Upasana Konidela: వీక్ మగాడిని సంతోషపెట్టడం కోసమా.. ఒక మహిళ నొప్పి మరో ఆడదాని విక్టరీ కాకూడదు.. ఇదే నా వార్నింగ్: ఉపాసన
Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ఓ వర్గం మహిళలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తమ విక్టరీ కోసం ఇతరులను తొక్కేసేవాళ్లను టార్గెట్ చేస్తూ ఉపాసన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Upasana Konidela: రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల శనివారం (అక్టోబర్ 24, 2026) ఒక ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మహిళల సాధికారత, తోటి మహిళలకు మద్దతుగా నిలవడం గురించి ఆమె మాట్లాడిన మాటలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

సొంత విజయాల కోసం
హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో యాంకర్ సుమ కనకాలతో కలిసి పాల్గొన్న ఉపాసన.. మహిళల ఎదుగుదలపై తన పరిశోధనల్లో తేలిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సమాజంలో చాలా మంది మహిళలు తమ సొంత విజయాల కోసం లేదా స్వార్థం కోసం తోటి మహిళలను తొక్కేయడానికి వెనుకాడరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే నా వార్నింగ్!
అలాంటి మనస్తత్వం ఉన్న మహిళలను ఉద్దేశించి ఉపాసన తీవ్రమైన పదజాలంతో హెచ్చరించారు. "తమ సక్సెస్ కోసం లేదా ఒక బలహీనమైన మగాడిని (Weak Man) సంతోషపెట్టడం కోసం వేరొక మహిళను తొక్కేయాలని చూసే ఆడవాళ్లకు ఇదే నా స్ట్రాంగ్ వార్నింగ్" అంటూ ఉపాసన వేదికపై ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఒక మహిళ నొప్పి
సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రయాల్లోని పిల్లల దీన స్థితిని ఈ సందర్భంగా ఉపాసన గుర్తు చేసుకున్నారు. కొందరు మహిళలు చేసిన తప్పులు, అన్యాయాల వల్లే అక్కడ ఎంతోమంది అమాయక పిల్లలు ఆ పరిస్థితిని అనుభవిస్తున్నారని ఆమె చెప్పారు.
"ఒక ఆడపిల్ల కన్నీళ్లు, ఆమె పడే బాధ ఇంకో ఆడదానికి ఎప్పటికీ గెలుపు లేదా సంతోషం కాకూడదు" అని ఉపాసన స్పష్టం చేశారు. సమాజంలో ముందుగా ఈ ఆలోచనా విధానం (మైండ్ సెట్) మారాలని, ఒకరినొకరు తొక్కుకుంటూ వెళ్తే మహిళా లోకానికి ఎప్పటికీ గుర్తింపు రాదని ఆమె హితవు పలికారు.
తోడుగా నిలుద్దాం
మహిళలంతా ఒకరికొకరు తోడుగా నిలబడాలని, అందరూ కలిసికట్టుగా ఎదగాలని ఉపాసన పిలుపునిచ్చారు. స్వార్థంతో ఆలోచించే వ్యక్తులకు తాను ఎప్పుడూ దూరంగా ఉంటానని, నిజాయితీగా తోటివారికి సాయం చేసే మంచి మనసున్న మహిళలనే ఎప్పుడూ తన చుట్టూ ఉండేలా చూసుకుంటానని ఆమె తన ఫీలింగ్స్‌ను పంచుకున్నారు.
యాంకర్ సుమ కాన్ఫిడెన్స్, సక్సెస్‌ను ఉపాసన ఈ వేదికపై ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం ఉపాసన కొణిదెల చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతుండగా, అనేకమంది మహిళలు ఆమెకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి మరోసారి రామ్ చరణ్ భార్య ఉపాసన పేరు ట్రెండింగ్ గా మారింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


