...
...
Next Story

Trisha Vs Karuppu: సూర్య కరుపు టీమ్‌పై త్రిష సెటైర్లు.. 'నా ఇన్విటేషన్ పోస్ట్‌లో పోయిందేమో' అంటూ షాకింగ్ ట్వీట్!

Trisha Satire On Suriya Karuppu Movie Team: సూర్య, త్రిష జంటగా నటించిన మూవీ కరుపు. తాజాగా కరుపు మూవీ నుంచి త్రిషకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియోను పోస్ట్ చేసిన ఓ నెటిజన్ త్రిష ఉన్నట్లు మర్చిపోయాను అని కామెంట్ చేయగా.. త్రిష వేసిన రీ ట్వీట్ షాకింగ్‌కు గురి చేసింది.

Published on: May 2, 2026, 10:30:43 IST
Advertisement

Trisha Satire On Suriya Karuppu Movie Team: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ తన తాజా చిత్రం 'కరుపు' టీమ్‌పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. చిత్ర ఆడియో లాంచ్‌కు ఆమె హాజరుకాకపోవడంపై విమర్శలు వస్తున్న తరుణంలో, త్రిష ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రీతిగా త్రిష ఫస్ట్ లుక్.. నెటిజన్ల ప్రశంసలు

సూర్య కరుపు టీమ్‌పై త్రిష సెటైర్లు.. 'నా ఇన్విటేషన్ పోస్ట్‌లో పోయిందేమో' అంటూ షాకింగ్ ట్వీట్!
సూర్య కరుపు టీమ్‌పై త్రిష సెటైర్లు.. 'నా ఇన్విటేషన్ పోస్ట్‌లో పోయిందేమో' అంటూ షాకింగ్ ట్వీట్!

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య, త్రిష జంటగా నటిస్తున్న భారీ చిత్రం 'కరుపు' మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం త్రిషకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఆమె 'ప్రీతి' అనే లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు.

37 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో త్రిష కోర్టు రూమ్‌లో సీరియస్ లాయర్‌గా, మరో సీన్‌లో ఆకుపచ్చ చీరలో డ్యాన్స్ చేస్తూ మెరిశారు. 43 ఏళ్ల వయసులోనూ త్రిష ఇంత యంగ్‌గా ఎలా ఉందంటూ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

వివాదానికి దారితీసిన రీ-ట్వీట్

అయితే, ఒక అభిమాని చేసిన పోస్ట్‌ను త్రిష రీ-షేర్ చేయడంతో వివాదం మొదలైంది. "కరుపు సినిమాలో త్రిష ఉందన్న విషయమే మర్చిపోయాను. ఆమె ఏజ్ రివర్స్ గేర్‌లో వెళ్తోంది" అని ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్‌కు త్రిష స్పందిస్తూ.. "ధన్యవాదాలు. నేనూ మర్చిపోయాను. కనీసం ఇప్పటికైనా వారు రిమైండర్ సెట్ చేసినందుకు సంతోషం" అంటూ చిత్ర యూనిట్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

దీనిపై ఒక సూర్య అభిమాని స్పందిస్తూ.. "ఆడియో లాంచ్‌కే రాని నీకు ఇంత నక్కల్ (వెటకారం) అవసరమా?" అని ప్రశ్నించారు. దానికి త్రిష ఏమాత్రం తగ్గకుండా.. "నా ఇన్విటేషన్ బహుశా మెయిల్‌లో ఎక్కడో మిస్ అయ్యి ఉంటుందిలే" అంటూ తనను ఆ వేడుకకు ఆహ్వానించలేదని పరోక్షంగా బాంబు పేల్చారు. ఆడియో లాంచ్ పోస్టర్లలో ఆమె పేరున్నప్పటికీ, పిలవకుండా పోస్టర్లు వేస్తే ఎలా వస్తారని ఆమె మద్దతుదారులు వాదిస్తున్నారు.

వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు

ప్రస్తుతం త్రిష చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మే 14న విడుదల కానున్న 'కరుపు'తో పాటు మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' (తెలుగు), మోహన్ లాల్‌తో 'రామ్' (మలయాళం) చిత్రాల్లో త్రిష నటిస్తున్నారు. వివాదాలు ఎలా ఉన్నా, మే 4న తన పుట్టినరోజు జరుపుకోబోతున్న త్రిష, ప్రస్తుతం తన 'మే' సీజన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. సూర్య, త్రిష కలిసి నటిస్తున్న 'కరుపు' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మే 14, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

2. 'కరుపు' ఆడియో లాంచ్‌కు త్రిష ఎందుకు హాజరుకాలేదు?

ఆడియో లాంచ్‌కు సంబంధించి తనకు సరైన ఆహ్వానం అందలేదని త్రిష సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇన్విటేషన్ పోస్ట్‌లో మిస్ అయ్యి ఉండవచ్చని ఆమె వ్యంగ్యంగా స్పందించారు.

3. త్రిష నటిస్తున్న తదుపరి తెలుగు సినిమా ఏది?

మెగాస్టార్ చిరంజీవి సరసన సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'లో త్రిష నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది.

4. 'కరుపు' చిత్రంలో త్రిష పోషిస్తున్న పాత్ర ఏమిటి?

ఈ సినిమాలో త్రిష 'ప్రీతి' అనే లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks