...
...
Next Story

This Week Top OTT: ఈ వారం ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 6 సినిమాలు- మిస్టరీ థ్రిల్లర్స్ నుంచి ఫ్యామిలీ డ్రామాల వరకు!

This Week Top OTT: ఈ వారం ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు కొత్త రిలీజ్ లు క్యూ కట్టాయి. అయితే ఇందులో తప్పకుండా చూడాల్సిన టాప్ 6 సినిమాలు, సిరీస్ లు ఏంటో ఇక్కడ చూసేయండి. ఈ లిస్ట్ లో మిస్టరీ, హారర్, క్రైమ్ థ్రిల్లర్లు కూడా ఉన్నాయి. ఇవి కచ్చితంగా థ్రిల్ అందిస్తాయని చెప్పొచ్చు.

Published on: Sep 8, 2026, 11:03:14 IST
Advertisement

This Week Top OTT: ఓటీటీ లవర్స్ కు ఈ వారం వినోదాల విందు లభించనుంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో విభిన్న జోనర్లలో సరికొత్త సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ వారం ఓటీటీలోకి టాప్ సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. జీ5 (ZEE5), నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video), జియోహాట్‌స్టార్ (JioHotstar)లో రిలీజ్ కాబోతున్నవి ఇవే.

వీరభద్రుని రహస్యం (సీజన్ 1 - పార్ట్ 2)

ఈ వారం ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 6 సినిమాలు- మిస్టరీ థ్రిల్లర్స్ నుంచి ఫ్యామిలీ డ్రామాల వరకు!
ఈ వారం ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 6 సినిమాలు- మిస్టరీ థ్రిల్లర్స్ నుంచి ఫ్యామిలీ డ్రామాల వరకు!

గ్రామీణ నేపథ్యం, దైవ విశ్వాసాలు, వరుస అనుమానాస్పద మరణాల చుట్టూ సాగే మిస్టరీ థ్రిల్లర్ 'వీరభద్రుని రహస్యం'. ఇప్పటికే మొదటి భాగంతో వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ తెలుగు వీక్లీ సిరీస్.. ఇప్పుడు రెండవ భాగంతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. సెప్టెంబర్ 9 నుంచి పాపులర్ ఓటీటీ వేదిక 'జీ5' (ZEE5)లో ఈ సిరీస్ పార్ట్ 2 స్ట్రీమింగ్ కానుంది.

విశ్వనాథ్ అండ్ సన్స్

కుటుంబ భావోద్వేగాలు, ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో అదరగొట్టింది. సూర్య, మమితా బైజు జంటగా నటించిన ఈ మూవీ కలెక్షన్ల రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ ఒకేసారి 'నెట్‌ఫ్లిక్స్' (Netflix)లో సెప్టెంబర్ 11న రిలీజ్ అవుతుంది.

మకుటం

భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకున్న తమిళ చిత్రం 'మకుటం'. హీరో విశాల్ డైరెక్టర్ గా మారి ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 11న డిజిటల్ రిలీజ్ కానుంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు భాషలో కూడా 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Prime Video) వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

పంచనామా

మలయాళ చిత్రసీమ నుంచి వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'వరవు'. వైవిధ్యమైన కథనంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మలయాళ భాషలో సెప్టెంబర్ 11న 'జీ5' (ZEE5) వేదికగా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అలీబాబా ఔర్ 40 భూత్

చిన్న పిల్లలతో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించే ఫాంటసీ హారర్ అడ్వెంచర్ సిరీస్ 'అలీబాబా ఔర్ 40 భూత్'. ఈ హిందీ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి ‘జియోహాట్‌స్టార్’ ఓటీటీలో ప్రసారమవుతుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks