మిక్స్‌డ్ టాక్, షాకింగ్‌గా అలియా భట్ ఆల్ఫా డే 1 కలెక్షన్స్- స్పై యూనివర్స్ చరిత్రలోనే అత్యల్పం- ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Alia Bhatt Alpha Box Office Collection Day 1: బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా'కు షాకింగ్ కలెక్షన్స్ నమోదయ్యాయి. అలియా భట్, శార్వరి వాఘ్ నటించిన ఈ సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయో చూద్దాం.

Published on: Jul 4, 2026, 10:18:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Alia Bhatt Alpha 1st Day Worldwide Box Office Collection: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆల్ఫా' (Alpha) జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మిక్స్‌డ్ టాక్, షాకింగ్‌గా అలియా భట్ ఆల్ఫా డే 1 కలెక్షన్స్- స్పై యూనివర్స్ చరిత్రలోనే అత్యల్పం- ఎన్ని కోట్లు వచ్చాయంటే?
మిక్స్‌డ్ టాక్, షాకింగ్‌గా అలియా భట్ ఆల్ఫా డే 1 కలెక్షన్స్- స్పై యూనివర్స్ చరిత్రలోనే అత్యల్పం- ఎన్ని కోట్లు వచ్చాయంటే?

మొదటిసారి మహిళా గూఢచారిగా

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అలియా భట్, ఈ క్రేజీ స్పై యూనివర్స్‌లో మొదటిసారి మహిళా గూఢచారిగా నటించడంతో ఆల్ఫా సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రాలేదు.

ఈ మిశ్రమ టాక్ ప్రభావం సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లపై స్పష్టంగా కనిపించింది. వైఆర్ఎఫ్ స్పై ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఆల్ఫా నిలిచింది.

ఇండియా కలెక్షన్స్

ప్రముఖ ట్రేడ్ విశ్లేషణ వెబ్‌సైట్ 'శాక్నిల్క్' అందించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం.. ఆల్ఫా సినిమా మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా రూ. 9.25 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను సాధించింది. దేశవ్యాప్తంగా మొత్తం 7,534 షోలలో ఈ చిత్రం విడుదలైంది. భారీ స్థాయిలో థియేటర్లు దొరికినప్పటికీ, కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడం, ఎమోషన్స్ పండకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అంతగా ఆసక్తి చూపించలేదు.

ఇండియాలో రూ. 9.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ఆల్పా సినిమాకు రూ. 11.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా అలియా భట్, శార్వరి వాఘ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా సినిమాకు తొలి రోజున రూ. 16.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.

వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో మిగతా సినిమాల పరిస్థితి ఏంటి?

ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఆల్ఫా వసూళ్లు చాలా తక్కువని చెప్పాలి. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వచ్చిన 'వార్ 2' సినిమాకు కూడా నెగెటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ.. కేవలం ఎన్టీఆర్ క్రేజ్, భారీ అంచనాల వల్ల మొదటి రోజే ఇండియాలో ఏకంగా రూ. 52 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.

ఆ సినిమాను దేశవ్యాప్తంగా 19,455 షోలలో ప్రదర్శించారు. ఇక షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా రూ. 57 కోట్ల నెట్ వసూళ్లతో ఈ యూనివర్స్‌లోనే ఆల్‌టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన రికార్డును తన పేరిట ఉంచుకుంది. వీటితో పోల్చి చూస్తే ఆల్ఫా సాధించిన రూ. 9 కోట్లు చాలా తక్కువ మొత్తమనే చెప్పాలి.

'జిగ్రా' కంటే బెటర్ కానీ..

అలియా భట్ గత చిత్రం 'జిగ్రా' (2024) బాక్సాఫీస్ ఓపెనింగ్స్‌తో పోలిస్తే ఆల్ఫా కొంత మెరుగైన ప్రదర్శన కనబరిచింది. జిగ్రా సినిమా మొదటి రోజు 5,779 షోల ద్వారా రూ. 4.55 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, దాదాపు రెండేళ్ల తర్వాత అలియా మళ్లీ ఆల్ఫాతో థియేటర్లలోకి అడుగుపెట్టింది.

హృతిక్ రోషన్ మెరుపులు..

జిగ్రా రికార్డును ఆల్ఫా దాటినప్పటికీ ఒక స్టార్ స్టడెడ్ స్పై ఫిల్మ్‌కు ఈ స్థాయి వసూళ్లు రావడం బాలీవుడ్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. శివ్ రావల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం హృతిక్ రోషనే. 'వార్' సిరీస్‌లో తను పోషించిన ఐకానిక్ 'కబీర్' పాత్రలో హృతిక్ ఇందులో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి థియేటర్లలో కాసేపు సందడి చేశారు.

శార్వరి డబుల్ ధమాకా

మరోవైపు హీరోయిన్ శార్వరికి ఈ నెలలోనే ఇది రెండో విడుదల కావడం విశేషం. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో శార్వరి వాఘ్ నటించిన 'మై వాపస్ ఆవుంగా' సినిమా ఇప్పటికీ థియేటర్లలో నడుస్తుండగానే, ఇప్పుడు ఆల్ఫా కూడా బరిలోకి దిగింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More