...
...
Next Story

Trisha Vijay: దళపతిని అడిగినట్లు చెప్పండి: అభిమాని సడెన్ షాక్.. సిగ్గు పడిన త్రిష.. వీడియో వైరల్

Trisha Vijay: విజయ్ గురించి అడగ్గానే త్రిష సిగ్గు పడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. కరుప్పు మూవీ స్క్రీనింగ్ తర్వాత కారులో వెళ్తుండగా.. దళపతిని అడిగానని చెప్పండి అని ఓ అభిమాని అనడంతో ఆమె కచ్చితంగా అంటూ నవ్వేసింది.

Published on: May 15, 2026, 21:03:48 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Trisha Vijay: చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ వద్ద శుక్రవారం (మే 15) ఒక ఆసక్తికరమైన సీన్ కనిపించింది. తన తాజా మూవీ 'కరుప్పు' (Karuppu) ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు వచ్చిన నటి త్రిష కృష్ణన్.. అక్కడ తనపై అభిమానులు కురిపించిన ప్రేమికి మురిసిపోయారు. అయితే ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి ఆమె ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"తలపతిని అడిగానని చెప్పండి.."

Trisha Vijay: దళపతిని అడిగినట్లు చెప్పండి: అభిమాని సడెన్ షాక్.. సిగ్గు పడిన త్రిష.. వీడియో వైరల్
Trisha Vijay: దళపతిని అడిగినట్లు చెప్పండి: అభిమాని సడెన్ షాక్.. సిగ్గు పడిన త్రిష.. వీడియో వైరల్

షో ముగిసిన తర్వాత త్రిష తన కారులో బయలుదేరుతుండగా అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. ఆ సమయంలో ఒక అభిమాని గట్టిగా.. "మేడమ్, తలపతి (దళపతి విజయ్)ని అడిగానని చెప్పండి" అని అనగానే.. త్రిష మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. నవ్వుతూ, సిగ్గుపడుతూ "కచ్చితంగా (Kandipa)" అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత తన ఫోన్ చూసుకుంటూ తల దించుకుని నవ్వుకోవడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

విజయ్ ప్రమాణ స్వీకారంలో 'స్పెషల్' గెస్ట్

మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వేళ, ఆ వేడుకలో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. విజయ్ తల్లి శోభ, తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్‌లతో కలిసి త్రిష ముందు వరుసలో కూర్చోవడం చర్చనీయాంశమైంది.

"ప్రేమ ఎప్పుడూ గట్టిగానే వినిపిస్తుంది" అంటూ ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

డేటింగ్ పుకార్లకు బలం?

గత కొంతకాలంగా విజయ్-త్రిషల మధ్య ఏదో నడుస్తోందనే పుకార్లు కోలీవుడ్‌లో షికారు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. మార్చిలో ఒక వివాహ వేడుకలో విజయ్, త్రిష జంటగా ఒకే రంగు (గోల్డ్ కలర్) దుస్తుల్లో కనిపించడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది.

ప్రస్తుతం 'కరుప్పు' (తెలుగులో వీరభద్రుడు) విజయంతో జోరు మీదున్న త్రిష చేతిలో మరిన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న సోషియో-ఫాంటసీ మూవీ విశ్వంభర ఎంతో ఆసక్తి రేపుతోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'కరుప్పు' సినిమాలో త్రిష పాత్ర ఏమిటి?

ఈ సినిమాలో త్రిష.. సూర్య సరసన ఎమోషనల్, కీలకమైన పాత్రలో నటించారు.

2. త్రిష, విజయ్ వివాహం చేసుకోబోతున్నారా?

దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కేవలం వీరిద్దరూ మంచి స్నేహితులని మాత్రమే సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

3. విజయ్ ఏ పార్టీ తరపున సీఎం అయ్యారు?

విజయ్ తన సొంత పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) తరపున ఎన్నికల్లో పోటీ చేసి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe