గ్లామర్, క్రేజ్, సోషల్ మీడియా వ్యూస్.. నేటి యువత ప్రపంచమంతా దీని చుట్టూనే తిరుగుతోంది. కానీ, అదే క్రేజ్ ప్రాణాల మీదకు వస్తే? ఇదే పాయింట్‌తో రూపొందిన ‘తు యా మై’ సినిమా ట్రైలర్ గురువారం (జనవరి 22) విడుదలైంది. ప్రముఖ దర్శకుడు బిజోయ్ నంబియార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ షనాయా కపూర్, టాలెంటెడ్ యాక్టర్ ఆదర్శ్ గౌరవ్ జంటగా నటించారు.
ఏమిటా కథ?

తు యా మై ట్రైలర్ ప్రారంభం ఓల్డ్ మూవీ ‘ఖూన్ భరీ మాంగ్’ను గుర్తు చేసేలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఇందులో షనాయా కపూర్ ‘మిస్ వానిటీ’ అనే గ్లామరస్ కంటెంట్ క్రియేటర్‌గా కనిపిస్తుండగా, ఆదర్శ్ గౌరవ్ నాలాసోపారాకు చెందిన ‘ఏ’ అనే మాస్ క్రియేటర్‌గా నటించారు.
వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన వీరిద్దరూ వ్యూస్ కోసం, క్రేజ్ కోసం కలిసి వీడియోలు (కొల్లాబరేషన్స్) చేయడం ప్రారంభిస్తారు. వారి మధ్య కెమిస్ట్రీ, చిలిపి పనులు సరదాగానే సాగిపోతుంటాయి. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ బాగా చూపించారు.
కానీ, ఒక అడ్వెంచర్ వీడియో షూట్ కోసం వెళ్లినప్పుడు వీరి జీవితం తలకిందులవుతుంది. ఒక పాడుబడ్డ ఇంట్లోని స్విమ్మింగ్ పూల్‌లో వీరు చిక్కుకుపోతారు. అక్కడ వీరికి ఎదురైంది సామాన్యమైన శత్రువు కాదు.. మనుషుల రక్తం కోసం వేచి చూస్తున్న ఒక భారీ మొసలి. ఆ మొసలి బారి నుంచి ప్రాణాలతో బయటపడటానికి వారు చేసే పోరాటమే తు యా మై.
ట్రైలర్ హైలైట్స్
మూడు నిమిషాల నిడివి ఉన్న తు యా మై ట్రైలర్‌లో షనాయా కపూర్ నటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా మొసలి ఆమెను లాక్కెళ్లేటప్పుడు ఆమె పలికించిన హావభావాలు హృదయ విదారకంగా ఉన్నాయి.
లోతైన టన్నెల్స్ (సొరంగాలు), రక్తంతో తడిసిన పూల్, చీకటి గదులు.. ఇలా ప్రతి ఫ్రేమ్ ఉత్కంఠను పెంచుతోంది. తు యా మై ట్రైలర్ చివరలో మొసలి ఒక శరీరాన్ని అడవిలోకి లాక్కెళ్లడం చూస్తుంటే, సినిమాలో భారీ ట్విస్టులు ఉన్నాయని అర్థమవుతోంది.
నెటిజన్ల రియాక్షన్
{{/usCountry}}లోతైన టన్నెల్స్ (సొరంగాలు), రక్తంతో తడిసిన పూల్, చీకటి గదులు.. ఇలా ప్రతి ఫ్రేమ్ ఉత్కంఠను పెంచుతోంది. తు యా మై ట్రైలర్ చివరలో మొసలి ఒక శరీరాన్ని అడవిలోకి లాక్కెళ్లడం చూస్తుంటే, సినిమాలో భారీ ట్విస్టులు ఉన్నాయని అర్థమవుతోంది.
నెటిజన్ల రియాక్షన్
{{/usCountry}}ఈ రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ తు యా మై ట్రైలర్ ఊపిరి బిగబట్టి చూసేలా చేసింది. భయపెడుతున్న తు యా మై ట్రైలర్‌కు విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది.
“షనాయా కపూర్ నుంచి ఇలాంటి నటన ఊహించలేదు, చాలా ఇంపాక్ట్‌గా ఉంది” అని ఒకరు కామెంట్ చేయగా, “ఆ మొసలికి కళ్లు కనిపించవు, అది కేవలం శబ్దాన్ని బట్టి అటాక్ చేస్తుంది.. అదే ఇందులో అసలైన ట్విస్ట్ కావొచ్చు” అని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
సినిమా విశేషాలు
ప్రముఖ రొమాంటిక్ సినిమాల దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించిన తు యా మై సినిమా ఫిబ్రవరి 13న వాలంటైన్స్ డే కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బ్యాంకాక్‌లోని అందమైన ప్రదేశాల్లో ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ను చిత్రీకరించారు. కంటెంట్ క్రియేటర్ల సంస్కృతిని, ప్రేమని, ప్రాణసంకట స్థితిని కలగలిపి దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచినట్లు తెలుస్తోంది.