...
...
Next Story

Udayabhanu OTT: పెద్దవాళ్లకు పుట్టిన బిడ్డను కాదు-స్టేజీపైనే ఏడ్చేసిన ఉదయభాను-ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రొడ్యూసర్ గా!

Udayabhanu OTT: ఎంతో కాలంగా యాంకరింగ్ చేసి ప్రతి తెలుగు ఇంటికి చేరువైన ఉదయభాను ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తారు. ప్రొడ్యూసర్ గా మారి ఓటీటీలో ఓ కొత్త క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను తీసుకొస్తున్నారు. ఈ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్ సందర్భంగా ఉదయభాను ఎమోషనల్ అయ్యారు. స్టేజీపైనే ఏడ్చేశారు.

Published on: Sep 10, 2026, 05:53:32 IST
Advertisement

Udayabhanu OTT: తెలుగు బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో సుదీర్ఘ కాలం అలరించిన ప్రముఖ నటి ఉదయభాను నిర్మించిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్ 'పంచనామా' (Panchanama). ఉదయభాను ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ మోస్ట్ అవైటెడ్ సిరీస్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ కానుంది.

ఉదయభాను ఎమోషనల్

పెద్దవాళ్లకు పుట్టిన బిడ్డను కాదు-స్టేజీపైనే ఏడ్చేసిన ఉదయభాను-క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తో ప్రొడ్యూసర్ గా!
పెద్దవాళ్లకు పుట్టిన బిడ్డను కాదు-స్టేజీపైనే ఏడ్చేసిన ఉదయభాను-క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తో ప్రొడ్యూసర్ గా!

క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘పంచనామా’ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్లో మాట్లాడుతూ సిరీస్ ప్రొడ్యూసర్ ఉదయభాను ఎమోషనల్ అయ్యారు. ‘‘ఎమోషనల్ కాకూడదు అనుకున్నా. కానీ కన్నీళ్లు వస్తున్నాయి. ప్రొడక్షన్ లాంఛ్ చేయాలని 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా. టెలివిజన్ లోనే పుట్టా. నాకు ఎటువంటి రోడ్ మ్యాప్ లేదు’’ అని ఉదయభాను చెప్పారు.

పెద్దవాళ్లు లేరు

‘‘నాకు ఎటువంటి రోడ్ మ్యాప్ లేదు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లేదు. స్టూడియోల ఓనర్లు లేరు. పెద్దవాళ్లకు పుట్టిన బిడ్డను కాదు. 12 ఏళ్ల పిల్లప్పటి నుంచి మైక్ పట్టుకొని పైకి వచ్చా. టాలెంట్ ఉన్నవాళ్ల కోసం ఉదయభాను ప్రొడక్షన్ డోర్ ఎప్పటికీ ఓపెన్ గానే ఉంటుంది’’ అని ఉదయభాను ఎమోషనల్ అయ్యారు.

పంచనామా సిరీస్ ఓటీటీ

ఉదయభాను ప్రొడక్షన్ బ్యానర్ పై ఉదయభాను నిర్మించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘పంచనామా’ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన ఫస్ట్ ఎపిసోడ్ ప్రీమియర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

ఒక్కొక్క మరణం

దర్శకుడు మోహన్ శ్రీవత్స, రచయిత నాగేశ్వర్, కెమెరామెన్ సందీప్‌లు తక్కువ సమయంలోనే నాణ్యతతో కూడిన క్రైమ్ థ్రిల్లర్‌ను తీర్చిదిద్దినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

జీ5 థ్రిల్లర్ వ్యూహం

తెలుగు డిజిటల్ ఓటీటీ స్పేస్‌లో క్రైమ్, థ్రిల్లర్ జోనర్లకు ఉన్న ఆదరణను సొమ్ము చేసుకునేందుకు జీ5 సంస్థ వరుస ఒరిజినల్స్‌ను తీర్చిదిద్దుతోంది. గతంలో వచ్చిన థ్రిల్లర్ సిరీస్‌ల తరహాలోనే 'పంచనామా' కూడా ఇన్వెస్టిగేటివ్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఎమోషన్స్ ను కలిగి ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

సుదీర్ఘ అనుభవం ఉన్న ఉదయభాను నిర్మాణం చేపట్టడం, అలాగే మేధా రెడ్డి, శివాజీ రాజా, సూర్య శ్రీనివాస్, శ్రీజ, రాధికా ప్రీతి, చరణ్ బాబు, శివ కార్తీక్ దండ వంటి అనుభవజ్ఞులైన నటీనటులు నటించడం ఈ ప్రాజెక్ట్‌కు ట్రేడ్ పరంగా మంచి హైప్‌ను తెచ్చిపెట్టింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks