...
...
Next Story

Balakrishna Chiranjeevi: ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు కిక్కే.. బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 5 ఫస్ట్ గెస్ట్‌గా మెగాస్టార్?

Balakrishna Chiranjeevi: నందమూరి బాలకృష్ణ అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుంటున్న సూపర్ హిట్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ ఐదో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రేజీ సీజన్ తొలి ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారనే వార్త టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది.

Published on: Oct 27, 2026, 05:47:07 IST
Advertisement

Balakrishna Chiranjeevi: ఆహా (Aha) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న 'అన్‌స్టాపబుల్' షోకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తన స్వాగ్, గెస్ట్‌లను ఆప్యాయంగా పలకరించే విధానం, చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరితో కలిసిపోయే బాలయ్య మనస్తత్వం ఈ షోను సూపర్ హిట్ చేశాయి. టాప్ షోగా నిలబెట్టాయి.

గెస్ట్ గా చిరంజీవి

ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు కిక్కే.. బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 5 ఫస్ట్ గెస్ట్‌గా మెగాస్టార్?
ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు కిక్కే.. బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 5 ఫస్ట్ గెస్ట్‌గా మెగాస్టార్?

ఇప్పటికే నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ అన్‌స్టాపబుల్ షో.. ఇప్పుడు ఐదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ కొత్త సీజన్ మొదటి ఎపిసోడ్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గెస్ట్‌గా రాబోతున్నారని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కు ఇంతకుమించిన కిక్ ఉండదని చెప్పొచ్చు.

40 ఏళ్ల స్నేహం

చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర వీరిద్దరూ ఎన్నోసార్లు పోటీపడినా, వ్యక్తిగతంగా మాత్రం ఒకరికొకరు ఎంతో గౌరవం ఇచ్చుకుంటారు. ఒకవేళ ఈ టాక్ షోలో మెగాస్టార్ అడుగుపెడితే, వీరిద్దరి మధ్య జరిగే సరదా సంభాషణలు, పాత జ్ఞాపకాలు, వ్యక్తిగత విషయాలు ఆడియన్స్‌కు ఫీస్ట్ లాంటివే.

రికార్డులను తిరగరాసేలా

గత నాలుగు సీజన్లలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ వంటి ఎంతో మంది స్టార్ హీరోలు ఈ షోకు వచ్చి సందడి చేశారు. అయితే బాలయ్యకు సమకాలికులైన చిరంజీవి, నాగార్జున లాంటి హీరోలు మాత్రం ఇంకా ఈ షోలో కనిపించలేదు.

చిరంజీవి, బాలయ్య కలిసి ఒకే షోలో కనిపిస్తే ఆ ఎపిసోడ్ వ్యూయర్‌షిప్ పరంగా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. అయితే, దీనిపై ఆహా టీమ్ లేదా మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఓ స్పెషల్ ప్రోమోతో ఈ శుభవార్తను ఫ్యాన్స్‌తో పంచుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఆడియన్స్ అంతా సీజన్ 5 ఎప్పుడు మొదలవుతుందా అని గూగుల్, సోషల్ మీడియాల్లో ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks