...
...
Next Story

Vijay Trisha: విజ‌య్‌ను అన్‌ఫాలో చేసిన త్రిష‌- బ‌ర్త్‌డే విష్ లేదు- భార్య‌కు ద‌గ్గ‌ర‌వుతున్న హీరో- అస‌లేం జ‌రుగుతోంది?

Vijay Trisha: హీరోయిన్ త్రిష, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మధ్య సోషల్ మీడియాలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రతి ఏటా విజయ్ బర్త్‌డేకి స్పెషల్ పోస్టులు పెట్టే త్రిష తాజాగా విషెస్ చెప్పకపోగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను అన్‌ఫాలో చేసిందనే వార్తలు సంచలనంగా మారాయి. దీని వెనుక ఉన్న కారణాలు చూద్దాం.

Published on: Jun 23, 2026, 12:26:56 IST
Advertisement

Vijay Trisha: సినీ పరిశ్రమలో తెర వెనుక సమీకరణాలు ఎంత వేగంగా మారుతుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా స్టార్స్ పర్సనల్ లైఫ్, సోషల్ మీడియా యాక్టివిటీస్ చుట్టూ జరిగే ప్రచారాలు ఒక్కోసారి ఇండస్ట్రీలనే షేక్ చేస్తుంటాయి. ఇప్పుడు కోలీవుడ్‌లో సరిగ్గా ఇలాంటి సెన్సేషనే క్రియేట్ అయింది. స్టార్ హీరోయిన్ త్రిష (Trisha), ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Thalapathy Vijay) ల మధ్య ఇన్‌స్టాగ్రామ్ అన్‌ఫాలో ఇష్యూ ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండింగ్‌గా మారింది.

పర్సనల్ లైఫ్

విజ‌య్‌ను అన్‌ఫాలో చేసిన త్రిష‌- బ‌ర్త్‌డే విష్ లేదు- భార్య‌కు ద‌గ్గ‌ర‌వుతున్న హీరో- అస‌లేం జ‌రుగుతోంది?
విజ‌య్‌ను అన్‌ఫాలో చేసిన త్రిష‌- బ‌ర్త్‌డే విష్ లేదు- భార్య‌కు ద‌గ్గ‌ర‌వుతున్న హీరో- అస‌లేం జ‌రుగుతోంది?

గత కొన్ని నెలలుగా త్రిష, విజయ్ రిలేషన్‌షిప్‌పై నెట్టింట రకరకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఏడాది ఆరంభంలో విజయ్ పర్సనల్ లైఫ్, ఆయన భార్య సంగీత విడాకుల దరఖాస్తు విషయాలు బయటకు వచ్చినప్పుడు ఈ రూమర్స్ పీక్స్‌కు వెళ్లాయి. అయితే ఈ వివాదాలపై ఇద్దరూ ఎప్పుడూ నోరు మెదపలేదు.

బర్త్‌డే రోజున సైలెంట్ షాక్

కానీ, జూన్ 22న విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా ఈ సమీకరణం పూర్తిగా మారిపోయింది. సాధారణంగా ప్రతి ఏడాది విజయ్ బర్త్‌డే రోజున త్రిష తన వద్ద ఉన్న రేర్ ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ విషెస్ చెప్పేది. కానీ ఈసారి ఆమె ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. దీనికి తోడు, ఆమె తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి విజయ్‌ను అన్‌ఫాలో చేసిందనే వార్తలతో ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయనే టాక్ వినిపిస్తోంది.

భార్యకు దగ్గరగా

ఇక త్రిష మార్చిలోనే ఇన్ స్టాలో విజయ్ ను అన్ ఫాలో చేసిందని తమిళ మీడియా చెప్తోంది. మరోవైపు తన భార్య సంగీతకు విజయ్ దగ్గరవుతున్నారనే టాక్ హాట్ టాపిక్ గా మారింది. విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన సంగీతతో తిరిగి కలిసి జీవించాలని విజయ్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కారణాలు ఇవేనా?

  • విజయ్ ప్రస్తుతం కేవలం ఒక సినిమా స్టార్ మాత్రమే కాదు, తమిళనాడు ముఖ్యమంత్రిగా పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పర్సనల్ లైఫ్ లేదా రూమర్స్ ప్రత్యర్థి పార్టీలకు బలమైన అస్త్రాలుగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తన పొలిటికల్ కెరీర్‌కు ఎలాంటి డ్యామేజ్ జరగకూడదనే ఉద్దేశంతోనే ఇద్దరి పీఆర్ టీమ్స్ పరస్పర అవగాహనతో ఈ ‘డిస్టెన్స్’ మెయింటైన్ చేస్తున్నట్లు ఇన్-సైడ్ టాక్.
  • మరోవైపు త్రిష ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో కెరీర్ బెస్ట్ ఫేజ్‌లో ఉన్నారు. అనవసరమైన గాసిప్స్ వల్ల తన ఫిల్మ్ లైనప్‌కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో, సోషల్ మీడియా అటెన్షన్‌ను డైవర్ట్ చేయడానికే ఈ బోల్డ్ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe