...
...
Next Story

Urfi Javed: 40 వేల జీతం నుంచి లక్షల సంపాదన- తండ్రి వేధింపులు,హీనంగా చూసే మనుషులు: బుల్లితెర కష్టాలపై నటి ఉర్ఫీ జావేద్

Urfi Javed About Bad TV Industry Struggles: చిన్న చిన్న పాత్రలు చేస్తూ టీవీ సెట్స్‌పై ఘోరమైన అవమానాలు ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలను ఇంటర్నెట్ సెన్సేషన్, సీరియల్ నటి ఉర్ఫీ జావేద్ పంచుకుంది. ఇండస్ట్రీలో పడ్డ కష్టాలు, ఆపై సోషల్ మీడియా ద్వారా తన జీవితం ఎలా మారిందో సోహా అలీ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టింది.

Published on: May 29, 2026, 15:16:59 IST
Advertisement

Urfi Javed About Bad TV Industry Struggles: దుస్తుల ఎంపికతో నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ సెలబ్రిటీ, సోషల్ మీడియా స్టార్, బుల్లితెర భామ ఉర్ఫీ జావేద్ తాజాగా తన జీవితంలోని చీకటి రోజులను గుర్తుచేసుకుంది. ఒక సాదాసీదా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి నేడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సెలబ్రిటీగా ఎదిగే క్రమంలో తను పడ్డ కష్టాలను ఆమె బయటపెట్టింది.

లగ్జరీ జీవితం గడపాలని

40 వేల జీతం నుంచి లక్షల సంపాదన- తండ్రి వేధింపులు,హీనంగా చూసే మనుషులు: బుల్లితెర కష్టాలపై నటి ఉర్ఫీ జావేద్ (Photo: Instagram)
40 వేల జీతం నుంచి లక్షల సంపాదన- తండ్రి వేధింపులు,హీనంగా చూసే మనుషులు: బుల్లితెర కష్టాలపై నటి ఉర్ఫీ జావేద్ (Photo: Instagram)

ప్రముఖ హీరోయిన్ సోహా అలీ ఖాన్ నడుపుతున్న పాడ్‌కాస్ట్‌లో ఉర్ఫీ జావేద్ పాల్గొని ముక్కుసూటిగా మాట్లాడింది. చిన్నప్పటి నుంచి లగ్జరీ జీవితం గడపాలని, పెద్ద స్టార్ అవ్వాలని కలలు కన్నానని, కానీ ముంబై గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టాక అసలు వాస్తవాలు తెలిసివచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది ఉర్ఫీ జావేద్.

ఇంటి నుంచి పారిపోయి.. కాల్ సెంటర్‌లో ఉద్యోగం

తన ఫ్లాష్‌బ్యాక్ గురించి ఉర్ఫీ మాట్లాడుతూ.. తండ్రి వేధింపులు తట్టుకోలేక చిన్నతనంలోనే ఇల్లు వదిలి పారిపోయినట్లు చెప్పింది. బతుకుదెరువు కోసం ఢిల్లీలో పిల్లలకు ట్యూషన్లు చెబుతూ, మరోవైపు కాల్ సెంటర్‌లో పనిచేశానని గుర్తుచేసుకుంది.

ఎలాగైనా ముంబై వెళ్లి ఐదేళ్లలో పెద్ద స్టార్ అయిపోయి సొంత ఇల్లు, కారు కొనుక్కోవాలని ఆశపడింది. అయితే సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాక.. ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకపోతే అవకాశాలు రావడం ఎంత కష్టమో తనకు అర్థమైందని తెలిపింది.

సైడ్ క్యారెక్టర్స్ అంటే అంత చులకనా?

సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో కనీసం తన అందానికైనా టెలివిజన్ ఇండస్ట్రీలో తిరస్కరణ ఎదురుకాదని నమ్మి సీరియల్స్ వైపు అడుగులు వేసింది ఉర్ఫీ. అక్కడ కొన్ని సీరియల్స్‌లో అవకాశాలు వచ్చినప్పటికీ అవన్నీ కేవలం సహాయక పాత్రలే (Supporting Roles). టీవీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలు చాలా దారుణంగా ఉన్నాయని ఉర్ఫీ జావేద్ పేర్కొంది.

