OTT: ఓటీటీలోకి రెండు వారాల్లోనే తెలుగు సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. మరికొన్ని గంటల్లోనే.. ఇంత త్వరగా ఎందుకు?
OTT: 'చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ అవికా గోర్, శ్రీ నందు జంటగా నటించిన సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ 'అగ్లీ స్టోరీ' అప్పుడే ఓటీటీ బాట పట్టింది. థియేటర్లలో రిలీజైన కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ సినిమా ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
OTT: ఓటీటీ ఆడియన్స్‌కు సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి టాలీవుడ్ మూవీ సిద్ధమైంది. అవికా గోర్, శ్రీ నందు లీడ్ రోల్స్‌లో నటించిన ‘అగ్లీ స్టోరీ’ (Ugly Story) డిజిటల్ స్క్రీన్ మీద సందడి చేయబోతోంది. ఈ సినిమా జూన్ 5 నుంచి ప్రముఖ రీజనల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha) లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిలీజైన చాలా తక్కువ గ్యాప్‌లోనే ఈ సినిమా ఓటీటీకి వచ్చేస్తుండటం విశేషం.

14 రోజులకే ఓటీటీకి.. అసలు కారణం ఇదే
ప్రణవ్ స్వరూప్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అగ్లీ స్టోరీ’ సినిమా మే 22న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. కానీ కమర్షియల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయింది. దీంతో థియేట్రికల్ రన్ ముగిసిన వెంటనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ చేసేశారు.
సాధారణంగా పెద్ద సినిమాలకు నాలుగు నుంచి ఎనిమిది వారాల వరకు థియేట్రికల్ విండో అగ్రిమెంట్ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో థియేటర్లలో ఆశించిన వసూళ్లు రాబట్టలేని చిన్న, బడ్జెట్ సినిమాలు చాలా స్పీడ్‌గా ఓటీటీ బాట పడుతున్నాయి.
తమకున్న డిజిటల్ రైట్స్ ద్వారా పెట్టిన ఖర్చును త్వరగా రికవరీ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో నిర్మాతలు వెనుకాడకుండా వెంటనే ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. రీసెంట్‌గా లావణ్య త్రిపాఠి నటించిన ‘సతీ లీలావతి’ సినిమా కేవలం 12 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు ‘అగ్లీ స్టోరీ’ కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ సరిగ్గా 14 రోజుల్లోనే ఓటీటీ ఆడియన్స్ ముందుకు వస్తోంది.
అగ్లీ స్టోరీ అసలు కథేంటి?
ప్రేమ కథలన్నీ అందంగా ఉండవు, కొన్ని కథలు జీవితాంతం మానసిక గాయాలను మిగులుస్తాయనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీశారు. "ప్రతి ప్రేమకథ అందంగా ఉండదు.. కొన్ని కథలు గాయాలు కనిపించక ముందే లోతైన మచ్చలను మిగులుస్తాయి" అని ఆహా ఓటీటీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ఒక మనిషిలో ఉండే విపరీతమైన కోరిక, పగ, సైకలాజికల్ టెన్షన్ చుట్టూ ఈ థ్రిల్లర్ సాగుతుంది. రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాలో శివాజీ రాజా, రవితేజ మహాదాస్యం కీలక పాత్రలు పోషించారు. శ్రావణ భరద్వాజ్ మ్యూజిక్ ఇచ్చారు. మైండ్ గేమ్స్, సస్పెన్స్ ఇష్టపడే ఓటీటీ లవర్స్‌కు ఈ వీకెండ్‌లో 'అగ్లీ స్టోరీ' మంచి ఛాయిస్ అవుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
‘అగ్లీ స్టోరీ’ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ జూన్ 5, 2026 నుంచి 'ఆహా' (Aha) ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
అగ్లీ స్టోరీ సినిమాలో లీడ్ రోల్స్ ఎవరు చేశారు?
టాలీవుడ్ నటి, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్, శ్రీ నందు ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ ప్లే చేశారు.
‘అగ్లీ స్టోరీ’ సినిమా ఏయే భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది?
ఈ సినిమా ఒరిజినల్ తెలుగు వెర్షన్‌తో పాటు, తమిళ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ తమిళ డబ్బింగ్ వెర్షన్‌లోనూ ఆహాలో ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


