Bigg Boss Uppal Balu: ఇటీవలే 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' ఆడిషన్స్‌లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన ఉప్పల్ బాలు.. సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష నుంచి తనను ఎలిమినేట్ చేయడంపై మండిపడ్డాడు. ముఖ్యంగా నవదీప్ కు శాపం పెట్టారు.
అసలేం జరిగిందంటే?

డిఫరెంట్ వీడియోస్ తో సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు తెగ పాపులర్ అయ్యారు. నెటిజన్లకు అతని పేరు పరిచయమే. ఈ ఉప్పల్ బాలు తాజాగా బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షకు వెళ్లారు. అతనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. అయితే అగ్నిపరీక్ష నుంచి అతను ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
ఉప్పల్ బాలు ఫైర్
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష నుంచి ఎలిమినేట్ కావడంతో ఉప్పల్ బాలు ఫుల్ ఫైర్ అయ్యారు. తన సోషల్ మీడియా అకౌంట్లలో ఓ వీడియో పోస్టు చేశారు. ఇందులో బిగ్ బాస్ మేకర్స్, ముఖ్యంగా జడ్జ్ గా ఉన్న నవదీప్ పై బాలు సంచలన కామెంట్లు చేశారు.
మిడిల్ క్లాస్
‘‘మిడిల్ క్లాస్ వాళ్లకు మనసు ఉండదా? మేం ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్నిపరీక్షకు వచ్చాం. గ్రూప్ డిస్కషన్స్ లో, ఎగ్జామ్ లో సెలెక్ట్ అయి ఫైనల్ కు వచ్చాం. అక్కడ మాకు ఒక గేమ్ పెట్టకుండా, ఓ టాస్క్ ఇవ్వకుండా మీ వీడియోలు వల్గర్ గా ఉంటాయని, దేనికి పనికొస్తాయని అడిగారు’’ అని ఉప్పల్ బాలు చెప్పుకొచ్చారు.
మీ వీడియోలు ఎందుకు?
‘‘నవదీప్ మీ వీడియోలు ఎందుకు పనికొస్తాయండీ? మీరు సమాజంలో ఎవరికైనా దానం చేశారా? ఓ లక్ష రూపాయలు ఇచ్చారా? ఎవరికైనా పుస్తెమట్టెలు ఇచ్చారా?’’ అని ఉప్పల్ బాలు డైరెక్ట్ గా వీడియోలో అడిగారు.
{{/usCountry}}‘‘నవదీప్ మీ వీడియోలు ఎందుకు పనికొస్తాయండీ? మీరు సమాజంలో ఎవరికైనా దానం చేశారా? ఓ లక్ష రూపాయలు ఇచ్చారా? ఎవరికైనా పుస్తెమట్టెలు ఇచ్చారా?’’ అని ఉప్పల్ బాలు డైరెక్ట్ గా వీడియోలో అడిగారు.
{{/usCountry}}‘‘మీరే తోపులు అని అనుకుంటున్నారు. మీకు అవకాశం ఇస్తే అక్కడున్నారు. అగ్నిపరీక్షకు పిలిచి అవమానించడం కాదు. మీకు కచ్చితంగా తగులుతుంది. నవదీప్ అసలు వదిలిపెట్టను. నాకు న్యాయం జరగాలి’’ అని ఉప్పల్ బాలు డిమాండ్ చేశారు.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కోసం కామనర్లను ఎంపిక చేసేందుకు అగ్నిపరీక్ష నిర్వహించనున్నారని తెలిసింది. ఆగస్టు 15 నుంచి ఈ షో టెలికాస్ట్ కానుంది. అయితే ఇప్పటికే ఆడిషన్లు, టాస్క్ లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ బాలు చేసిన కామెంట్లు వివాదానికి కారణమయ్యాయి. ఈ సారి బిగ్ బాస్ స్టార్ట్ కాకముందే కాంట్రవర్సీ మొదలైంది.