డబ్బు కంటే మంచి సినిమా ముఖ్యం- ఆ మూవీ కోసం 42 లక్షల బిల్లు మాఫీ చేసిన షారుఖ్ ఖాన్- ఇప్పుడేమో 80 కోట్ల కలెక్షన్స్!

Shah Rukh Khan Waived 42 Lakhs To Deool Band 2 DCP: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. బడ్జెట్ కష్టాల్లో ఉన్న ఓ చిన్న సినిమా ‘దేవుల్ బంద్ 2’కి రూ. 42 లక్షల ఫీజును పూర్తిగా మాఫీ చేసి అండగా నిలిచారు. ఇప్పుడు ఆ సినిమా ఏకంగా రూ. 80 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది.

Published on: Jun 19, 2026, 11:49:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Shah Rukh Khan Waived 42 Lakhs To Deool Band 2 DCP: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కేవలం వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తానే ‘బాద్‌షా’ అని నిరూపించుకున్నారు. బడ్జెట్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఒక ప్రాంతీయ సినిమాకు ఆయన చేసిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డబ్బు కంటే మంచి సినిమా ముఖ్యం- ఆ మూవీ కోసం 42 లక్షల బిల్లు మాఫీ చేసిన షారుఖ్ ఖాన్- ఇప్పుడేమో 80 కోట్ల కలెక్షన్స్!
డబ్బు కంటే మంచి సినిమా ముఖ్యం- ఆ మూవీ కోసం 42 లక్షల బిల్లు మాఫీ చేసిన షారుఖ్ ఖాన్- ఇప్పుడేమో 80 కోట్ల కలెక్షన్స్!

షారుఖ్ ఖాన్ సాయం వల్లే

షారుఖ్ ఖాన్ తన ప్రొడక్షన్ హౌస్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ ద్వారా చేసిన ఒక పెద్ద సాయం వల్లే తమ సినిమా ఇంతటి భారీ విజయాన్ని అందుకుందని మరాఠీ చిత్ర దర్శకుడు ప్రవీణ్ తార్డే కృతజ్ఞతతో వెల్లడించారు. ఆ సినిమానే ‘దేవుల్ బంద్ 2’.

80 కోట్ల కలెక్షన్స్ దాటి

ప్రస్తుతం దేవుల్ బంద్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్ల మార్కును దాటి, అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో మరాఠీ సినిమాగా రికార్డు సృష్టించింది. అసలు ఏం జరిగిందనే వివరాలను దర్శకుడు ప్రవీణ్ తార్డే ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

థియేటర్లలో సినిమాను ప్రదర్శించడానికి అవసరమయ్యే డిజిటల్ ఫార్మాట్ అయిన ‘డిజిటల్ సినిమా ప్యాకేజీ’ (DCP) కోసం దేవుల్ బంద్ 2 బృందం షారుఖ్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సంప్రదించింది. మన టాలీవుడ్‌లో క్యూబ్ (Qube) లేదా యూఎఫ్ఓ (UFO) ఫార్మాట్లలో సినిమాలు ఎలా ల్యాబ్స్ నుంచి థియేటర్లకు వెళ్తాయో, బాలీవుడ్‌లో రెడ్ చిల్లీస్ ల్యాబ్స్ కూడా అలాంటి సాంకేతిక సేవలను అందిస్తాయి.

రూ.12 లక్షల బడ్జెట్.. రూ.42 లక్షల బిల్లు!

ఈ పనుల కోసం మరాఠీ నిర్మాతలు రూ.12 లక్షలు కేటాయించారు. కానీ, ఫైనల్ బిల్లు వచ్చేసరికి అది రూ.42 లక్షలకు చేరింది. ప్రాంతీయ సినిమాలకు బడ్జెట్ పరిమితులు ఉంటాయి కాబట్టి, అంత పెద్ద మొత్తాన్ని చెల్లించే శక్తి ఆ చిత్ర బృందానికి లేకపోయింది.

