Netflix: నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ సిరీస్‌లో పెను మార్పులు- ది రాయల్స్ నుంచి హీరోయిన్ భూమి అవుట్- రొమాన్స్ తగ్గినందుకే!

Bhumi Pednekar Out From Netflix OTT Series The Royals Season 2: ఓటీటీ దిగ్గజ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ ది రాయల్స్ రెండో సీజన్ నుంచి హీరోయిన్ భూమి పెడ్నేకర్ తప్పుకున్నారు. అందుకు కారణం రొమాన్స్ తగ్గడమే అని ది రాయల్స్ సీజన్ 2 మేకర్స్ తెలిపారు. ఈ విషయం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

Published on: May 15, 2026, 12:10:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bhumi Pednekar Out From Netflix OTT Series The Royals 2: డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ది రాయల్స్. 2025లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ది రాయల్స్ ఓటీటీ సిరీస్ రికార్డు వ్యూస్ సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ది రాయల్స్ సిరీస్ నుంచి రెండో సీజన్ రానుంది.

నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ సిరీస్‌లో పెను మార్పులు- ది రాయల్స్ నుంచి హీరోయిన్ భూమి అవుట్- రొమాన్స్ తగ్గినందుకే!
నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ సిరీస్‌లో పెను మార్పులు- ది రాయల్స్ నుంచి హీరోయిన్ భూమి అవుట్- రొమాన్స్ తగ్గినందుకే!

మొదటి సీజన్‌లో హీరోయిన్‌గా

అయితే, ది రాయల్స్ సీజన్ 2 షూటింగ్ ప్రారంభమైన తరుణంలోనే ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. మొదటి సీజన్‌లో హీరోయిన్‌గా ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ఈ రెండో సీజన్ నుంచి అవుట్ అయినట్లు సమాచారం. ఈ మేరకు ఓటీటీ సిరీస్ మేకర్స్ కథలో భారీ మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

కథా గమనంలో మార్పులే కారణమా?

'మిడ్-డే' కథనం ప్రకారం, మొదటి సీజన్‌లో భూమి పెడ్నేకర్, ఇషాన్ ఖట్టర్ మధ్య సాగిన రొమాంటిక్ ట్రాక్‌ను రెండో సీజన్‌లో పక్కన పెట్టాలని మేకర్స్ నిర్ణయించారు. ఈసారి సిరీస్‌ను రొమాంటిక్ కామెడీ నుంచి పక్కా 'ఫ్యామిలీ డ్రామా'గా మార్చనున్నారు. ముఖ్యంగా రాజకుటుంబంలోని అంతర్గత రాజకీయాలు, సంబంధాలపైనే కథ సాగనుంది. ఇందులో సీనియర్ నటీమణులు జీనత్ అమన్, సాక్షి తన్వర్‌తో పాటు ఇషాన్ ఖట్టర్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఈ మార్పుల గురించి ఒక అంతర్గత సోర్స్ స్పందిస్తూ.. "ది రాయల్స్ సిరీస్ విడుదలైనప్పుడు ప్రేక్షకులకు కేవలం రొమాన్స్ కంటే, రాజకుటుంబం మధ్య ఉండే డ్రామానే ఎక్కువగా నచ్చింది. అందుకే మేకర్స్ కథను సహజంగా ముందుకు తీసుకెళ్లాలని భావించారు. భూమికి, టీమ్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవు, కేవలం కథలో ఆమె పాత్రకు స్కోప్ లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు" అని వెల్లడించారు.

భూమికి ఎదురైన విమర్శలు.. కొత్త బాటలో నటి

అంటే, రొమాన్స్‌కు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న నేపథ్యంలో భూమి పెడ్నేకర్ పాత్రకు స్కోప్ ఉండదనే ఆలోచనతో హీరోయిన్‌ను తొలగించినట్లుగా తెలుస్తోంది. నిజానికి 'ది రాయల్స్' మొదటి సీజన్‌కు వ్యూస్ భారీగా వచ్చినా, ఓటీటీ రివ్యూలు మాత్రం మిశ్రమంగా వచ్చాయి.

ముఖ్యంగా భూమి పెడ్నేకర్ నటనపై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. దీనివల్ల ఆమె కొంతకాలం ఆత్మరక్షణలో పడిపోయినట్లు స్వయంగా ఇంటర్వ్యూలలో అంగీకరించారు. ఆ విమర్శలే ఆమెను తన కెరీర్ పట్ల పునరాలోచనలో పడేశాయి.

ఇంటెన్స్ రూల్స్

ప్రస్తుతం భూమి సీరియస్, ఇంటెన్స్ రోల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న దల్‌దల్ రెండో సీజన్‌తో ఆడియెన్స్ ముందుకు రానుంది భూమి పెడ్నేకర్. ఇందులో భూమి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసిన విషయం తెలిసిందే.

అలాగే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం ఇమ్రాన్ ఖాన్ గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తున్న మూవీలో కూడా భూమి పెడ్నేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు భూమిలోని అసలైన నటిని బయటకు తీస్తాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

ది రాయల్స్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్

'ది రాయల్స్' మొదటి సీజన్ ముగిసే సమయానికి ఇషాన్, భూమి మధ్య రొమాన్స్ ఓ కొలిక్కి రాలేదు. దీంతో రెండో సీజన్‌పై ఆసక్తి నెలకొంది. కానీ, ఇప్పుడు హీరోయిన్ పాత్రనే తొలగించడంతో రాజకుటుంబం చుట్టూ అల్లుకున్న రహస్యాలు, ఆధిపత్య పోరు ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. ది రాయల్స్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ తేదీపై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More