OTT Deals: బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన రణవీర్ సింగ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధురంధర్ 2' (Dhurandhar 2) ఇప్పుడు ఓటీటీ మార్కెట్‌లోనూ సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడయ్యాయి. ఇది రణవీర్ కెరీర్‌లోనే అత్యధికం కావడం విశేషం.
జియోహాట్‌స్టార్‌తో భారీ డీల్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ 2 ఇండియన్ డిజిటల్ హక్కులను జియోహాట్‌స్టార్ (JioHotstar) సంస్థ సుమారు రూ.150 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. మొదటి భాగం 'ధురంధర్: ది రివెంజ్' హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.85 కోట్లకు దక్కించుకోగా, ఇప్పుడు రెండో భాగానికి దాదాపు రెట్టింపు ధర లభించడం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.
ఇండియా, విదేశాల్లో స్ట్రీమింగ్ వివరాలు
ఈ ధురంధర్ 2 సినిమా ఓటీటీ విడుదల విషయంలో ఒక ఆసక్తికరమైన మార్పు ఉంది. ఇండియాలో ఈ సినిమా జియోహాట్‌స్టార్ వేదికగా జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక విడుదల తేదీని తాజాగా ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది.
అయితే విదేశాల్లో ఉన్న ప్రేక్షకుల కోసం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమాను మే 15 నుంచి అందుబాటులోకి తెచ్చింది. అక్కడ 'అన్‌కట్, రా' (Uncut and Raw) వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇండియన్ సినిమాల టాప్ ఓటీటీ డీల్స్
ప్రస్తుతం భారతీయ సినీ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన టాప్ డిజిటల్ రైట్స్ జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. టాప్ 8 సినిమాల్లో ఐదు తెలుగు మూవీసే ఉండటం విశేషం. తొలి స్థానంలో కల్కి 2898 ఏడీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.375 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ ఉంది. ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ కలిపి జీ నెట్ వర్క్ ఏకంగా రూ.325 కోట్లు వెచ్చించింది.
కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీ మూడో స్థానంలో ఉండగా.. దీనికోసం ప్రైమ్ వీడియో రూ.320 కోట్లు ఖర్చు చేసింది. పుష్ప 2 ది రూల్ కోసం రూ.275 కోట్లు, ఆదిపురుష్ కోసం రూ.200 కోట్లు, సలార్ పార్ట్ 1 కోసం రూ.160 కోట్లు, దేవర కోసం రూ.150 కోట్లు నెట్‌ఫ్లిక్స్ ఖర్చు చేసింది. తాజాగా ధురంధర్ 2 కోసం జియోహాట్‌స్టార్ కూడా రూ.150 కోట్లు చెల్లించింది.
బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' ప్రభంజనం
{{/usCountry}}కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీ మూడో స్థానంలో ఉండగా.. దీనికోసం ప్రైమ్ వీడియో రూ.320 కోట్లు ఖర్చు చేసింది. పుష్ప 2 ది రూల్ కోసం రూ.275 కోట్లు, ఆదిపురుష్ కోసం రూ.200 కోట్లు, సలార్ పార్ట్ 1 కోసం రూ.160 కోట్లు, దేవర కోసం రూ.150 కోట్లు నెట్‌ఫ్లిక్స్ ఖర్చు చేసింది. తాజాగా ధురంధర్ 2 కోసం జియోహాట్‌స్టార్ కూడా రూ.150 కోట్లు చెల్లించింది.
బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' ప్రభంజనం
{{/usCountry}}మార్చి 19న విడుదలైన ఈ మూవీ థియేటర్లలో అద్భుతమైన వసూళ్లను సాధించింది. రిపోర్ట్స్ ప్రకారం.. ఇండియాలో రూ.1,300 కోట్లకు పైగా.. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,800 కోట్లు వసూలు చేసింది.
ఈ భారీ వసూళ్ల వల్లే ఓటీటీ సంస్థలు కూడా ఈ సినిమా కోసం భారీగా పోటీ పడ్డాయి. రణవీర్ సింగ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, ఆదిత్య ధర్ టేకింగ్ ఈ సినిమాను ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలబెట్టాయి. జియోహాట్‌స్టార్ లో జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ అనే అనౌన్స్‌మెంట్ రావడంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
| సినిమా పేరు | ఓటీటీ ప్లాట్‌ఫామ్ | డీల్ విలువ (సుమారు) |
|---|---|---|
| కల్కి 2898 AD | నెట్‌ఫ్లిక్స్ (హిందీ) + ప్రైమ్ (సౌత్) | ₹375 కోట్లు (మొత్తం) |
| RRR | జీ గ్రూప్ (డిజిటల్ + శాటిలైట్) | ₹325 కోట్లు |
| KGF చాప్టర్ 2 | అమెజాన్ ప్రైమ్ వీడియో | ₹320 కోట్లు |
| పుష్ప 2: ది రూల్ | నెట్‌ఫ్లిక్స్ | ₹275 కోట్లు |
| ఆదిపురుష్ | నెట్‌ఫ్లిక్స్ | ₹200 కోట్లు |
| సలార్: పార్ట్ 1 | నెట్‌ఫ్లిక్స్ | ₹160 కోట్లు |
| దేవర: పార్ట్ 1 | నెట్‌ఫ్లిక్స్ | ₹150 కోట్లు |
| ధురంధర్ 2 | జియో హాట్‌స్టార్ | ₹150 కోట్లు |