రంగంలోకి దిగిన కింగ్ ఖాన్

బిల్లు చెల్లించకపోవడంతో ల్యాబ్‌లోనే డీసీపీ ప్రింట్ నిలిచిపోయింది. సినిమా విడుదల ఆగిపోయే పరిస్థితి రావడంతో ప్రవీణ్ తార్డే రెడ్ చిల్లీస్ యాజమాన్యాన్ని కలిసి తమ ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఈ విషయం చివరకు షారుఖ్ ఖాన్ దగ్గరకు వెళ్లింది. దీనిపై షారుఖ్ స్పందించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

గతంలో ప్రవీణ్ తార్డే తెరకెక్కించిన ‘ముల్షీ ప్యాటర్న్’ సినిమాను సల్మాన్ ఖాన్ ‘అంతిమ్’ పేరుతో రీమేక్ చేశారు. ఆ పరిచయంతో ప్రవీణ్ తార్డే ప్రతిభపై షారుఖ్‌కు ఒక అవగాహన ఉంది. తన టెక్నికల్ టీమ్‌ను అడిగి ‘దేవుల్ బంద్ 2’ కథ గురించి తెలుసుకున్నారు. అది సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే ఎమోషనల్ సినిమా అని, బడ్జెట్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలియగానే షారుఖ్ పెద్ద మనసుతో స్పందించారు.

డబ్బు సంగతి తర్వాత

"వాళ్ల బిల్లును పూర్తిగా మాఫీ చేయండి. అది ఒక మరాఠీ సినిమా. సినిమా బాగుంటే చాలు, వెంటనే డీసీపీ ప్రింట్ ఇచ్చేయండి. డబ్బు సంగతి తర్వాత చూసుకోవచ్చు" అని షారుఖ్ ఖాన్ తన టీమ్‌కు ఆదేశాలు ఇచ్చారని ప్రవీణ్ తార్డే తెలిపారు. షారుఖ్ ప్రాంతీయ సినిమాలకు, మరాఠీ చిత్ర పరిశ్రమకు ఇచ్చిన గౌరవం చూసి తాము ఆశ్చర్యపోయామని ఆయన పేర్కొన్నారు.

రూ.100 కోట్ల క్లబ్‌ వైపు అడుగులు

"ఆ రోజు ఆ సినిమా ఎలా ఆడుతుందో, అసలు కలెక్షన్లు వస్తాయో లేదో ఎవరికీ తెలియదు. ఎలాంటి గ్యారెంటీ లేకపోయినా షారుఖ్ ఖాన్ మాకు చేసిన ఆ సాయాన్ని జీవితంలో మర్చిపోలేం. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం" అని ప్రవీణ్ తార్డే భావోద్వేగానికి లోనయ్యారు.

షారుఖ్ చూపిన ఉదారత వల్లే సినిమా సకాలంలో విడుదలై, నేడు రూ.80 కోట్లు దాటి రూ.100 కోట్ల క్లబ్‌ వైపు దూసుకుపోతోంది. 2015లో వచ్చిన సూపర్‌ హిట్ ‘దేవుల్ బంద్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా వచ్చింది.

కంటెంట్ బాగుంటే

మోహన్ జోషి, స్నేహల్ తార్డే ప్రధాన పాత్రల్లో నటించిన దేవుల్ బంద్ 2 సినిమా సమాజంలో ఎంతో సున్నితమైన రైతుల ఆత్మహత్యల నేపథ్యాన్ని స్పృశిస్తూ, దేవుడిపై నమ్మకం-నాస్తికత్వం మధ్య ఉండే సంఘర్షణను అద్భుతంగా తెరకెక్కించింది. కంటెంట్ బాగుంటే ప్రాంతీయ సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు మాత్రమే కాదు, షారుఖ్ లాంటి గ్లోబల్ స్టార్స్ కూడా ముందుంటారని ఈ ఘటన నిరూపించింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More