ఫ్యాషన్ రంగంపై మొదటి నుంచి ఆసక్తి ఉన్నప్పటికీ దాన్నే కెరీర్‌గా ఎంచుకోవాలని ఉర్ఫీ అనుకోలేదు. అయితే సోషల్ మీడియా వాడకం పెరగడంతో ఇంట్లోనే సొంతంగా విభిన్నమైన దుస్తులను (DIY Fashion) తయారుచేస్తూ రీల్స్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే 'బిగ్ బాస్ ఓటీటీ' మొదటి సీజన్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది.

అక్కడ మహిళలు లేదా సెలబ్రిటీలలా కాకుండా చెత్త కవర్లతో (Garbage bags) చేసిన డ్రెస్‌ను వేసుకుని ఒక్కసారిగా ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఆ ఒక్క దుస్తులు తన కెరీర్‌ను మలుపు తిప్పాయని ఉర్ఫీ జావేద్ స్పష్టం చేసింది.

ఆ తర్వాత ఎయిర్‌పోర్టులో స్పోర్ట్స్ బ్రా, జాకెట్ వేసుకున్న వీడియో మరింత వైరల్ కావడంతో ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తన రూట్ మార్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండానే ఈ గుర్తింపు సొంతమైందని, ఒకప్పుడు సీరియల్స్ ద్వారా నెలకు రూ. 40 వేలు సంపాదించిన తాను.. ఇప్పుడు బ్రాండ్ కొల్లాబరేషన్స్ ద్వారా నెలకు సులభంగా రూ. 2 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు వెల్లడించింది.

ఉర్ఫీ జావేద్ సీరియల్స్

2016లో 'బడే భయ్యా కీ దుల్హనియా' సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన ఉర్ఫీ.. చంద్ర నందిని, మేరీ దుర్గా, బేపన్నా, జిజీ మా, దయాన్ వంటి పలు సీరియల్స్‌లో నటించింది. 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లోనూ చిన్న పాత్రలో మెరిసింది. ఇటీవలే ఆమె రియాలిటీ ఓటీటీ షో 'స్ల్పిట్స్‌విల్లా X6' కు నియా శర్మ, కరణ్ కుంద్రా, సన్నీ లియోన్‌లతో కలిసి హోస్ట్‌గా వ్యవహరించింది. ఈ షోలో కుశాల్ తన్వర్ (గుల్లు), కైరా విజేతలుగా నిలిచారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఉర్ఫీ జావేద్ టీవీ ఇండస్ట్రీపై ఎలాంటి వ్యాఖ్యలు చేసింది?

టీవీ సీరియల్స్ సెట్స్‌లో ప్రధాన పాత్రధారులకు తప్ప సహాయక పాత్రలు (సైడ్ క్యారెక్టర్స్) చేసే ఆర్టిస్టులకు కనీస గౌరవం ఇవ్వరని, వారిని చాలా చులకనగా చూస్తారని ఉర్ఫీ జావేద్ సంచలన ఆరోపణలు చేసింది.

2. ఉర్ఫీ జావేద్ జీవితాన్ని మలుపు తిప్పిన షో ఏది?

'బిగ్ బాస్ OTT' (Bigg Boss OTT) సీజన్ 1 లో ఉర్ఫీ పాల్గొనడం ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ముఖ్యంగా చెత్త కవర్లతో ఆమె డిజైన్ చేసిన డ్రెస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

3. కెరీర్ ప్రారంభంలో ఉర్ఫీ జావేద్ సంపాదన ఎంత, ఇప్పుడు ఎంత సంపాదిస్తోంది?

సీరియల్స్‌లో నటిస్తున్నప్పుడు ఉర్ఫీ నెలకు రూ. 40,000 వరకు సంపాదించేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన తర్వాత బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా నెలకు దాదాపు రూ. 2 లక్షల పైనే ఆర్జిస్తోంది.

4. ఉర్ఫీ జావేద్ హోస్ట్‌గా వ్యవహరించిన ఇటీవలి షో ఏది?

ఉర్ఫీ జావేద్ ఇటీవలే ముగిసిన ప్రముఖ రియాలిటీ షో 'స్ల్పిట్స్‌విల్లా X6' (Splitsvilla X6) కు సన్నీ లియోన్, కరణ్ కుంద్రాలతో కలిసి హోస్ట్‌గా వ్యవహరించింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe