...
...
Next Story

OTT: పరీక్షలో ఫెయిల్ అయితే జీవితం ఆగిపోదు.. లైఫ్‌లో స‌క్సెస్ మంత్ర‌.. ఇన్‌స్పైర్ చేసే 5 సినిమాలు.. ఓటీటీలో చూసేయండి

OTT: ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయి. కొంతమందికి అనుకున్న ఫలితాలు రాలేదు. మరికొంతమంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోతుందా? పరీక్షలో ఫెయిల్ అయితే లైఫ్ లో ఫెయిల్ అయినట్టు కాదు. ఇలా పరీక్షలో ఫెయిల్యూర్ ను దాటి సక్సెస్ బాట పట్టించేలా స్ఫూర్తి నింపే ఈ సినిమాలను ఓటీటీలో చూసేయండి.

Published on: Apr 12, 2026, 12:23:46 IST
Advertisement

లైఫ్ లో చదువు ఉండాలి. కానీ చదువొక్కటే లైఫ్ కాదు. పదో తరగతి ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్ అయ్యాడు. అందుకే చదువే జీవితం కాదు. పరీక్షలో ఫెయిల్ అయ్యామని చనిపోవడం ఒక్కటే మార్గం కాదు. పరీక్షలో ఫెయిల్ అయినా జీవితంలో సక్సెస్ కావొచ్చు. అలాంటి స్టోరీ లైన్ వచ్చిన ఈ సినిమాలు ఎప్పుడు చూసినా స్ఫూర్తి కలిగించేవే.

గౌతమ్ ఎస్ఎస్‌సీ

ఓటీటీలో స్ఫూర్తి నింపే సినిమాలు
ఓటీటీలో స్ఫూర్తి నింపే సినిమాలు

పరీక్షల్లో ఫెయిల్ అయితే లైఫ్ ఆగిపోదు అని చాటడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ గౌతమ్ ఎస్ఎస్‌సీ మూవీ. నవదీప్ హీరోగా నటించిన ఈ మూవీ ఎంతో ఇన్ స్పైర్ చేస్తుంది. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టిన హీరో పదో తరగతి కూడా పాస్ కాలేకపోతాడు. ఎన్నో అవమానాలు పడతాడు.

కానీ అక్కడితోనే ఆగిపోడు. మెకానిక్ గా కొత్త కార్బోనేటర్ కనిపెడతాడు. ఎంతో పట్టుదలతో చదవి ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అవుతాడు. ఈ మూవీ జియోహాట్ స్టార్ ఓటీటీతో పాటు యూట్యూబ్ లోనూ ఉంది.

12th ఫెయిల్

చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన హిందీ మూవీ 12th ఫెయిల్. ఇందులో విక్రాంత్ మాస్సే లీడ్ రోల్ ప్లే చేశాడు. 12వ తరగతి ఫెయిల్ అయిన విక్రాంత్ ఎంతో పట్టుదలతో ఐపీఎస్ ఆఫీసర్ గా జీవితంలో విజయం సాధిస్తాడు. ఐపీఎల్ ఎగ్జామ్ క్లియర్ చేసే దిశగా హీరో పోరాటం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లో తెలుగులో ఉంది.

తమ్ముడు

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోకు చదువు పెద్దగా ఎక్కదు. ఇంట్లో నుంచి ఎంతో ప్రెషర్ వస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా చదువుపై ఫోకస్ కుదరదు. అయితే అదే హీరో బాక్సింగ్ లో మాత్రం అదరగొడతాడు. నేషనల్ ఛాంపియన్ గా నిలుస్తాడు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో ఉంది.

నీది నాది ఒకే కథ

అలాంటి విద్యార్థి కథే ‘నీది నాది ఒకే కథ’ మూవీ. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ మూవీ క్లైమాక్స్ మనసును హత్తుకుంటుంది. ఈ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో ఉంది.

బాయ్స్

సిద్దార్థ్, జెనీలియా జంటగా నటించిన మూవీ ‘బాయ్స్’. ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ చుట్టూ ఈ మూవీ కథ సాగుతోంది. చదువు పేరుతో ఒత్తిడి పెట్టే పేరెంట్స్ కు దూరంగా వెళ్లిన ఈ గ్యాంగ్.. చివరకు తమ టాలెంట్ తో అదరగొడతారు. మధ్యలో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ సినిమా సన్ నెక్ట్స్, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఓటీటీల్లో ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe