పార్టీ అంటే చిన్నదో పెద్దదో డీజే బాక్స్ మాత్రం ఉండాలి. ఉర్రూతలూగించే పాటలు ప్లే అవుతూ ఉండాలి. ఇక డిసెంబర్ 31 పార్టీ అంటే ఇక సందడి ఏ రేంజ్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పార్టీలు ప్లాన్ చేసుకునే వాళ్లు ముందుగా సౌండ్ సిస్టమ్స్ అరేంజ్ చేసుకుంటారు. నైట్ అంతా పాటలతో హోరెత్తిస్తారు. మరి డిసెంబర్ 31 పార్టీలో ప్లే చేయాల్సిన పాటలు ఇక్కడ ఉన్నాయి. 2025లో ఊపు ఊపిన టాప్ 5 సాంగ్స్ ఇవి.
సైయారా టైటిల్ సాంగ్

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది హిందీ మూవీ సైయారా. కలెక్షన్ల మోత మోగించింది. మరోవైపు మ్యూజిక్ తోనూ మాయ చేసింది. ఈ రొమాంటిక్ డ్రామా సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక సైయారా టైటిల్ ట్రాక్ అయితే ఊపేస్తోంది. స్పాటిఫై గ్లోబల్ టాప్ 50లో చోటు దక్కించుకున్న ఫస్ట్ బాలీవుడ్ సాంగ్ ఇదే. యూట్యూబ్ లోనే ఈ సాంగ్ కు 59 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయి.
రాను బొంబాయికి రాను
మాస్ పార్టీకి పర్ఫెక్ట్ సాంగ్ ‘రాను బొంబాయికి రాను’. ఈ తెలుగు డీజే సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ ఫోక్ బీట్, లిరిక్స్, డ్యాన్స్ కలిపి సాంగ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇందులో బిగ్ బాస్ 9 ఫేమ్ రాము రాథోడ్ పాడి, ఆడాడు. ప్రతి పెళ్లి వేడుకలోనూ, బారాత్, పార్టీల్లో ఈ సాంగ్ వినిపించాల్సిందే. ఈ పాటకు ఇప్పటికే 69 కోట్లకు పైగా యూట్యూబ్ వ్యూస్ ఉన్నాయి.
షేకీ
యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్.. ఇలా ఎక్కడ చూసినా మరాఠీ పాట ‘షేకీ’ వినిపిస్తోంది. సంజు రాథోడ్ పాడిన ఈ పాటలో నటి ఇషా మాల్వీయ డ్యాన్స్ తో అదరగొట్టింది. ఫోక్ మ్యూజిక్ కు లేటెస్ట్ ఆఫ్రో బీట్స్ యాడ్ చేయడంతో ఈ పాట ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా ఈ సాంగ్ లోని హుక్ స్టెప్ పాపులర్ అయింది. ఇప్పటికే షార్ట్స్, రీల్స్ లో ఈ సాంగ్ 350 మిలియన్ వ్యూస్ దాటేసింది. యూట్యూబ్ లో 60 కోట్లతో దూసుకెళ్తోంది.
రాంఝా
{{/usCountry}}యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్.. ఇలా ఎక్కడ చూసినా మరాఠీ పాట ‘షేకీ’ వినిపిస్తోంది. సంజు రాథోడ్ పాడిన ఈ పాటలో నటి ఇషా మాల్వీయ డ్యాన్స్ తో అదరగొట్టింది. ఫోక్ మ్యూజిక్ కు లేటెస్ట్ ఆఫ్రో బీట్స్ యాడ్ చేయడంతో ఈ పాట ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా ఈ సాంగ్ లోని హుక్ స్టెప్ పాపులర్ అయింది. ఇప్పటికే షార్ట్స్, రీల్స్ లో ఈ సాంగ్ 350 మిలియన్ వ్యూస్ దాటేసింది. యూట్యూబ్ లో 60 కోట్లతో దూసుకెళ్తోంది.
రాంఝా
{{/usCountry}}ఊపు ఊపే డీజే సాంగ్స్ మాత్రమే కాదు మనసును తాకే మెలోడీలు కూడా పార్టీలో మోగుతుంటాయి. ఒక్కసారి అలాంటి పాట రాగానే అందరూ ఏదో ట్రాన్స్ ఫీల్ అవుతారు. అలాంటి పాటనే ‘దో పత్తి’ సినిమాలోని ‘రాంఝా’. 2025లో ఈ పాట సెన్సేషనల్ గా మారింది. కొన్ని వారాల పాటు ట్రెండింగ్ లో కొనసాగింది. ఈ పాటకు యూట్యూబ్ లో 45 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయి.
తేరి రంజోలీ బొలేగీ
తెలుగు ఫోక్ సాంగ్సే కాదు ఈ హరియాణా జానపద గీతం ‘తేరి రంజోలీ బొలేగీ’ కూడా 2025లో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అటు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనే తేడా లేకుండా మ్యూజిక్ లవర్స్ తో డ్యాన్స్ చేయిస్తోంది ఈ సాంగ్. ముఖ్యంగా ఈ సాంగ్ బీట్ వింటే కుదురుగా కూర్చోవడం కష్టమే.