...
...
Next Story

Weekend OTT: ఈ వారం ఓటీటీలోని టాప్ సినిమాలు.. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలో ఒక్కోటి.. వీకెండ్ కు బెస్ట్!

Weekend OTT: ప్రతివారం ఓటీటీల్లోకి పెద్ద ఎత్తున సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా స్ట్రీమింగ్ కు చాలా మూవీస్ వచ్చాయి. అయితే ఇందులో ఈ టాప్ 4 సినిమాలు ఓటీటీలను షేక్ చేస్తున్నాయి. ఈ వీకెండ్ కు ఈ నాలుగు చిత్రాలపై ఓ లుక్కేయండి.

Published on: Aug 29, 2026, 20:42:02 IST
Advertisement

Weekend OTT: వీకెండ్ కు ఓటీటీలో ఏ సినిమాలు చూడాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ లిస్ట్ మీకోసమే. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన టాప్ 4 సినిమాలు ఇక్కడున్నాయి. ఇందులో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలో వచ్చిన క్రేజీ మూవీస్ ఉన్నాయి. వెంటనే స్ట్రీమింగ్ చేసేయండి.

న్యూటన్స్ థర్డ్ లా

ఈ వారం ఓటీటీలోని టాప్ సినిమాలు.. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలో ఒక్కోటి.. అదిరే థ్రిల్లర్లు.. వీకెండ్ కు బెస్ట్!
ఈ వారం ఓటీటీలోని టాప్ సినిమాలు.. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలో ఒక్కోటి.. అదిరే థ్రిల్లర్లు.. వీకెండ్ కు బెస్ట్!

డిజిటల్ ప్లాట్‌ఫామ్: ETV Win, Netflix

తారగణం: సుమంత్, జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల, త్రినాథ్ వర్మ

స్టోరీ: భౌతికశాస్త్ర ప్రసిద్ధ సూత్రం "ప్రతి చర్యకూ సమానమైన, వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది" అనే కాన్సెప్ట్‌ ఆధారంగా రూపుదిద్దుకున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. ఒక నగరంలో జరిగే వరుస అనుమానాస్పద హత్యలు, వాటి వెనుక ఉన్న రివేంజ్ యాంగిల్‌ను ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా సుమంత్ కనిపిస్తారు. జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించారు.

  • ఎందుకు చూడాలి?

సుమంత్ గతంలో చేసిన థ్రిల్లర్ల మాదిరిగానే ఇందులోనూ మైండ్ గేమ్స్, సైంటిఫిక్ లాజిక్స్ ఆకట్టుకుంటాయి. థియేటర్లలో తక్కువ మైలేజ్ పొందినప్పటికీ, ఓటీటీలో మైండ్ బెండింగ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్.

ఆల్ఫా

డిజిటల్ ప్లాట్‌ఫామ్: Netflix

తారగణం: అలియా భట్, శార్వరి, బాబీ డియోల్, అనిల్ కపూర్

స్టోరీ: యశ్ రాజ్ ఫిలిమ్స్ (YRF) ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్‌లో వచ్చిన తొలి ఫీమేల్-లీడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. 'సీత' (అలియా భట్) అనే ‘రా’ ఏజెంట్‌ను అత్యంత ప్రమాదకరమైన ‘ఆల్ఫా’ సోల్జర్‌గా తీర్చిదిద్దే క్రమంలో సాగే ప్రయోగం, ఆమె తన సోదరి దుర్గ (శార్వరి)తో కలిసి ఫతే సింగ్ (బాబీ డియోల్) సైనిక సామ్రాజ్యాన్ని ఎలా కూల్చివేసింది అనేదే కథ.

  • ఎందుకు చూడాలి?

డిజిటల్ ప్లాట్‌ఫామ్: SonyLIV

తారగణం: పారి ఎలావళగన్, రమ్య రంగనాథన్

స్టోరీ: తమిళంలో విమర్శకుల ప్రశంసలు పొంది సోనీలివ్‌లో 5 భాషల్లో విడుదలైన ఫ్యామిలీ డ్రామా 'అన్బే డయానా'. హిందూ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయి లవ్, పెళ్లి చుట్టూ మూవీ కథ తిరుగుతుంది.

  • ఎందుకు చూడాలి?

కంటెంట్ డ్రివెన్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామా ఆస్వాదించే ఆడియన్స్‌కు ఇది పర్ఫెక్ట్. సీనియర్ నటి చాలా కాలం తర్వాత ఈ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఐ, నోబడీ

డిజిటల్ ప్లాట్ ఫామ్: జియోహాట్‌స్టార్‌, సింప్లీ సౌత్

తారగణం: పృథ్వీరాజ్ సుకుమారన్‌, పార్వతీ తిరువోతు తదితరులు

స్టోరీ: మలయాళం మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ ఐ, నోబడీ. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి రూ.17 కోట్ల బ్యాంక్ రాబరీ కేసులో చిక్కుకుంటాడు. అసలు ఆ ఉద్యోగి ఎవరు? దొంగతనం ఎవరు చేశారన్నదే మూవీ స్టోరీ.

  • ఎందుకు చూడాలి?

మలయాళం సినిమాల్లో కథను చూపించే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక థ్రిల్లర్ అంటే సస్పెన్స్ వేరే లెవల్ లో ఉంటుంది. ఈ సినిమాలోనూ అదే కనిపిస్తోంది. థ్రిల్లర్ లవర్స్ ఎంజాయ్ చేసే ఫిల్మ్ ఇది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe