Yash Toxic OTT Release Details: 'కేజీఎఫ్' సినిమాలతో సంచలనం సృష్టించిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన భారీ వయోలెంట్ బోల్డ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ఇవాళ (ఆగస్ట్ 26) వచ్చింది.
నెగెటివ్ టాక్, ఓటీటీలోకి టాక్సిక్

లేడి డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియా యాక్షన్ డ్రామాపై విడుదల ముందు నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. డిఫరెంట్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ప్రచారం పొందిన ఈ చిత్రం మాత్రం ఘోరంగా నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంటోంది.
అంతేకాకుండా టాక్సిక్ సినిమాకు దారుణంగా రివ్యూలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాక్సిక్ ఓటీటీ వివరాలపై అందరిదృష్టి పడింది. మరి టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్ డీటేల్స్‌తో పాటు సినిమా ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
టాక్సిక్ కథేంటంటే?
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇంకా పోర్చుగీస్ పాలనలోనే ఉన్న గోవా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. గోవాలోని అక్రమ దందాలన్నింటినీ తన గుప్పెట్లో ఉంచుకోవాలని రాయా (యశ్), అతని సోదరి గంగ (నయనతార) ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో గ్యాంగ్‌స్టర్ సాల్వడార్ (డారెల్ డిసిల్వా) కుమార్తె రెబెక్కా (తారా సుతారియా)ను వివాహం చేసుకోవడానికి రాయా సిద్ధమవుతాడు.
సరిగ్గా అదే సమయంలో నదియా (కియారా అద్వానీ) రాకతో రాయా ఆలోచనలు మారుతాయి. కఠినంగా ఉండే ఆ గ్యాంగ్‌స్టర్‌లో ప్రేమ భావాలు మేల్కొంటాయి. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? రాయా చేసిన పాపాలకు ఎలాంటి మూల్యం చెల్లించుకున్నాడనేదే మిగతా కథ.
కథనంలో లోపించిన లోతు.. శృతిమించిన హింస
3 గంటల 14 నిమిషాల సుదీర్ఘమైన నిడివితో వచ్చిన 'టాక్సిక్' రక్తపాతం, హింసతో నిండిపోయింది. యశ్, గీతు మోహన్‌దాస్ రాసుకున్న కథలో కీలకమైన ట్విస్ట్ చాలా ఆలస్యంగా వస్తుంది. అప్పటివరకు కథనాన్ని నడిపించడానికి విచక్షణారహితంగా తుపాకులు, గొడ్డళ్లు, బాంబులతో నరకడమే సరిపోయింది. ఎందుకు కొట్టుకుంటున్నారో, ఎవరి కోసం పోరాడుతున్నారో అర్థంకాని స్థాయిలో నరమేధాన్ని తెరపై చూపించారు.
ఆకట్టుకోలేకపోయిన పాత్రల రూపకల్పన
{{/usCountry}}3 గంటల 14 నిమిషాల సుదీర్ఘమైన నిడివితో వచ్చిన 'టాక్సిక్' రక్తపాతం, హింసతో నిండిపోయింది. యశ్, గీతు మోహన్‌దాస్ రాసుకున్న కథలో కీలకమైన ట్విస్ట్ చాలా ఆలస్యంగా వస్తుంది. అప్పటివరకు కథనాన్ని నడిపించడానికి విచక్షణారహితంగా తుపాకులు, గొడ్డళ్లు, బాంబులతో నరకడమే సరిపోయింది. ఎందుకు కొట్టుకుంటున్నారో, ఎవరి కోసం పోరాడుతున్నారో అర్థంకాని స్థాయిలో నరమేధాన్ని తెరపై చూపించారు.
ఆకట్టుకోలేకపోయిన పాత్రల రూపకల్పన
{{/usCountry}}కథలో బలమైన భావోద్వేగాలు లేకపోవడంతో చిన్న చిన్న సాంకేతిక లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. సినిమాలో రాయా పాత్ర హింసనే తన మాతృభాషగా చెప్పుకుంటూ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఆమె అతని వెంటే పడటం సహజత్వానికి దూరంగా ఉంది.
రాయా, అతని కొడుకు టికెట్ (యశ్ ద్విపాత్రాభినయం) పాత్రల వెనుక ఎంతటి విషాదకరమైన గతం ఉన్నప్పటికీ, ఆ పాత్రల తీరు వల్ల ప్రేక్షకులకు వారిపై ఎలాంటి సానుభూతి కలగదు. పైగా ఎమోషనల్ సీన్లలో టికెట్ పాత్ర ప్రవర్తన నవ్వు తెప్పించేలా ఉంది.
హీరోయిన్లకు దక్కని ప్రాధాన్యం
గంగ (నయనతార), నదియా (కియారా అద్వానీ) పాత్రలు మాత్రమే కొంతవరకు పర్వాలేదనిపిస్తాయి. హుమా ఖురేషీ నటించిన ఎలిజబెత్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. యాంటి-హీరో లేదా విలన్ తన తప్పులకు మూల్యం చెల్లించుకుంటాడనే సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ, కథలో ఎక్కువ భాగం హీరో పాత్రను ఆరాధించడానికే కేటాయించారు.
ఇలా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న టాక్సిక్ ఓటీటీ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకుందని సమాచారం. అయితే, టాక్సిక్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ వంటి భారీ ప్లాట్‌ఫామ్స్‌తో పోటీ నెలకొందట. కానీ, ఆ పోటీని అధిగమించి జీ5 ఓటీటీ సంస్థ టాక్సిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రూ. 250 కోట్లకుపైగా వెచ్చించి దక్కించుకున్నట్లు ఒక టాక్ నడుస్తోంది.
టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్
ఈ లెక్కన చూసుకుంటే జీ5లోనే టాక్సిక్ ఓటీటీ రిలీజ్ అవనుందని తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కలెక్షన్స్, టాక్ అన్నింటిని దృష్టిలో ఉంచుకుని టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. అప్పటివరకు కేవలం వయోలెన్స్, బోల్డ్ కంటెంట్ ఇష్టపడేవారు మాత్రం థియేటర్లలో టాక్సిక్ సినిమాను చూడటం ఉత్తమం.