇవే.. రెండు తెలుగు మూవీస్
Top 5 Movies: రామాయణం నుంచి ఆర్ఆర్ఆర్ వరకు.. ఇండియాలో టాప్ 5 అత్యధిక బడ్జెట్ సినిమాలు ఇవే.. రెండు తెలుగు మూవీస్

1. రామాయణం (Ramayana) : రూ.4,000 కోట్లకు పైగా (2 భాగాలు) - నితేష్ తివారీ

2. టాక్సిక్ (Toxic) : రూ.700 - రూ.800 కోట్లు - గీతు మోహన్ దాస్

3. కల్కి 2898 ఏడీ : రూ.600 కోట్లు - నాగ్ అశ్విన్

4. ఆర్ఆర్ఆర్ (RRR) : రూ.550 కోట్లు - ఎస్ఎస్ రాజమౌళి

5. ఆదిపురుష్ (Adipurush): రూ.500 - రూ.700 కోట్లు - ఓం రౌత్

1. రామాయణం (Ramayana) - రూ.4,000 కోట్లకు పైగా..

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణం' భారతీయ సినిమా నిర్మాణ వ్యయంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ.4,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఈ బిగ్గెస్ట్ విజువల్ వండర్‌లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, రాక్షస రాజు రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్నారు. ప్రఖ్యాత నమిత్ మల్హోత్రా నిర్మాణంలో డీఎన్ఈజీ (DNEG) విజువల్ ఎఫెక్ట్స్ పర్యవేక్షణలో ఈ చిత్రం రూపొందుతోంది. హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. గ్లోబల్ ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

2. టాక్సిక్ (Toxic) - రూ.700 నుండి రూ.800 కోట్లు

రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా నిర్మాణం కోసం దాదాపు రూ.700 నుండి రూ.800 కోట్లు వెచ్చించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడి నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

3. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) - రూ.600 కోట్లు

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌కు డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ జోనర్ తోడైతే ఎలా ఉంటుందో నిరూపించిన చిత్రం 'కల్కి 2898 ఏడీ'. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమాను ప్రముఖ ట్రేడ్ పోర్టల్ సాక్నిల్క్ ప్రకారం రూ.600 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు.

బిగ్ బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపికా పదుకోన్ వంటి దిగ్గజ తారలు నటించిన ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా భవిష్యత్తు ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రొడక్షన్ సెట్స్, 'బుజ్జి' అనే కాన్సెప్ట్ కార్ క్రియేట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం అత్యంత భారీగా నిధులు వెచ్చించి వరల్డ్ క్లాస్ అవుట్‌పుట్ సాధించారు.

4. ఆర్ఆర్ఆర్ (RRR) - రూ.550 కోట్లు

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ యాక్షన్ వండర్ 'ఆర్ఆర్ఆర్' భారతీయ సినిమా ఘనతను ఆస్కార్ వేదికపై నిలబెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మల్టీస్టారర్ రూ.550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది.

ఏళ్ల తరబడి సాగిన షూటింగ్, స్వతంత్రానికి పూర్వపు వాతావరణాన్ని ప్రతిబింబించే భారీ సెట్లు, నాటు నాటు పాటకు కేటాయించిన వనరులు, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ల వీఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు చేశారు. గ్లోబల్ వైడ్‌గా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

5. ఆదిపురుష్ (Adipurush) - రూ.500 నుండి రూ.700 కోట్లు

రామాయణ కావ్యం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'ఆదిపురుష్'. రాఘవుడిగా ప్రభాస్, లంకేషుడిగా సైఫ్ అలీ ఖాన్, జానకిగా కృతి సనన్ నటించిన ఈ చిత్రాన్ని రూ.500 నుండి రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు అంచనా.

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, వర్చువల్ స్టూడియో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం బడ్జెట్‌లో సింహభాగం కేటాయించారు. భారీ స్థాయిలో ప్రమోషన్లు నిర్వహించి విడుదల చేసిన ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా ప్రొడక్షన్ విలువల్లో కీలక మైలురాయిగా నిలిచింది.

వీటితో పాటు రజనీకాంత్ '2.0', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' వంటి చిత్రాలు కూడా వందల కోట్ల బడ్జెట్‌తో రూపొంది భారతీయ సినిమా పరిధిని పెంచాయి. మన సినిమాల బిజినెస్ పొటెన్షియల్ పెరగడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ కంటెంట్‌కు ఆదరణ లభిస్తుండటంతో నిర్మాతలు ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks