...
...
Next Story

Twinkle Khanna: పిల్లల కోసం ఆరాటం, తప్పని దూరం! మాతృత్వంపై మనసులు కదిలించేలా స్టార్ హీరో భార్య ట్వింకిల్ ఎమోషనల్ పోస్ట్!

Twinkle Khanna Post On Motherhood: మాతృత్వంలోని తీపి గుర్తులను, పిల్లలు ఎదిగే కొద్దీ తల్లిదండ్రులు అనుభవించే వేదనను స్టార్ హీరో భార్య, నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా హృద్యంగా చెప్పుకొచ్చారు. తన కుమారుడు ఆరవ్ 20వ పడిలోకి అడుగుపెట్టిన వేళ, ఒక తల్లిగా ఆమె పంచుకున్న ఆలోచనలు నెటిజన్లను కదిలిస్తున్నాయి.

Published on: Mar 9, 2026, 14:32:14 IST
Advertisement

నటిగా కంటే రచయిత్రిగా తనదైన ముద్ర వేసిన హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా.. మాతృత్వం అనే ప్రయాణంలోని ఒడిదుడుకులపై తాజాగా మనసు విప్పారు. తన తల్లి డింపుల్ కపాడియాతో తనకున్న అనుబంధం నుంచి, తన కొడుకు ఎదుగుదల వరకు ఆమె పంచుకున్న విషయాలు ప్రతి తల్లిదండ్రుల మనసును తట్టిలేపుతున్నాయి.

పిల్లల కోసం ఆరాటం, తప్పని దూరం! మాతృత్వంపై మనసులు కదిలించేలా స్టార్ హీరో భార్య ట్వింకిల్ ఎమోషనల్ పోస్ట్!
పిల్లల కోసం ఆరాటం, తప్పని దూరం! మాతృత్వంపై మనసులు కదిలించేలా స్టార్ హీరో భార్య ట్వింకిల్ ఎమోషనల్ పోస్ట్!

పిల్లలు ఎదిగి తమకంటూ ఒక సొంత గుర్తింపును వెతుక్కునే క్రమంలో తల్లిదండ్రుల నుంచి దూరమవ్వడం ఎంత బాధాకరమో, అది అంతే అవసరమని ట్వింకిల్ ఖన్నా విశ్లేషించారు.

తల్లి కళ్లలో ఎప్పుడూ చిన్న పిల్లనే!

తన తల్లి డింపుల్ కపాడియాతో తనకున్న బంధం గురించి ట్వింకిల్ ప్రస్తావిస్తూ.. "తల్లీకూతుళ్ల బంధం ఎప్పుడూ అంత సులభంగా ఉండదు. మా మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, నా వయసు 52 ఏళ్లయినా మా అమ్మ కళ్లలో నేను ఎప్పటికీ ఆ అమాయకపు చిన్న పిల్లనే. నాకు లోకజ్ఞానం తక్కువని ఆవిడ భావన. అందుకే ఎప్పుడూ ఏదో ఒక సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది" అని సరదాగా పేర్కొన్నారు.

దూరం పెరిగినా.. ప్రేమ తరగదు

కుమారుడు ఆరవ్ కుమార్ ఇరవై ఏళ్ల వయసులోకి వచ్చిన తర్వాతే మాతృత్వంలోని అసలైన సవాళ్లు అర్థమయ్యాయని ట్వింకిల్ వివరించారు. "పిల్లలు యుక్తవయసులోకి రాగానే తల్లిదండ్రుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి తలుపులు నిర్మించుకుంటారు. ఆ తలుపుల నుంచి మనం తొంగి చూడొచ్చు కానీ, ప్రవేశం మాత్రం అంత సులభం కాదు" అని ట్వింకిల్ ఖన్నా తెలిపారు.

అస్విత్వం కోసే చేసే పోరాటం

ట్వింకిల్ రాసిన ఈ కథనంపై ఆమె భర్త, స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. "ఈ వారం కాలమ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఆ ముగింపు చదువుతుంటే మా అమ్మ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి" అని ఎక్స్‌ (X) వేదికగా రాసుకొచ్చారు.

ఫ్యాషన్ రంగం వైపు ఆరవ్ అడుగులు

అక్షయ్, ట్వింకిల్ దంపతులకు 2002లో ఆరవ్ జన్మించారు. గత ఏడాది ఆరవ్ 23వ పుట్టినరోజు జరుపుకున్నారు. తన తండ్రిలా సినిమా రంగంలోకి రావడానికి ఆరవ్ ఆసక్తి చూపడం లేదని అక్షయ్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఆరవ్ ప్రస్తుతం లండన్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌పై దృష్టి సారించారు. గతేడాది ఆరవప్ 23వ పుట్టినరోజు సందర్భంగా ట్వింకిల్ ఖన్నా స్పందిస్తూ.. "పిల్లలు మనం పీల్చే గాలి లాంటి వారు. కొద్దిసేపు మన ఊపిరితిత్తుల్లో ఉన్నా, తర్వాతి క్షణంలో విడిచిపెట్టక తప్పదు" అని ఒక అద్భుతమైన పోలికతో కొడుకుపై తనకున్న ప్రేమని చాటుకున్నారు.

టూ మచ్ టాక్ షోతో

వృత్తిపరంగా చూస్తే, ట్వింకిల్ ఖన్నా గతేడాది తన 'మిసెస్ ఫన్నీబోన్స్ రిటర్న్స్' పుస్తకాన్ని విడుదల చేశారు. అలాగే కాజోల్‌తో కలిసి నిర్వహించిన 'టూ మచ్' అనే ఓటీటీ టాక్ షోతో బుల్లితెర, డిజిటల్ ప్రేక్షకులను కూడా అలరించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe