Trisha: త్రిషకు ‘మే’ నెల ఎందుకంత స్పెషల్? విజయ్ సీఎం అవ్వడం.. సూర్యతో బ్లాక్‌బస్టర్ హిట్ మాత్రమేనా.. ఆ రూమర్స్ నిజమేనా?
Trisha: స్టార్ హీరోయిన్ త్రిష ‘మ్యాజికల్ మే’ అంటూ మే నెల జ్ఞాపకాల్లో మునిగిపోయింది. ఈ మేరకు ఆమె తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. అసలు మే నెలలో ఏమైంది? ఆమెకు ఈ మంత్ ఎందుకంత స్పెషల్? అనే వివరాలు ఇక్కడ చూసేయండి.
Trisha: ‘మ్యాజికల్ మే’ అంటూ మే నెల మెమోరీస్ లో ఉండిపోయింది స్టార్ హీరోయిన్ త్రిష. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. మ్యాజికల్ మే నుంచి తీపి జ్ఞాపకాలు అంటూ పోస్టు పెట్టేసింది. అసలు మే నెలలో ఏం జరిగింది? ఈ నెల ఆమెకు ఎందుకు ఇంత స్పెషల్ గా మారిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

త్రిష పోస్ట్ వైరల్
త్రిష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో మే నెల జ్ఞాపకాలకు సంబంధించిన సరికొత్త ఫొటోలను పంచుకుంది. గడిచిన కొన్ని వారాల్లో తన జీవితంలో చోటుచేసుకున్న ప్రత్యేకమైన, అత్యంత ఆత్మీయమైన క్షణాలను త్రిష అభిమానులతో షేర్ చేసుకుంది. గ్లామర్ ప్రపంచానికి దూరంగా, తన వ్యక్తిగత జీవితంలో ఎంతటి ప్రశాంతతను ఆస్వాదించిందో ఈ ఫొటోల ద్వారా చాటిచెప్పింది. ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
మ్యాజికల్ మే
"మ్యాజికల్ మే నుంచి మరికొన్ని స్వీట్ మెమోరీస్.. వీటిని చూస్తూ చాలా కాలం పాటు నా పెదవులపై చిరునవ్వులు వికసిస్తూనే ఉంటాయి" అని త్రిష ఆ పోస్టుకు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇందులో స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి జరుపుకున్న వేడుకలతో పాటు, ఆమెకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క ‘ఇజ్జీ’తో దిగిన క్యూట్ ఫొటోలు కూడా ఉన్నాయి. సెలబ్రిటీ హోదా, వెండితెర వెలుగుల వెనుక దాగి ఉండే త్రిష సాధారణ హృదయాన్ని ఈ పోస్ట్ ఆవిష్కరించింది.
ఎందుకంత స్పెషల్?
మే నెల గురించి త్రిష ప్రత్యేకంగా పోస్టు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల త్రిషకు ఎందుకంత స్పెషల్ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందుకు కొన్ని కారణాలున్నాయి.
- మే నెలలోనే త్రిష బర్త్ డే. ఆమె మే 4న తన పుట్టిన రోజు జరుపుకొంది. ఆ రోజు తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది.
- ఇక త్రిష పుట్టిన రోజైన మే 4నే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో దళపతి విజయ్ పార్టీ టీవీకే ఆధిపత్యం ప్రదర్శించింది.
- మెజారిటీ కూడగట్టిన టీవీకే అధిపతి విజయ్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టాడు.
- విజయ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి త్రిష హాజరైంది. చీరలో ఈ ముద్దుగుమ్మ మెరిసిపోయింది.
- ఇక మే నెలలోనే సూర్యతో కలిసి త్రిష నటించిన ‘కరుప్పు’ మూవీ రిలీజైంది. ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
విజయ్ తో రిలేషన్ షిప్!
తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కు, హీరోయిన్ త్రిషకు మధ్య సంబంధం ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు విజయ్ పై సంచలన ఆరోపణలు చేసిన అతని భార్య సంగీత విడాకులు కోరింది. ఓ హీరోయిన్ తో విజయ్ కు అక్రమ సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. అయితే ఆ హీరోయిన్ త్రిషనే అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
విజయ్, త్రిష కలిసి ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కు వెళ్లారు. ఎన్నికల ఫలితాల రోజు విజయ్ ఇంటికి త్రిష వెళ్లింది. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో మెరిసింది. ఈ నేపథ్యంలో విజయ్, త్రిష మధ్య ఏదో ఉందనేది సోషల్ మీడియా టాక్.
ఫ్యాన్స్ రియాక్షన్
త్రిష పోస్టుకు ఫ్యాన్స్ రియాక్టవుతున్నారు. "ఈ మ్యాజికల్ మే అందించిన సంతోషం మీ జీవితంలో ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని, రాబోయే రోజుల్లో ఇది మరింత రెట్టింపు కావాలని కోరుకుంటున్నాను మై క్వీన్" అని ఒక అభిమాని కామెంట్ చేశాడు.
"మీ పోస్ట్ హఠాత్తుగా నా టైమ్‌లైన్‌లోకి వచ్చినప్పుడు, మీ ఉనికిని ఊహించుకుని నా గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది త్రిష్" అని మరొకరు తన మనసులోని మాటను పంచుకున్నాడు.
"ఈ ఏడాదిలోనే అత్యంత మరపురాని, అదృష్టవంతమైన మే నెల ఇదే" అని ఇంకొక అభిమాని రాసుకొచ్చాడు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: త్రిష ఇటీవల ఏ రాజకీయ వేడుకలో పాల్గొంది?
జవాబు: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన చరిత్రాత్మక వేడుకలో నటి త్రిష పాల్గొంది.
ప్రశ్న: త్రిష ఇటీవల నటించిన 'కరుప్పు' సినిమాలో హీరో ఎవరు?
జవాబు: త్రిష ఇటీవల నటించిన 'కరుప్పు' చిత్రంలో సూర్య హీరోగా నటించాడు. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తోంది.
ప్రశ్న: త్రిష తదుపరి మలయాళ చిత్రం ఏది?
జవాబు: జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ సరసన త్రిష 'రామ్' అనే ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


