Upasana Konidela: ఉపాసన కొణిదెల పేరు మరోసారి ట్రెండింగ్ గా మారింది. ఆమె అస్సాంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం గువాహటి కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించారు. రెడ్ కలర్ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఉపాసన.. అమ్మవారికి పూలబుట్టలను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆమె ఫొటోలు వైరల్ గా మారాయి.
ఉపాసన న్యూ బిగినింగ్స్

ఈ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. "అమ్మ కామాఖ్య మనలోని దైవత్వాన్ని వెలికితీసి, రాక్షసత్వాన్ని అంతమొందించాలి. న్యూ బిగినింగ్స్.. డివైన్ శక్తి ధర్మ సేవ కర్మ" అంటూ పెట్టిన క్యాప్షన్ మెగా అభిమానులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. అయితే ఈ 'కొత్త ప్రారంభం' దేనికి సంబంధించినదనే వివరాలను ఆమె స్పష్టంగా వెల్లడించలేదు.
ఆ సస్పెన్స్ ఏంటీ?
మెగా కుటుంబంలో ఏ చిన్న ఆధ్యాత్మిక సంఘటన జరిగినా లేదా సోషల్ మీడియా పోస్ట్ వచ్చినా అది సోషల్ మీడియా ట్రెండ్స్‌ను శాసిస్తుంది. ఉపాసన కొణిదెల కేవలం ఒక స్టార్ హీరో భార్యగానే కాకుండా అపోలో హాస్పిటల్స్ అండ్ యువర్ ఆటో కాన్సెప్ట్‌ల ద్వారా పారిశ్రామికవేత్తగా, సామాజిక కార్యకర్తగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు.
గతంలో కూడా ఆమె ఏవైనా కొత్త వ్యాపార ప్రాజెక్టులు, హెల్త్‌కేర్ ఇనిషియేటివ్‌లు లేదా సేవా కార్యక్రమాలు ప్రారంభించే ముందు ప్రముఖ శక్తిపీఠాలను దర్శించుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లకు సిద్ధమవుతున్న తరుణంలో, ఉపాసన 'న్యూ బిగినింగ్స్' అని పేజీలో పేర్కొనడం కొత్త బిజినెస్ వెంచర్ లేదా భారీ సేవా సంస్థ ఆరంభానికి సంకేతమని సినీ అండ్ బిజినెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పిల్లలతో పండగ
ఇటీవలే జన్మాష్టమి పండగను ఉపాసన-రామ్ చరణ్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో వేడుకగా జరుపుకున్నారు. ఈ ఏడాది జనవరి 31న జన్మించిన తమ కవల పిల్లలు అన్వీరా దేవి, శివరామ్‌లకు ఇది తొలి జన్మాష్టమి కావడంతో పూజా కార్యక్రమాల్లో చరణ్, ఉపాసన దంపతులు తమ పెద్ద కుమార్తె క్లిన్ కారాతో కలిసి పాల్గొన్నారు.
పెద్ది విజయంతో
{{/usCountry}}ఇటీవలే జన్మాష్టమి పండగను ఉపాసన-రామ్ చరణ్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో వేడుకగా జరుపుకున్నారు. ఈ ఏడాది జనవరి 31న జన్మించిన తమ కవల పిల్లలు అన్వీరా దేవి, శివరామ్‌లకు ఇది తొలి జన్మాష్టమి కావడంతో పూజా కార్యక్రమాల్లో చరణ్, ఉపాసన దంపతులు తమ పెద్ద కుమార్తె క్లిన్ కారాతో కలిసి పాల్గొన్నారు.
పెద్ది విజయంతో
{{/usCountry}}మరోవైపు రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ చిత్రం 'పెద్ది' ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అనంతరం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. పెద్ది విజయంతో మెగా ఫ్యామిలీ ఫుల్ జోష్ లో ఉంది. మణికట్టుకు సర్జరీ చేయించుకున్న రామ్ చరణ్ ఇప్పుడు సుకుమార్ మూవీ కోసం రెడీ అవుతున్నారు.