...
...
Next Story

ఆ వీడియో చూస్తే నా గుండె నిండిపోతుంది: కవల పిల్లల డెలివరీ వీడియో షేర్ చేసిన ఉపాసన.. మెగాస్టార్ చిరు సంబరం చూశారా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే కవల పిల్లలకు (ఒక బాబు, ఒక పాప) జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ అపురూప క్షణాలకు సంబంధించిన ఒక ఎమోషనల్ వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో పంచుకుంది. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చిరంజీవి ఆనందం వరకు అన్నీ ఇందులో ఉన్నాయి.

Published on: Feb 9, 2026, 22:04:23 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి. జనవరి 31న రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ఈ శుభవార్తను ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా అనౌన్స్ చేశాడు. అయితే తాజాగా ఉపాసన తన ఎక్స్ అకౌంట్లో డెలివరీ రోజు జరిగిన సంఘటనలతో కూడిన ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది. ఇందులో చరణ్, ఉపాసన ఆసుపత్రిలోకి అడుగుపెట్టడం, కుటుంబ సభ్యుల ఉద్వేగం స్పష్టంగా కనిపిస్తోంది.

తాతయ్యగా చిరు సంబరమే వేరు..

ఆ వీడియో చూస్తే నా గుండె నిండిపోతుంది: కవల పిల్లల డెలివరీ వీడియో షేర్ చేసిన ఉపాసన.. మెగాస్టార్ చిరు సంబరం చూశారా?
ఆ వీడియో చూస్తే నా గుండె నిండిపోతుంది: కవల పిల్లల డెలివరీ వీడియో షేర్ చేసిన ఉపాసన.. మెగాస్టార్ చిరు సంబరం చూశారా?

వీడియోలో మెగాస్టార్ చిరంజీవి మనవడు, మనవరాలి రాకపట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆసుపత్రిలో ఎంతో ఓపికగా ఎదురుచూసిన అతడు.. పిల్లలు పుట్టగానే బయటకు వచ్చి శుభవార్త చెప్పాడు. "చాలా కాలంగా, ఎంతోమంది ఇలాంటి శుభఘడియ కోసం ఎదురుచూస్తున్నారు. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఒక బాబు, ఒక పాప మా కుటుంబంలోకి వచ్చారు" అని చిరంజీవి ప్రకటించడం వీడియోలో హైలైట్. ఈ శుభవార్త తెలియగానే ఆసుపత్రి బయట అభిమానులు గులాబీ, నీలం రంగు బెలూన్లను గాలిలోకి వదిలి, డ్యాన్సులు చేస్తూ పండగ చేసుకున్నారు.

ఉపాసన ఎమోషనల్ పోస్ట్..

ఈ వీడియోను షేర్ చేస్తూ ఉపాసన ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. "ఈ వీడియో చూసిన ప్రతిసారీ నా గుండె నిండినట్లు అనిపిస్తుంది. మా చుట్టూ ఉన్న ప్రేమ, బలం, పాజిటివిటీకి నేను ఎప్పుడూ కృతజ్ఞురాలిని. తేజస్వి, మొత్తం అపోలో టీమ్ మాకు అందించిన సేవలు వెలకట్టలేనివి. చరణ్ అభిమానుల ప్రేమ స్వచ్ఛమైనదని నాకు తెలుసు. అయితే మా పిల్లల భద్రతను, ప్రైవసీని మీరు గౌరవిస్తారని, వారిని ఎప్పుడూ కాపాడతారని నేను నమ్ముతున్నాను" అని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా తమ కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.

రామ్ చరణ్, ఉపాసన 2012 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డికి ఉపాసన మనవరాలు అన్న విషయం తెలిసిందే. 2023 జూన్‌లో వీరికి మొదటి సంతానంగా క్లిన్ కారా జన్మించింది. ఇప్పుడు కవలలతో మెగా ఇంట సందడి రెట్టింపయ్యింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ నటించిన చివరి మూవీ 'గేమ్ ఛేంజర్' గతేడాది సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల లోపు వసూళ్లతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' (Peddi) అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks