ఓటీటీలో కొత్త వారం సినిమాల సందడి షురూ అయింది. ఈ సందడిని మరింత పెంచేస్తూ రెండు మలయాళం చిత్రాలు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇందులో ఒకటి ఫ్యామిలీ డ్రామా ప్యారడైజ్ కాగా, మరొకటి సర్వైవల్ థ్రిల్లర్ ఉల్లోరుక్కు.
నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళం సినిమాలు

ప్రతి వారం ఓటీటీలోకి కొత్త మలయాళం సినిమాలు వస్తూనే ఉన్నాయి. తెలుగు ఆడియన్స్ కూడా ఈ చిత్రాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెండు మలయాళ సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి.
ఓటీటీ రిలీజ్ డేట్
మలయాళ సినిమాలు ప్యారడైజ్, ఉల్లోరుక్కు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్నాయి. డిసెంబర్ 24న ప్యారడైజ్, డిసెంబర్ 26న ఉల్లోరుక్కు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాబట్టాయి. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు వస్తున్నాయి.
ప్యారడైజ్ స్టోరీ
2024లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా ప్యారడైజ్. దీన్ని శ్రీలంక, ఇండియన్ ప్రొడ్యూసర్లు కలిసి నిర్మించారు. ఈ సినిమాకు ప్రసన్న వితంగే డైరెక్టర్. ఇందులో రోషన్ మాథ్యూ, దర్శన రాజేంద్రన్, శ్యామ్ ఫెర్నాండో కీలక పాత్రలు పోషించారు. ఈ ప్యారడైజ్ సినిమాను పాపులర్ డైరెక్టర్ మణిరత్నం సమర్పించారు.
దొంగతనం
ప్యారడైజ్ పూర్తిగా శ్రీలంకలో తీసిన మూవీ. ఓ జంట తమ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం కోసం శ్రీలంకకు వెళ్తుంది. ఓ గెస్ట్ హౌస్ లో వీళ్లు ఉంటారు. అప్పటికే శ్రీలంకలో ఉద్యమంతో ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. మరోవైపు గెస్ట్ హౌస్ లో దొంగతనం జరుగుతుంది. ఆ తర్వాత ఓ ట్విస్ట్ అదిరిపోతుంది. ఈ మూవీ ఇప్పటికే ప్రైమ్ వీడియోలో ఉంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది.
ఉల్లోరుక్కు స్టోరీ
2024లోనే వచ్చిన మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ ఉల్లోరుక్కు. ఈ సినిమా 2025కు గాను ఉత్తమ మలయాళ సినిమాగా జాతీయ అవార్డు దక్కించుకుంది. దీనికి క్రిస్టో టామీ డైరెక్టర్. ఇందులో ఊర్వశి, పార్వతి తిరువోతు, అర్జున్ తదితరులు నటించారు. కేరళలో వరదలు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సినిమాలు చూపించారు.
డెడ్ బాడీ
{{/usCountry}}2024లోనే వచ్చిన మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ ఉల్లోరుక్కు. ఈ సినిమా 2025కు గాను ఉత్తమ మలయాళ సినిమాగా జాతీయ అవార్డు దక్కించుకుంది. దీనికి క్రిస్టో టామీ డైరెక్టర్. ఇందులో ఊర్వశి, పార్వతి తిరువోతు, అర్జున్ తదితరులు నటించారు. కేరళలో వరదలు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సినిమాలు చూపించారు.
డెడ్ బాడీ
{{/usCountry}}అంజు, రాజీవ్ ప్రేమించుకుంటారు. కానీ థామస్ తో అంజు పెళ్లి జరుగుతుంది. వివాహం తర్వాత అంజు, రాజీవ్ చాలా సార్లు కలుస్తారు. బ్రెయిన్ ట్యూమర్ తో థామస్ చనిపోతాడు. అప్పటికే అంజు ప్రెగ్నెంట్. అందరూ అంజు కడుపులో ఉన్నది థామస్ బిడ్డ అనుకుంటారు. కానీ అది రాజీవ్ సంతానం అని అంజుకు మాత్రమే తెలుసు. అప్పుడే వరదలు రావడంతో థామస్ డెడ్ బాడీని ఇంట్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మూవీ కూడా ప్రైమ్ వీడియోలో ఉంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తుంది.