సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరైన త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి తన సినిమాల వల్ల కాదు.. తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యల కారణంగా ఆమె సీరియస్ అయింది. కొన్ని రోజుల కిందట తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్, త్రిషను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన త్రిష.. సోమవారం (ఫిబ్రవరి 16) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది.
త్రిష లీగల్ స్టేట్‌మెంట్‌లో ఏముందంటే?

త్రిష తరఫు న్యాయవాది విడుదల చేసిన ఈ ప్రకటనలో బీజేపీ నేత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "ఇండియన్ సినీ నటి, నా క్లయింట్ త్రిష కృష్ణన్ ఆదేశాల మేరకు నేను ఈ విషయాన్ని రికార్డు చేస్తున్నాను. మీడియాలో నా క్లయింట్ గురించి ప్రచారంలో ఉన్న అసభ్యకరమైన వ్యాఖ్యల పట్ల మేము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము" అని అందులో ఉంది.
ఇంకా కొనసాగిస్తూ.. "రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత పదవిలో ఉన్న ఒక వ్యక్తి నుంచి ఇంతటి నీచమైన, అనుచిత వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్ అస్సలు ఊహించలేదు" అని త్రిష తరఫు న్యాయవాది అందులో పేర్కొన్నారు.
"నా క్లయింట్ త్రిషకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. భవిష్యత్తులో కూడా చేరాలనే ఉద్దేశం లేదు. గతంలో చెప్పినట్లుగానే, ఆమె రాజకీయాల విషయంలో ఎప్పుడూ తటస్థ వైఖరినే అవలంబిస్తున్నారు" అని అందులో స్పష్టం చేశారు.
నా పేరు లాగొద్దు
"త్రిషను ఆమె నటన ద్వారానే గుర్తించాలి తప్ప, ఆరోపించబడిన రాజకీయ సంబంధాలతో కాదు. అన్నింటికంటే ముఖ్యంగా, వ్యక్తిగత జీవితాలను బహిరంగ చర్చలకు వస్తువుగా మార్చకూడదు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు హుందాగా ప్రవర్తించాలి. ఆమెకు సంబంధం లేని విషయాల్లోకి ఆమె పేరును లాగవద్దు" అని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు త్రిష "అగౌరవాన్ని ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉండాలి" అని క్యాప్షన్ జోడించింది.
విజయ్ - త్రిష బంధంపై రూమర్స్..
త్రిష, దళపతి విజయ్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి క్రేజ్ ఉంది. 'గిల్లి' (Ghilli), 'లియో' (Leo) వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇటీవల వచ్చిన 'ది గోట్' సినిమాలో కూడా త్రిష అతిథి పాత్రలో మెరిసింది. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో తరచూ రూమర్స్ వస్తుంటాయి.
{{/usCountry}}త్రిష, దళపతి విజయ్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి క్రేజ్ ఉంది. 'గిల్లి' (Ghilli), 'లియో' (Leo) వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇటీవల వచ్చిన 'ది గోట్' సినిమాలో కూడా త్రిష అతిథి పాత్రలో మెరిసింది. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో తరచూ రూమర్స్ వస్తుంటాయి.
{{/usCountry}}అయితే విజయ్ 1999లోనే సంగీతను వివాహం చేసుకున్నాడు. వారికి సంజయ్, దివ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయ్ ఇటీవల 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీని స్థాపించి, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కెరీర్ పరంగా త్రిష ఫుల్ స్వింగ్‌లో ఉంది. గతేడాది ఆమె నటించిన ‘విడాముయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, మణిరత్నం 'థగ్ లైఫ్' సినిమాలు విడుదలయ్యాయి. త్వరలో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’, 'కరుప్పు' చిత్రాల్లో ఆమె కనిపించనుంది.